Friday, January 23, 2009

అంతం - నీ నవ్వు చెప్పింది..

చిత్రం: అంతం (1990)
సంగీతం: R.D.బర్మన్
గానం: S.P.బాలు
****************
పల్లవి:
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో.. 
ఓ ఓ ల ల లా లా.... ఓ ఓ ల ల లా లా
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో


చరణం 1:
నాకై చాచిన నీ చేతిలోచదివాను - నా నిన్ననీ (2)
నాతో సాగిన నీ అడుగులో - చూసాను మన రేపునీ
పంచేందుకే ఒకరు లేని - బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని - నడకేంతో అలుపో అనీ..

చరణం 2:
నల్లని నీ కనుపాపలలో - ఉదయాలు కనిపించనీ (2)
వెన్నెల పేరే వినిపించనీ - నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగే - చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన - తొలి ముగ్గు పెడుతుందనీ..

చరణం 3:
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు - బరువెక్కునో.. (2)
తనువూ మనసూ చెరి సగమని - పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం - సంపూర్ణ మైయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలతో..
ఓ ఓ ల ల లా లా.... ఓ ఓ ల ల లా లా

నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ - చూపింది నాలో - ఇన్నాళ్ళ  లోటేమిటో..

Wednesday, January 21, 2009

సూర్య s/o కృష్ణన్ - మొన్న కనిపించావు..


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హరీష్ జయరాజ్
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని
రచన: వేటూరి
******************
పల్లవి:
మొన్న కనిపించావు - మైమరచి పోయాను
అందాలతో నన్ను - తూట్లు పొడిచేసావే!..
ఎన్నెన్ని నాల్లైనా, నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను - కాలమే వృధా ఆయెనే!
పరువాల నీ వెన్నెల - కనలేని నా వేదనా
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా - ఉందాం జతగా (2)

చరణం 1:
త్రాసులో నిన్నే పెట్టి - తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది - ప్రేయసికే
ముఖంచూసి పలికే వేళ - తల్లిప్రేమ చూసిన నేను
హత్తుకోక పోతానా అందగాడా!
ఓహ్! నీడ వోలే వెంబడి ఉంటా తోడుగా చెలీ
పొగవోలే పరుగున వస్తా పక్కనే చెలీ
వేడుకలు కలలూ నువ్వు వింతే చెలీ ||మొన్న కనిపించావు ||

చరణం 2:
కడలి నేల పొంగే అందం - అలలు వచ్చి తాకే తీరం
మనసు జల్లుమంటుందే- ఈ వేళలో
తల వాల్చే ఎడమే చాలే - వేళ్ళు వేళ్ళు కలిపేసామే
పెదవికి పెదవికి దూరం ఎందుకే - పగటి కలలు కన్ననింక కులుకులేకనీ
హృదయమంత నిన్నే కన్నా - దరికి రాక నీ
నువ్వు లేక నాకు లేదు - లోకమన్నదే ||మొన్న కనిపించావు ||
వెన్నెలా… వెన్నెలాలాలాలాలాలా...

Surya s/oKrishnan - Nidare kala ayinadee..



చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హరీష్ జయరాజ్
గానం: సుధా రఘునాథన్
రచన: వేటూరి
******************

పల్లవి:
నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ, జతయే అతనన్నది
మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!... || నిదరే కల అయినదీ ||

రణం 1:
వయసంతా వసంత గాలి - మనసనుకో, మమతనుకో
ఎదురైనది ఎడారిదారి - చిగురులతో, చిలకలతో
యమునకు కే సంగమమే - కడలినది, కలవదులే
హృదయమిలా అంకితమై - నిలిచినది, తనకొరకే
పడినముడి, పడుచోడి - ఎదలో చిరుమువ్వల సవ్వడి!

నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ, జతయే అతనన్నది
మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!...

చరణం 2:
అభిమానం అనేది మౌనం - పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం - స్వరములకే దొరకదులే!
నిన్ను కలిసిన ఈ క్షణమే - చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే - పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే - మమకారపు నివాళిలే ఇది!
 
నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ, జతయే అతనన్నది
మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!...
(హమ్)......

సూర్య s/o కృష్ణన్ - నాలోనే పొంగెను నర్మదా!


