Thursday, December 11, 2014

Good Morning - 573


చాలామంది ఏదో సాధించాలని అనుకుంటారు తప్ప దానికి తగిన కృషి మాత్రం చెయ్యరు. కారణం : ఓటమి పాలవుతామేమోనన్న భయం. 

అవును.. చాలామంది అలానే చాలా అంచనాలు వేసి, ఏదో సాధించాలని చక్కని ప్రణాళికలు వేస్తారు. కానీ వాస్తవరూపం లోకి మార్చాలనుకున్నప్పుడు ఏదో చెప్పలేని నూన్యత భావానికి గురి అయ్యి అలా చేస్తే, ఎక్కడ ఓటమి పాలవుతామేమో, అందరూ మనల్ని చూసి ఎక్కడ నవ్వుతారేమో అని ఊహించుకుంటూ ఉన్నచోటే ఉండిపోతాం. ఇలా చెయ్యటం వలన మన ఎదుగుదల అక్కడితోనే ఆగిపోతుంది. ఒక అడుగు ముందుకు వేసి, గట్టిగా ప్రయత్నం చేస్తే - ఎంతగానో సాధిస్తామని తెలిసి కూడా అలాగే స్థబ్దుగా ఉండిపోతాం. ఎవరైనా అలా చక్కని ప్రణాళికతో గట్టి ప్రయత్నం చేసి, ముందుకు వెళ్ళితే - ఈర్ష్యా ద్వేషాలతో వారిని వారి చాటుగా ఏదేదో అంటుంటాం. ఇదంతా మన చాతగానితనానికి నిదర్శనం అని మనకి మనమే బయట పెట్టుకుంటున్నట్లు. 

ఇలా ఏదేదో చెయ్యాలనుకొని, ఆగిపోయేవాళ్ళు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి. 
మనకున్నది ఒకే ఒక జీవితం. ఏమి చేసినా, చెయ్యాలనిపించినా - అది ఈ జన్మలోనే చేసెయ్యాలి. 

హా.. అవును. మన అందరికీ ఉన్నది ఒకే ఒక జన్మ. రోజుకి ఉన్నది అవే ఇరవై నాలుగు గంటలే. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సాధించినవాడే గొప్పవాడు అవుతాడు. చరిత్రలో మిగిలిపోతాడు. అలా చెయ్యలేని వాడు - ఈర్ష్యలతో కుళ్ళిపోతూ - చివరికి ఈకలో పేకలా  మిగిలిపోతాడు. ఏది చెయ్యాలనుకున్నా, చెప్పాలనుకున్నా, కలవాలనుకున్నా ఈ జన్మలోనే చెయ్యాలి. చివరికి ఎవరికైనా క్షమాపణలు చెప్పాలనుకున్నా, మన్నించాలనుకున్నా ఈ జన్మలోనే చెయ్యాలి. కారణం : మనకున్నది ఒకేఒక జన్మ. 

ఇక - ఎవడో ఏదో నవ్వుకుంటాడు అని మనం మన ఎదుగుదలని ఆపేసుకుంటే - మనం చాతకానివాడిలా మిగిలిపోయినప్పుడు, మనల్ని చూసి మరింతగా నవ్వుకుంటాడు. ఇక్కడ నా స్వానుభవం చెప్పాలని అనుకుంటున్నాను.  

నేను హాబీగా, కాలక్షేపం + ఆర్థికముగా బాగుంటుందని  నైపుణ్యముతో కూడిన మెషినరీ పని నేర్చుకున్నాను. అందులోకి అడుగిడిన మొదటి సంవత్సరంలో - ఎందుకురా ఈ లంపటం పెట్టుకున్నాను అనిపించింది. నాకు పోటీగా అప్పటికే మరో ఇద్దరు ప్రారంభించారు. వారిద్దరూ చాలా పనివచ్చినవారు. నాకేమీ పనిలో అనుభవం కూడా లేదు. ఎవరో ఏదో అనుకుంటారు అనుకొని చాలా ఆలోచించాను. అపజయం పొందితే ఎవరెక్కడ నవ్వుతారేమో అని ఊహించుకొని, తెగ ఇదయిపోయాను. కానీ అక్కడ నా ఆసక్తి, ఆర్ధిక లాభం, తృప్తీ .. బాగా ప్రేరేపించాయి. అలా మొదలెట్టాను.. అలా అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ, వారిద్దరినీ దాటేసి, నాకు అంటూ పోటీ లేని స్థాయికి చేరుకున్నాను. నాకు పోటీగా మరికొందరు వచ్చినా లాభం లేకపోయింది. వారి వైపల్యాలు చూసి, మరికొందరు ఆ ప్రయత్నాలు చెయ్యక, ఆగిపోయారు. ఇప్పుడు నాకంటూ ఒక గొప్ప కీర్తి. ఆ పని చెయ్యటం వలన నాకు చాలా లాభాలు కలిగాయి. ఇంకా కలుగుతున్నాయి కూడా. మరిన్ని రంగాలలోకి వెళ్ళటానికి - ఆ పని నాకు చక్కని సోపానం అయ్యింది. ఇలా ఒక ముందడుగు నా జీవితాన్ని చాలానే మార్చేసింది. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి.. అవన్నీ మరోసారి చెప్పుకుందాం. 

