Saturday, March 31, 2012

Spam Box

ఇలాంటి పోస్ట్ వ్రాయడం ఇది రెండో'సారీ'.. మొదటిది Mark as Spam(er) ఎవరో కానీ నా బ్లాగ్ విజిట్ చేస్తూ, కామెంట్ పెట్టేవారు. అప్పట్లో ఒక పోస్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ, దానికే కామెంట్ పెట్టేవారు. ఆ పోస్ట్ పొరపాటున డిలీట్ అయ్యింది. ఇక అప్పటినుండి ఏదో ఒక పోస్ట్ కి కామెంట్ పెట్టడం చేసేవారు. మొదట్లో కామెంట్ మాడరేషన్ పెట్టేవాడిని కాదు. ఆఖరికి అందరూ కామెంట్స్ పెట్టాలని అనానిమస్ (తమ వివరాలు తెలీకుండా కామెంట్ పెట్టాలని అనుకునేవారు) వారు కూడా కామెంట్ పెట్టాలని అలా సెట్టింగ్ పెట్టాను. ఎందుకూ అంటే - కొన్ని అభిప్రాయాలని వారెవరో తెలీకుండా చెప్పాలనుకున్నవి చెబుతారని. అవి చాలా వరకు మంచివే ఉంటాయి. ఉపయోగకరముగా ఉంటాయని అనుకొని అలా చేశాను. 

అయితే చాలామంది అలా అనానిమస్ కామెంట్స్ పెట్టారు. ఒక కామెంట్ తప్ప మిగిలినవన్నీ పబ్లిష్ చేశాను. అందుకే ఇంకా అనానిమస్ కామెంట్ ఆప్షన్ ని ఇంకా కొనసాగించాను. కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను కూడా. 

అయితే మొదట్లో అర్థం కాని భాషలో వీరు ఒక కామెంట్ పెట్టేసరికి అది మొదట్లో డిలీట్ చేశాను. ఆ తరవాత అలాంటి కామెంట్స్ ఎన్నో వచ్చాయి. అన్నీ అర్థం పర్థం లేని కామెంట్స్ అవి. ఏవేవో లింక్స్ ఉన్నవి అవి. ఇంగ్లీష్, రష్యన్ భాషలో ఉన్నాయి అవి. ఇలా కాదనుకొని కామెంట్ మాడరేషన్ సెట్టింగ్ పెట్టాను. అయినా ఇంకా ఆగటం లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. అలాంటి కామెంట్స్ ఎన్నింటినో డిలీట్ చేశాను కూడా. ఈ కామెంట్స్ పోస్టింగ్ అంతా హైదరాబాద్ నుండే - అని రెండుసార్లు రేసేంట్ విజిటర్స్ లో చూశాను. 

ఈ సంవత్సరం జనవరి ఒకటిన నా స్పాం బాక్స్ ఖాళీ చేశాను. ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి మెయిల్స్ వస్తాయో చూడాలని అనుకున్నాను. ఈ మూడు నెలల్లో 73 (డెబ్బై మూడు) స్పామ్ కామెంట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం చివరివరకూ చూస్తే ఎన్ని వస్తాయో చూడాలి. ఆ విషయం అప్పుడు అప్డేట్ చేస్తాను. 

ఆ కామెంట్స్ అన్నీ అర్థం పర్థం అంటూ ఏమీ ఉండవు. ఏదో, ఏవో ఉంటుంది. ఏదో చూడమనీ, ఫారెక్స్ డీలర్ షిప్ గురించీ ఉంటుంది. ఇంకొన్ని బూతుసైట్ల గురించి ఉంటుంది. మీకు అర్థం కావటానికి ఒక కామెంట్ యొక్క స్క్రీన్ షాట్  (తెరపట్టు) ని చూపిస్తున్నాను. చూడండి. అందులోనే వృత్తం లో చూపిన దాంట్లో ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి కామెంట్స్ వచ్చాయో కూడా చూడండి. 