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హరీష్ జయరాజ్
గానం: హరీష్ రాఘవేంద్ర, దేవన్, V. ప్రసన్న
****************


పల్లవి:
నాలోనే పొంగెను నర్మదా!
నీలల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా -
నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా!
ఓహ్ శాంతి శాంతి ఓహ్! శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే!
చెలి నేనే నీవు అయ్యావే.. // నాలోనే పొంగెను నర్మదా! //

చరణం 1:

ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివర మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయి ముసినవ్వ బూగమెల్ల
నువ్వు నిలిచిన చోటే ఎదో వెలయెంత పలికేను
నువ్వు నడిచే బాటంత మంచల్లె అయ్యేను!
నాతోటి రా.. ఇంటి వరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
ఆ వెనెకే నీడై పోవద్దె
ఇది కలయో నిజమో ఏ మాయో
నా మనసే నీకు వశమాయే! వశమాయే.. // నాలోనే పొంగెను నర్మదా! //

చరణం 2:

కంటి నిద్రే దోచుకెల్లావ్ ఆశలన్నీ చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతూవుంటే వీచే గాలి దిశలు మారు
ఆగేంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింతే కోరలేదు
కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే..
నను తలచే నిముషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.. // నాలోనే పొంగెను నర్మదా! //

రాజా - ఏదో ఒక రాగం పిలిచిందీ..


చిత్రం: రాజా (1999)
రచన: సిరివెన్నెల
సంగీతం: S.A. రాజ్ కుమార్
గానం: S.P.బాలు
***************
పల్లవి:

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ!
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా!! (2)
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు // ఏదో ఒక //

చరణం 1:

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలకముక్కులా నీ అలక జ్ఞాపకం // ఏదో ఒక //

చరణం 2:

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం // ఏదో ఒక //

భలే రాముడు - ఓహో మేఘమాలా..



చిత్రం: భలేరాముడు (1956)
రచన: సదాశివబ్రహ్మం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గానం: ఘంటసాల, పి. లీల
****************


సాకీ:

ఓహొ మేఘమాలా నీలాల మేఘమాల (2)

పల్లవి:

చల్లగ రావేలా.. మెల్లగ రావేలా.. (2)
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా (2)
బెదిరిపోతుందీ కల చెదిరిపోతుందీ
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా..

చరణం 1:

ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ (2)
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ (2)
ఏం..?నిదురపోయే రామచిలుకా (2)
బెదిరిపోతుందీ కల చెదిరిపోతుందీ చల్లగ రావేలా..
మెల్లగ రావేలా.. ఓహొ.. ఓ ఓ ఓ.. ఓహొ.. ఓ ఓ ఓ..

చరణం 2:

ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ (2)
అలంకారమొనరించి మాయచేసి మనసుదోచి (2)
పారిపోతావా దొంగా పారిపోతావా చల్లగ రావేలా.. మెల్లగ రావేలా.. (2)

సితార - కిన్నెరసాని వచ్చిందమ్మా..


చిత్రం: సితార (1983)
సంగీతం: ఇళయరాజా
గాయకులు: S.P.బాలు,
****************


పల్లవి:

కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని
మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //


చరణం 1:

ఎండల్లకన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగే వేలా
నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //


చరణం 2:

మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ -
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని //

Tuesday, January 20, 2009

దశావతారం - ముకుందా ముకుందా కృష్ణా..



చిత్రం: దశావతారం (2008)
రచన: వేటూరి
సంగీతం: హిమేష్ రేష్మియా
గానం: సాధనా సర్గం 
****************


పల్లవి:

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా (2)
వెన్న దొంగవైనా మన్ను తింటివా
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా..
ముకుందా జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలె // ముకుందా //

చరణం 1:

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణస్వామి
పడగ విప్పి మడుపున లేచే సర్పశేషమే
ఎక్కినాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు
నీ ధ్యానంచేయు వేళ విజ్ఞానమేగా అజ్ఞానం
రూపుమాపే కృష్ణ తత్వమేగా అట అర్జునుడోందెను
నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం
ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా
వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే // ముకుందా //

చరణం 2:

మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చిరాముడివై నిలిచావు
కృష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలేన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టి ముడిపడివుంటా ఏదేమైనా
నేనేమదిలోని ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేనూ మనువాడరా.. // ముకుందా //

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - ఏమైందీ ఈ..



చిత్రం: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
రచన: కులశేఖర్
సంగీతం: యువన్ శంకర్ రాజా
గానం: ఉదిత్ నారాయణ్
****************


పల్లవి:

ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేలా
ఎ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం

చరణం 1:

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెల వెల బోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురేవస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే మనసు
మురిసి పాట పాడే తనువు మరచి ఆటలాడే // ఏమైందీ //

చరణం 2:

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కళలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా

ఇంద్రధనుస్సు - నేనొక ప్రేమ పిపాసిని..



