Thursday, November 6, 2008

బిక్షగాళ్ళకి ధర్మం చేస్తున్నారా?

భిక్షగాళ్ళకి ధర్మం చేయబోతున్నారా?..

మనము సాధారణముగా అయినవారితో, బంధు మిత్రులతో పని ఉండో లేక మానసిక ప్రశాంతత కోసమో ఏ దేవుని గుడికో, బీచ్ కో.. వెడతాముగా.. అక్కడ ప్రశాంతముగా ఉన్న సమయములోనే ఈ బిక్షగాళ్ళ బాధ ను ఎదురుక్కోవడం మనకు పరిపాటే. ఎంత అదిలించినా పక్కకు జరగరు కదా! ఇంకా చీకాకును కలగజేస్తారు.. దానితో మనం అంతదూరం కష్టపడి వెళ్లి పొందిన ఆనందం మనకు దక్కకపోగా, అక్కడికి ఎందుకు వెళ్ళాము భగవంతుడా! అని అనుకుంటాము.. మనలో చాలామంది ధర్మం అనో, పుణ్యం అనో, మా తాత ముత్తాతల నుండి ఇలా ఇస్తున్నామనో.. ఈ భిక్షం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.. నేనూ అంతే.. చాలా చిన్నప్పటినుండే ఈ అలవాటు ఉండేడిది.. వారానికి చాలానే ధర్మం చేసేవాడిని.. ఒకరోజు-

అనుకోకుండా నేను "గీత ప్రవచనాలు" కార్యక్రమము ఒక గుడిలో జరుగుతుండగా వెళ్ళటం తటస్థించింది. అక్కడ ఒక విద్వాంసుడు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు, అర్జునినితో అన్న పద్యాలు, వాటి తాత్పర్యాలు అన్నీ చెబుతున్నారు. యధాలాపంగా నేనూ కాసేపు వినడం జరిగింది. నిజంగా భగవద్గీత ఎంత గొప్పది! ఎన్నో యుగాల క్రితం, మహాభారత యుద్ధం చేయనన్న అర్జునునికి ఆ భగవంతుడు చెప్పిన విషయాలు నేటికీ అప్-డేట్ చేసినట్లుండడం విచిత్రం కాక పోతే మరేంటి? అందులో ఒక శ్లోక తాత్పర్యం " దాన ధర్మాలు చేసే ముందు దానం చేసేవాడికినీ, ఆ దానం పుచ్చుకుంటున్న వాడికినీ, కొన్ని యోగ్యతలు ఉండాలి.. దానం చేసేవాడు ...ధర్మముగా సంపాదించినది ఉండాలి (ఇది కాసేపు మనకు అప్రస్తుతం). ఇక దానం పుచ్చుకుంటున్న అతను శారీరకముగా దృఢకాయుడై ఉండరాదు. ముసలివాళ్ళు, అన్నీ కోల్పోయిన వాళ్ళు, అంధులు, అవిటివాళ్ళు.. నిజముగా దానము/భిక్ష ఎవరికి అవసరముగా ఉంటుందో వారికి మనం దానం/భిక్ష వేస్తే, ఆ పుణ్యఫలము ఆ దాతకు, అతని వంశానికి మేలు కలుగజేస్తుంది.." -ఇది ఎంత నిజం కదూ.. ఇది విన్న తర్వాత నేను మారాను. అందరికీ దానం చేసే అలవాటు నుండి నిజంగా అవసరం ఉన్న వారికి ధర్మం చేయటం మొదలెట్టాను.. నిజంగానే ఆపన్నులను ఆదుకుంటున్న ఆనందం నాలో కలుగుతున్నది.. తర్వాత నా స్నేహితులకీ చెప్పి వారినీ మార్చాను. మంచిదే కదా.. మా గ్రూప్ డిస్కషన్లో దీని గురించి చర్చించాము.. అందులోని సారాంశము, నోట్స్, ఆచరించవలసిన పద్దతులు ఈ క్రింద రాస్తున్నాను..

1. ధర్మం/భిక్షానికి గ్రహీతలు అర్హులా, కాదా (చేవ లేనివాళ్ళు, అంగ వైకల్యం ఉన్నవాళ్ళు...) చూడాలి.

2. మనమిచ్చే డబ్బులు పెకాటకో, తాగుడుకో.. ఖర్చు చేసేడివాల్లను పట్టించుకోవాల్సిన అవసరంలేదు.

3. అతిగా వారికి దన ధర్మాలు చేస్తే, కష్టపడడం మానేసి సోమరులవుతారు. ఫలితముగా దేశానికి ఒక సోమరిని తయారుచేసినట్లవుతుంది.

4. కొంతమంది బిక్షగాళ్ళు తమ "కళ"ను చూపి అడుక్కుంటారు.. ఏమి పనిచెయ్యని వారి కన్నా వీరు నయం.

5. ఇంకొంతమంది ధర్మం చేయకుంటే "అధర్మం" కి ( హేళనలు, తిట్లు) దిగుతారు.. వీరికి అస్సలు వేయకూడదు.

మా ఇంటివద్ద పహిల్వాన్ / సూమో సైజులో ఉన్న వ్యక్తి ఒక రూపాయి ఇచ్చినా తీసుకోడు. 2 లేదా 5 రూపాయలు ఇమ్మంటాడు.. దర్జాగా. ఏ పనీ చేయడు.. రాత్రి షాపుల ముందు చల్ల చలిలో వంటిమీద, కింద ఏమి వేసుకోకుండా పడుకుంటాడు కాపలాగా! వారిచ్చే 500 రూపాయలకి (నెలకు) ఆశపడి.. అదొక్కటే అతడి ఆధారం.

6. బిక్షగాల్లలో చాలా మంది మంచి ఆస్తిపరులే..

7. గురువారం మొత్తం సాయిబాబా గుడి వద్ద, శుక్రవారం మద్యాహ్నం మసీదుల వద్ద, ఆతర్వాత షాప్ లలో, శనివారం అంజనేయస్వామీ గుడి వద్ద, ఆదివారం రోజున church వద్ద వారి పని.

2 comments:

కుమార్ దేవరింటి said...

వీళ్ళ సమస్య ప్రక్కన పెడితే , మా ఊళ్ళో ఆదివారం అటు ఆడ ,ఇటు మగ కాని మూడో రకం వాళ్ళు వస్తారు, 10 కి తక్కువ తీసుకోరు, రూపాయో రెండు రూపాయలో ఇస్తే దీనికి ఆ ప్యాకెట్టు కూడా రాదు అని దౌర్జన్యంగా 10 వసుల్ చేస్తారు,ఇక పండగలప్పుడు 100, 500 లే

Raj said...

వారు నాదగ్గరకూ బిక్షం కోసమని వస్తారు. రూపాయి ఇచ్చేసి, పోనీలే అని రెండు, ఐదు రూపాయలు ( రెండింట్లో ఏది ఉంటే అది ) ఇస్తాను. వద్దని, ఇంకా పెద్దవి కావాలని బలవంతం చేస్తారు. " ఇవైనా కావాలా? లేక జేబులో వేసుకోవాలా? నాకు పని ఉంది.. మీ ఇష్టం.." అని అంటాను. చచ్చినట్లు తీసుకుంటారు.. తీసుకోకపోతే ఆ నాణేలని అలాగే వదిలేస్తా.. వేరే ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చేస్తాను. ఇంతవరకూ వారికి ఐదు రూపాయల కన్నా ఎక్కువ ఎవరికీ ఇవ్వలేదు..

Related Posts with Thumbnails