Thursday, December 4, 2014

Good Morning - 572


ఆరు బయటి ఆటలు ఆడండి. దాని ద్వారా శారీరక. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. 

 అవును.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన జీవన ఉపాధికి  సమయం పోగా, మిగిలిన సమయాన్ని టీవీ ముందు, కంప్యూటర్ ముందో, చిట్ చాటింగ్ కో వాడుతున్నాడు.. కాస్త శారీరక శ్రమని కలిగించే ఆటలు గానీ, పనులని గానీ చెయ్యటానికి ప్రయత్నించడం లేదు.. నిజానికి మనిషి వయస్సు పెరుగుతున్నా కొలదీ తనలో వ్యాధి నిరోధకత లక్షణాలు తక్కువ అవుతూ ఉంటాయి. కండరాలు నెమ్మనెమ్మదిగా క్షీణతకి గురి అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు త్వరగానే జబ్బులకి గురి అవుతుంటారు. ఆ జబ్బుల నుండి బయటపడటానికి మందులు వాడుతుంటారు. కొద్దిరోజుల తరవాత జబ్బులు ఆ మందులకు స్పందించడం మానేస్తాయి. ఇంకా వ్యాధులు ముదరడం మొదవుతుంది. ఫలితముగా మందుల గోళీలు పుట్నాల మాదిరిగా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. పైగా ఆర్ధిక భారం. ఇదంతా అవసరమా...? 

ఈరోజుల్లో కొందరు ఎంత సెన్సిటివ్ గా ఉంటున్నారూ అంటే - ఏసీ లేని ఇంట్లో - పగటి పూట కూడా స్వెటర్, మంకీ క్యాప్ లేకుండా ఉండటం లేదు.. ఇలా వృద్ధులు ఉంటే తప్పులేదు గానీ, యువకులు, యూత్ (30+) ఉంటున్నారు. వారిని చూస్తుంటే చాలా జాలేస్తున్నది. నిజానికి వీరికి ఆ అవసరం లేకుండా చెయ్యవచ్చును.

ప్రొద్దున్నే, లేదా సాయంకాలం సమయాల్లో - కాస్త వ్యాయామం చేస్తే లేదా ఆటలు ఆడితే శరీరానికి శారీరక శ్రమని కలిగించి, కాస్త క్రొవ్వు కరుగుతుంది, లోన కండరాల పటుత్వం పెరుగుతుంది. హార్ట్ బీటింగ్ బాగుంటుంది, శారీరక అందం బాగుంటుంది. వ్యాకర్ధ లక్షణాలు తక్కువ అవుతాయి. శరీరం మునుపటికన్నా మరింత క్రియాశీలముగా ఉంటుంది. శారీరకముగా బాగుంటాం.. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. క్రొత్తగా ఏదో ఆరోగ్యాన్ని మన శరీరానికి అటాచ్ చేసుకున్నట్లుగా భావిస్తాం కూడా. ఇలా ఉన్నప్పుడు మనలో ఆరోగ్యకరమైన ఆలోచనలు మొదలవుతుంటాయి. ప్రొద్దున్నే లేవాలి. వ్యసనాల జోలికి వెళ్ళకూడదు.. ఆరోగ్యకరమైన పనులని చెయ్యాలి అని తీర్మానించుకుంటూ ఉంటాం.. ఇదంతా అందరికీ తెలుసు.. కానీ అంతగా చెయ్యటానికి ఇష్టపడం.. అదే సమయాన యే బార్ కో, రెస్టారంట్ కో వెళ్ళి వినోదిద్దాం అంటే చాలామంది లగెత్తుకొని వస్తారు. ఫలితముగా భవిష్యత్తులో వేలల్లో.. కాదు కాదు లక్షల్లో హాస్పిటల్స్ లలో కుమ్మరించాల్సి వస్తుంది. 


Wednesday, December 3, 2014

Quiz

మీరు ఇంటికి రాగానే కరెంటు పోయి, చీకటిగా ఉంది. మీ దగ్గర క్రొవ్వొత్తి, స్టవ్, అగ్గిపెట్టె ఉన్నాయి. మీరిప్పుడు ఏది ముందుగా వెలిగిస్తారు..?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 

Related Posts with Thumbnails