నాకిష్టమైన పాటల్లో ఒకటి & భగ్న ప్రేమికులకు చిరు కానుక / అంకితం. 

చిత్రం : ఇంద్రధనుస్సు (1978) 
రచన: ఆచార్య ఆత్రేయ 
సంగీతం: కె.వి.మహాదేవన్ 
గానం: S.P.బాలు 
******************

పల్లవి: 

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది (2) // నేనొక ప్రేమ పిపాసిని.. // 

చరణం 1: 

తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా (2) 
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది // నేనొక ప్రేమ పిపాసిని.. // 

చరణం 2: 

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను 
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను 
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను 
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను // నేనొక ప్రేమ పిపాసిని.. // 

చరణం 3: 

పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు 
సెగ రేగిన గుండెకు చెబుతున్నానీ చెవిన పడితే చాలు 
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు 
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను.. // నేనొక ప్రేమ పిపాసిని.. //

తులసి - నీ కళ్ళతోటి..



చిత్రం: తులసి (2007)
రచన: భాస్కరభట్ల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సాగర్, చిత్ర
****************
పల్లవి:
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం!
నీ చూపు తోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం!
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం!
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం.. // నీ కళ్ళతోటి //

చరణం 1:
అడుగునౌతాను నీ వెంటే నేను - తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతాను ఇకపైన నేను - వానలో నిన్నిలా తడవనీకా
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను - చిరునవ్వునౌతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకిల్లలోన - తొలి సిగ్గు నేనవ్వనా.. // నీ కళ్ళతోటి //

చరణం 2:
వెన్నెలౌతాను ప్రతిరేయి నేను - చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ - నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ - నేనుండిపోతాను
పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ - నుదుటిపైనా వస్తాను చిరుగాలిలా.. // నీ కళ్ళతోటి //

రెడీ - నా పెదవులు నువ్వైతే..

చిత్రం: రెడీ (2008)
రచన: సిరివెన్నెల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సాగర్, గోపికా పూర్ణిమ
***************

పల్లవి:

నా పెదవులు నువ్వైతే - నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే - కల నేనౌతా
నా పాదం నువ్వైతే - నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే - వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా - ఒకే పదానికి ఇలా మనం
జతై సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ // నా పెదవులు //

చరణం 1:

కనిపించని బాణం నేనయితే - తీయతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే - నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే - కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే - జతి నేనౌతా
దివి తాకే నిచ్చెన నేనైతే - దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచే ఉలినే నేనైతే - నీ ఊహలు ఊపిరి పోసేచక్కని బొమ్మను నేనౌతా // నా పెదవులు //

చరణం 2:

వేధించే వేసవి నేనైతే - లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే - మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే -నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే - రా రమ్మంటా
వణికించే మంటను నేనైతే - రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే - ఎరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కర విందే నేనౌతా // నా పెదవులు //

సుమంగళి - కనులు కనులతో..

చిత్రం: సుమంగళి (1964)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఘంటసాల, పి.సుశీల
****************


పల్లవి:

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే..! (2)
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే...!
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు..!
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం..! //కనులు//

చరణం 1:

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివీ (2)
ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని (2)
లేదు ప్రేమకు పేదరికం నే - కోరను నిన్ను ఇల్లరికం (2)
నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం // కనులు//

Monday, January 19, 2009

క్షణ క్షణం - జామురాతిరి జాబిలమ్మా..



చిత్రం: క్షణ క్షణం
సంగీతం: M.M. కీరవాణి
గాయకులు: S.P.బాలు, చిత్ర
******************


పల్లవి:
జామురాతిరి జాబిలమ్మాజోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మా జారనీయకే కలా!
వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన
స్వరాల వూయలు ఊగువేల.. // జామురాతిరి జాబిలమ్మా //

చరణం 1:

కుహు కుహు సరాగాలే శ్రుతులుగా
కుశలమా హమే స్నేహం పిలవగా
కిల కిలా సమీపించే సడులతో
 ప్రతి పొద పదాలే ఓ పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులు గుందని
వనము లేచి వద్దకొచ్చి నిదరపుచ్చని // జామురాతిరి జాబిలమ్మ //

చరణం 2:

మనసులో భయాలన్నీ మరచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో హుశాతీరం వెదకుతూ నిదురతో
నిషరానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి

జామురాతిరి.. జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మజారనియకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన మమ హ్మం...
 హ స్వరాల వూయలు వూగు వేల హ్మ్మ్మ్మం ....