చూశారు కదూ.. మొత్తం డెబ్బై మూడు కామెంట్స్. అన్నీ అలాంటివే. పబ్లిష్ చెయ్యటానికి పనికిరానివి. ఇలాంటివి మీకు వస్తే మీరు చెయ్యాల్సిందల్లా - ఆ కామెంట్ ప్రక్కన గడిలో ఓకే చేసి, క్రిందన ఉన్న స్పామ్ SPAM ని నొక్కండి. 

ఇప్పుడు ఆ కామెంట్ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతుంది. ఇకనుండీ అలాంటి / ఆ మెయిల్ ID నుండి ఏమైనా కామెంట్స్ వస్తే - మీరు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోనవసరం లేకుండా ఆ మెయిల్ ID నుండి వచ్చేవన్నీ ఆ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతాయి. ఎప్పుడో మీకు వీలున్నప్పుడు ఆ స్పామ్ బాక్స్ చూసి, పనికిరాని కామెంట్స్ ఉంటే - అన్నింటినీ ఒకేసారి డిలీట్ చెయ్యోచ్చును.  మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. 

Friday, March 30, 2012

Blog home page - Upgrade now.

ఇప్పుడు బ్లాగ్ స్పాట్ హోం పేజీ లుక్ మారిపోయింది. నిన్న జిమెయిల్ లుక్ మార్చిన గూగుల్ వాడు, ఇప్పుడు బ్లాగ్ స్పాట్ ని మార్చాడు. ప్రస్తుతం మీ హోం పేజీ నే మార్చాడు. మీ బ్లాగ్ ని మార్చలేదు. ఒకవేళ మీకు మీ బ్లాగ్ హోం పేజీ ఈ క్రొత్త వెర్షన్ లో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇలా చెయ్యండి. 

ముందుగా మీరు మీ స్వంత బ్లాగ్ హోమ్ పేజీ ఓపెన్ చెయ్యండి.. లేదా www.blogger.com లోనికి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యారా.. ఓకే.! ఇప్పుడు మీ హోమ్ పేజీలో ఈ క్రింద ఫోటోలో చూపినట్లుగా 1 వద్ద చూపినట్లుగా ఉంటే, అక్కడ నొక్కటం ద్వారా మీరు నూతన బ్లాగ్ హోమ్ వెర్షన్ లోనికి వెలుతున్నారన్నమాట. 


అలా నొక్కగానే - మీ బ్లాగ్ నూతన వెర్షన్ లో మీ బ్లాగ్ హోమ్ పేజీ - ఈ దిగువదానిలా ఓపెన్ అవుతుంది. ఇలా అంటే అచ్చు ఇలాగే కాదు.. ఆ నమూనా పద్ధతిలో మీ మీ పోస్ట్స్ బట్టి ఉంటుంది. 


చూశారు కదూ. నచ్చితే అలాగే కంటిన్యూ అవండి. లేదా మీ పాత వెర్షన్ లోనే మీ హోమ్ పేజీ బాగుంది అనుకుంటే మీరు ఏం చెయ్యాలీ అంటే - 2 వద్ద చూపినట్లుగా సెట్టింగ్స్ బటన్ నొక్కండి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో మీరు 3 వద్ద చూపినట్లుగా Old Blogger Interface అని వస్తుంది. దాన్ని నొక్కితే మీరు మీ పాత హోమ్ పేజీలోని వస్తారు. 



Thursday, March 29, 2012

లైవ్ కరెంట్ - ఎర్తింగ్

" షాక్ "

ఏమిటబ్బా ఈ ఫ్రిడ్జ్ ఇలా షాక్ కొడుతుందేమిటీ.. అనుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్ లోని నీరు తీయబోతూ అలా షాక్ కి గురయ్యాను. వెనక ఉన్న లోహపు రేకుని మళ్ళీ త్రాకి చూశాను. జిల్ జిల్ మంటూ ఏదో కదిలినట్లుగా ఉంది. ఇలా కాదు అనుకొని, కరెంట్ టెస్టర్ పెట్టి చూశాను. నిజమే!.. కరెంట్ లైవ్ గా ఉంది. అప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు.

