Tuesday, January 20, 2009

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - ఏమైందీ ఈ..



చిత్రం: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
రచన: కులశేఖర్
సంగీతం: యువన్ శంకర్ రాజా
గానం: ఉదిత్ నారాయణ్
****************


పల్లవి:

ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేలా
ఎ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం

చరణం 1:

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెల వెల బోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురేవస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే మనసు
మురిసి పాట పాడే తనువు మరచి ఆటలాడే // ఏమైందీ //

చరణం 2:

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కళలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా

No comments:

Related Posts with Thumbnails