వెలుగు నీడలు - కలకానిది విలువైనదీ..

చిత్రం: వెలుగునీడలు (1961)
రచన: శ్రీ శ్రీ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల
****************


పల్లవి:

కలకానిది విలువైనది బ్రతుకు -కన్నీటి ధారలలోనే బలిచేయకు (2)

చరణం 1:

గాలివీచి పువ్వులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దానీ వదలివైతువా ఓ..
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా! //కలకానిది//

చరణం 2:

అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేల ఓ..
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో! //కలకానిది//

చరణం 3:
అగాధమౌ జలనిధిలోనా ఆనిముత్యమున్నటులె
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే (2)
ఏది తనంత తానై నీ దరికిరాదుశోధించి సాధించాలి.. అదియే ధీరగుణం!! //కలకానిది//

ఒక్కడు - నువ్వేం మాయ చేసావో

చిత్రం: ఒక్కడు (2003) 
రచన: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గానం: శ్రేయా ఘోషాల్
***************


పల్లవి:

నువ్వేం మాయ చేసావో గానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణీ మరీ చిలిపిదీ వయసు బాణీ..
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా ఎటుపోతుందో ఏమో మరి! //నువ్వేం మాయ చేసావో //

చరణం 1:

ఔరా పంచకళ్యాణి పైనా వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేన
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పూవంటి మొగుడేవ్వరే
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా మేళతాళాల మనువెప్పుడే? //ఔరా//

చరణం 2:

కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుకున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిను కలుసుకోనా..
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా అది తీరేది ఎపుడన్నది? //నువ్వేం మాయ చేసావో //

Friday, January 16, 2009

ఏకవీర - ప్రతి రాత్రి వసంత రాత్రి..

చిత్రం: ఏకవీర (1969)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: కె.వి.మహాదీవన్
గానం: ఘంటసాల, S.P.బాలు
****************

పల్లవి:

ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగా సాగాలి
ప్రతినిముషం ప్రియా ప్రియాపాటలాగ సాగాలి... //ప్రతిరాత్రి//

చరణం 1:

నీలో నా పాట కడలి నాలో నీ అందే మెదలి (2)
లోలోన మల్లెపొదలా పూలెన్నో విరిసి విరిసీ (2)
మనకోసం ప్రతి నిముషం మధుమాసం కావాలి
మనకోసమ్ ప్రియా ప్రియా!మధుమాసం కావాలి... //ప్రతిరాత్రి//

చరణం 2:

ఒరిగింది చంద్రవంక వయ్యారి తారక తార వంక (2)
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత (2)
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా!వనమంతా వలచింది ... //ప్రతిరాత్రి//

జల్సా - గాల్లో తేలినట్లుందే...

చిత్రం: జల్సా (2008)
రచన: భాస్కరభట్ల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: టిప్పు, గోపికా పూర్ణిమ
హంమింగ్స్: దేవిశ్రీ ప్రసాద్
******************

పల్లవి:

గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే
ఒళ్ళు ఊగినట్లుందే దమ్ము లాగినట్లుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్లుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రీయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వుఊయలవో నువ్వు నా మనసుకి!

చరణం 1:

హె! నిదురదాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపే పొంగే
అదుపుదాటి మనసే పొంగే - నాలో
గడపదాటి వలపే పొంగె చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె - నీ కొంటె ఊసుల్లో!
రంగులవో నువ్వు రెక్కలవో
నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో
నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి //గాల్లో//

చరణం 2:

తలపుదాటి తనువే పొంగే సిగ్గు దాటి చనువే పొంగే
గట్టు దాటి వయసే పొంగె నాలో
కనులుదాటి చూపే పొంగే అడుగుదాటి పరుగే పొంగే
హద్దుదాటి హాయే పొంగె - నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వుతారకవో నువ్వు నా రాత్రికి //గాల్లో//

భాగ్యరేఖ - నీవుండేదా కొండపై...