కొద్దిగా ఎలెక్ట్రికల్ పని వచ్చు కాబట్టి, క్షణములో మామూలుగా అయ్యాను. ఒక్క ఫ్రిడ్జ్ యేనా? లేదా మిగతా అన్ని సామానులా.. అని అన్నింటినీ టెస్టర్ తో పరీక్షించాను. అన్నింట్లో వాటి మొత్తం బాడీకి కరెంట్ లైవ్ గా ఉంది. అన్నింటికీ ఎర్తింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. షాక్ ప్రభావం అంతగా చూపలేకపోయింది.

సాకెట్ లోని ఎర్తింగ్ పాయింట్ వద్ద టెస్ట్ చేశాను. అందులో లైవ్ గా కరెంట్ ఉంది. సో, ఏదో మూడు పిన్నుల ఎలేక్టికల్ పరికరం పాడు అయ్యిందన్న మాట. ఒక్కో ఎలెక్ట్రికల్ వస్తువులను కరెంట్ సాకెట్ లనుండి తొలగిస్తూ, ఎర్తింగ్ పాయింట్ వద్ద చూస్తూ, పోయాను.

ఫ్రిడ్జ్ ని సాకెట్ నుండి తీసేసినా.. అయినా కరెంట్ ఉంది.
వాషింగ్ మెషీన్.. అయినా ఉంది.
హట్ ప్లేట్.. ఉంది.
రైస్ కుక్కర్.. ఉంది..
కంప్యూటర్.. అయినా కరెంట్ ఉంది.
ఇలా ప్రతీ త్రీ పిన్ కరెంట్ ఉపకరణాలనీ తీసేస్తూ వచ్చాను.
అన్నీ అయిపోయాయి.

ఇక టూ పిన్స్ కి వచ్చాను. మూలగా అమాయకముగా ఉన్న టీవీ మీద దృష్టి పోయింది. దాని కనెక్షన్ వైర్ ని సాకెట్ నుండి తీశాను. చిత్రం.. కరెంట్ ఎర్తింగ్ పాయింట్లో కనిపించటం లేదు.

మళ్ళీ యధావిధిగా టీవీ ప్లగ్ పెట్టాను. ఎర్తింగ్ పాయింట్ లో కరెంట్ లేదు. ఇదేదో చిత్రముగా ఉందే అనుకున్నాను.

మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ యధావిధిగా షాక్.

ఇక లాభం లేదని టీవీ ని చెక్ చేశాను. ఎందుకైనా మంచిది అని టీవీ స్టెబిలైజర్ ని చెక్ చేశా. య్యేస్ - అందులోనే ప్రాబ్లెం. స్టెబిలైజర్ కి ఉన్న అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ లో కూడా లైవ్ గా కరెంట్ వస్తున్నది. ఒఫ్ఫో!..ఇదా సంగతి అనుకుంటూ.. ఎప్పుడో కొన్న, ఎప్పుడూ విప్పని ఆ స్టెబిలైజర్ యొక్క సీల్స్ విప్పి, ఓపెన్ చేశాను.

అందులో బోలెడంత దుమ్ము.. ఆ దుమ్ములోనే ఒక సాలీడు మాత ఎంచక్కా ఫ్లాట్ కట్టుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నది.

ఒక బ్రష్ తో ఆ స్టెబిలైజర్ ని శుభ్రం చేశాను. అప్పుడు ఒక స్క్రూ క్రింద పడింది. ఇది ఎక్కడిదా?.. అని చూశా. అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ ది ఊడిపోయి, క్రింద పడింది. ప్రాబ్లెం అర్థం అయ్యింది. ఆ పాయింట్లో ఉన్న వైర్ అప్పుడప్పుడు తాకుతూ, తాకక పోయేసరికి అలా అవుతున్నది. ఆ సాకెట్ కి ఆ స్క్రూ బిగించాను. అప్పుడు ఎర్తింగ్ పాయింట్లో కరెంట్ లైవ్ గా రావటం ఆగిపోయింది. ఒక చిన్న స్క్రూ వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతుందో చూడండి. ఎర్తింగ్ కనెక్షన్ ఉండటముతో ఈరోజు ఇంకా ఈపోస్ట్ వ్రాస్తున్నాను. లేకుంటే ............ 
Related Posts with Thumbnails