Sunday, February 19, 2012

G Chat on Orkut profile

G Talk (జి టాక్) గురించి మీకు ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. జిమెయిల్ లో అకౌంట్ ఉన్నవారందరికీ అది సుపరిచితమే! ఆ జి చాట్ (గూగుల్ చాట్) లో టెక్స్ట్ చాట్ మాత్రమే కాదు, ఆడియో మరియు వీడియో చాట్ కూడా చేసుకోవచ్చును. అలాగే చిన్న సైజులోని ఫైల్స్ అంటే ఫొటోస్, పాటలు.. అందులో పంపించుకోవచ్చును. ఇన్ని లాభాలు ఉన్న ఆ జి చాట్ ని చాలామంది వాడుతారు.

ఇప్పుడు - ఇంతగా అందరికీ సుపరిచితమైన ఆ గూగుల్ చాట్ ని మీరు మీ జిమెయిల్ అక్కౌంట్ ద్వారానే వాడుకోవటం మీకు తెలిసి, అలాగే వాడుతూనే ఉండి, ఉండొచ్చును. మీకు ఒక ఆర్కుట్ అకౌంట్ ఉండి, అక్కడ మీ స్నేహితులకు స్క్రాప్స్ వ్రాస్తూనే, అక్కడనుండే జి చాట్ ద్వారా మీ స్నేహితులని చాట్ ద్వారా పలకరించటం బహుశా మీకు తెలిసి ఉండక పోవచ్చును. చాలామంది అర్కుటర్స్ కి ఈ విషయం తెలీక, జిమెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి, అందులోంచి గూగుల్ చాట్ ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు.

ఇప్పుడు మీ ఆర్కుట్ అకౌంట్ ద్వారానే గూగుల్ చాట్ ఎలా చేసుకోవచ్చునో ఇప్పుడు తెలియచేస్తున్నాను. నిజానికి ఈ విషయం నాకు రెండున్నర సంవత్సరాల క్రిందటే అనుకోకుండా తెలిసినా, దాన్ని బాగా వాడుకున్నాను. కొద్దిమందికి ఇలా చేసుకోవచ్చునని చెప్పాను. వారు అలా ఫాలో అయ్యి, వారూ శుభ్రముగా వాడేసుకుంటున్నారు.

మీకు ఆర్కుట్ సోషల్ సైట్ అకౌంట్ ఉంటే - ముందుగా ఆ అకౌంట్ ని మీ పాస్ వర్డ్ తో, ఓపెన్ చెయ్యండి. అలా ఓపెన్ చేశాక ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి.
 http://www.orkut.co.in/Main#Application?uid=13168132843810282771&appId=162010468262
లేదా ఈ లింక్ ని కాపీ చేసి, ఇంకో టాబ్ ఓపెన్ చేసి, అందులో పేస్ట్ చేసి, ఓపెన్ చెయ్యండి. అప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ ఇలా అవుతుంది.


ఇలా 1 వద్ద చూపినట్లుగా Post లేదా Unpost లలో ఏదో ఒకటి ఎంచుకొంటే, ఆ తరవాత ఈ క్రింది ఫోటో మాదిరిగా వస్తుంది. 

ఇక్కడ 2 వద్ద చూపినట్లుగా Add Chat app. in your profile ని ఎంచుకోండి. మీ మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ని బట్టి, కాసింత సమయములో మీ ఆర్కుట్ ప్రొఫైల్ కి ఆ అప్లికేషన్ జత చేయబడుతుంది. అది ఆడ్ అయ్యేదాకా బఫరింగ్ జరుగుతూ ఉంటుంది. అది ముగినట్లుగా వచ్చేసేంతవరకూ అలాగే వదిలెయ్యండి. ఆ తరవాత మీ ఆర్కుట్ ప్రొఫైల్ లో గూగుల్ చాట్ కనిపిస్తుంది. 



No comments:

Related Posts with Thumbnails