చిత్రం: భాగ్యరేఖ (1957)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావ్
గానం: పి.సుశీల
*****************

పల్లవి:

నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేధీ నేలపై
ఏ లీల సేవింతునో - ఏ పూల పూజింతునో -

చరణం 1:

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే
ఈ పేదరాలి మనెస్సేంతో వేచే (2)
నీ పాదసేవ మహాభాగ్యమీవా!
నా పైని దయజూపవా - నా స్వామీ! // నీవుండేదా //

చరణం 2:

దురాననైన కనే భాగ్యమీవా!
నీరూపు నాలో సదా నిల్వనీవా
ఏడుకొండలపైన వీడైనా
స్వామి నా పైని దయజూపవా..నా స్వామీ // నీ వుండేదా //

Tuesday, January 13, 2009

వర్షం - మెల్లగా కరగనీ రెండు మనసుల..

నాకిష్టమైన పాటల్లో ఇదొకటి!

చిత్రం: వర్షం (2004)
రచన: సిరివెన్నెల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: S.P.చరణ్ & సుమంగళి
**************

పల్లవి:

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసమ్
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా!
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం! //మెల్లగా//

చరణం 1:

నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా..
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా!
మతి మతి చెడే చెడే దాహమై అనసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను నిను విడగా.. //ఈ వర్షం //

చరణం 2:

ఏ తెరమరుగైన ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా!
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా!
ఆ వరునునికే రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయసునే నిలుపను ఇకనైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
తన కలయిక చెదరని చెలిమికి ఋజువను చరితను చదివేలా //ఈ వర్షం// & //మెల్లగా//

Saturday, January 10, 2009

హ్యాపీడేస్ - అరరే అరరే! నా మనసే..

చిత్రం: హ్యాపీ డేస్ (2007)
రచన: వనమాలి
సంగీతం: మిక్కి J. మేయర్
గానం: కార్తీక్
*************

సాకీ:

నీకోసం దిగిరానా?- నేనెవరో మరిచానా?
నీడల్లే కదిలానా?- నీ వల్లే కరిగానా?
నా కోసం నేన్లేనా?- మనసంతా నువ్వేనా?
ప్రేమంటే ఇంతేనా?- కాదన్న వింటేనా?

పల్లవి:

అరెరే.. అరెరే..మనసే..జారే..
అరెరే.. అరెరే..వరసే.. మారే..
ఇదివరకెపుడూ - లేదే!
ఇది నా మనసే- కాదే!
ఎవరేమన్నా- వినదే
తనదారేదో - తనదే!
అంతా నీ మాయలోనే - రోజూ నీ నామ స్మరణే!
ప్రేమా! ఈ వింతలన్నీ- నీవల్లనే! // అంతా నీ //

చరణం 1:

స్నేహమేరా- జీవితం అనుకున్నా
ఆజ్ మేరా - ఆశే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా - ముడిపడిపోతున్నా
ఇంకా సెకనుకెన్ని నిముషాలో
అనుకుంటూ రోజు గడపాలా!
మది కోరుకున్న బాల - చాల్లే నీ గోలా.. // అంతా నీ //

చరణం 2:

చిన్ని నవ్వే - చైత్రమై పూస్తుంటే
చెంత చేరి - చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో - తడిసిన మెరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా కనుగొంటి
గుండె కలవరమా అలవాటు లేని పరవశమా! వరమా!- హాయ్ రామా! // అరరే అరరే //

గీతాంజలి- ఓ పాపా లాలీ!..

చిత్రం: గీతాంజలి (1989)
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం: S.P.బాలు
******************
పల్లవి:

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలీ
పాడనా తీయగా-
ఓ పాపా లాలి జన్మకే లాలిప్రేమకే లాలీ పాడనా.. ఓ పాపా లాలీ!..

చరణం 1:

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా..
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరికా..
కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు
పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. ఓ పాపాలాలీ

చరణం 2:

ఓ మేఘమా! ఉరమకే ఈ పూటకి గాలిలో..తెలిపో..వెళ్ళిపో..
ఓ కోయిలా పాడవే నా పాటనీ తీయనీ ..తేనెలే..చల్లిపో!
ఇరుసంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరులా
అల పాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవి.. ఓ పాపాలాలీ

సత్యం - ఓ మగువా నీతో స్నేహం..

చిత్రం: సత్యం (2003)
రచన: భాస్కరభట్ల రవికుమార్
సంగీతం: చక్రి
గానం: చక్రి
*************
పల్లవి:

ఊఁ ఊఁ ఊఁ
ఓ మగువా! ఓ మగువా!!.. ఓ మగువా
నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా!
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!
ఓ మగువా !నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా!
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!!
ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా..(2)
పగలు, రాత్రి - వెతికి, వెతికీ నీకే లైనేశా.. //ఓ మగువా//

చరణం 1:

ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కు లేదు
హలో మైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా..
సన్ లైట్ వేల నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా
ఫుల్ టైం నా గుండెల్లో తాట్లాన్నీ నీవేగా!
ఓ లలనా! ఇది నీ జాలమా! నీ వలన మనసే గాయమా!
కుదురేమో లేదాయే నువునమ్మవు గాని కలవరమాయే..
ఓ మగువా.. ఓ మగువా.. ఓ మగువా.. ఏయ్. // ఓ మగువా//

చరణం 2:

కో అంటే కోటిమంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావే కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి!
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా! ఎదలో ప్రేమే శాపమా!
మనసేమో బరువాయె...
నీ మాటలు లేక మోడైపోయేమగువా..
ఓ మగువా.. ఓ మగువా.. // ఓ మగువా//

గులాబి - ఈ వేళలో నీవూ..

చిత్రం: గులాబీ (1995)
సంగీతం: శశి ప్రీతం
గానం: సునీత
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
****************
పల్లవి:

ఈ వేళలో నీవు, ఏం చేస్తువుంటావు...
అనుకుంటు వుంటాను- ప్రతినిమిషము నేను.
నా గుండె ఏనాడో, చేజారిపోయింది.
నీ నీడగా మారి- నా వైపు రానంది.
దూరాన ఉంటూనే- ఏం మాయ చేసావో-

ఈ వేళలో నీవు, ఏం చేస్తువుంటావో.
అనుకుంటు వుంటాను- ప్రతినిమిషము నేను.

చరణం 1:

నడిరేయిలో నీవు - నిదరైన రానీవు.
గడిపెదేలా కాలమూ - గడిపెదేలా కాలమూ..
పగలైన కాసేపు, పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానమూ .. నీ మీదనే ద్యానమూ..
ఏ వైపు చూస్తున్న - నీ రూపే తోచింది.
నువు కాకా వేరేది - కనిపించనంటోంది.
ఈ ఇంద్రజాలాన్ని - నీవేనా చేసింది.
నీ పేరులో ఏదో - ప్రియమైన కైపుంది.
నీ మాట వింటూనే - ఏం తోచనీకుంది..
నీ మీద ఆశేదో - నన్నిలవనీకుంది!
మతిపోయి నేనుంటే - నువ్వు నవ్వుకుంటావు.

ఈ వేళలో నీవు - ఏం చేస్తువుంటావో
అనుకుంటువుంటాను - ప్రతినిమిషము నేనూ!!
ఈ వేళలో నీవు - ఏం చేస్తువుంటావు అనుకుంటు వుంటానూ...ఊఁ ఊఁ ఊఁ

హ్యాపీడేస్- పాదమెటు పోతున్నా..

సినిమా: హ్యాపీడేస్ (2007)
రచన: వనమాలి
గాయకుడు: కార్తీక్
సంగీతం: మిక్కి J మేయర్
తేదీ: డిసెంబర్ 3, 2008, 12-30 a.m
*********************
పల్లవి:
పాదమెటు పోతున్నా- పయనమెందాకైనా..
అడుగు తడబడుతున్నా- తోడురానా..
చిన్ని ఎడబాటైనా- కంటతడి పెడుతున్నా..
గుండె ప్రతి లయలోన- నేను లేనా!..
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడవైనా..
ఓ - మై ఫ్రెండ్.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా!..
ఓ - మై ఫ్రెండ్.. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా!..

చరణం 1:
అమ్మ ఒడిలో- లేని పాశం..నేస్తమల్లే- అల్లుకుందీ..
జన్మకంతా- తీరిపోనీ-మమతలెన్నో- పంచుతుందీ..
మీరు మీరూ నుంచీ- మన స్నేహగీతం..
ఏరా యేరాల్లోకి మారే..మొహమాటలేవీ- కలే జాలువారే!
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడవైన..
ఓ మై ఫ్రెండ్! తడి కన్నుల్లో నిలిచిన స్నేహమా!..

చరణం 2:
వాన వస్తే- కాగితాలే..పడవలయ్యే- జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే- చిన్ననాటి..చేతలన్నీ- చెంతవాలే..
గిల్లి కజ్జాలెన్నో- ఇలా పెంచుకుంటూ..తుళ్ళింతల్లో- తేలే స్నేహం..
మొదలో- తుదలో, తెలిపే.. ముడి వీడకుందే..
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడవైన..
ఓ మై ఫ్రెండ్! తడి కన్నుల్లో నిలిచిన స్నేహమా!..
Related Posts with Thumbnails