Monday, August 10, 2015

Sri Rukmini, Satybhama sahitha Venugopala swamy temple, Sirsingandla

ప్రయాణాల్లో ఒక్కోసారి అంతగా ప్రాచుర్యం పొందని ఆలయాలకు వెలుతుంటాం. వాటి ఫోటోలు అనుకోకుండా తీసుకుంటాం.. అలాగే నేనూ ఈమధ్య ఒక ఆలయానికి వెళ్లాను. ఓ చిన్న మారుమూల పల్లెటూర్లో ఉన్న శ్రీ రామ ఆలయానికి అనుకోకుండా వెళ్ళాను. వాటి విశేషాలను చూశాను. మామూలుగా ఉన్న చిన్న ఆలయం. కానీ ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉన్నట్లు అనిపించింది. ఆ ఆలయ విశేషాలు ఆన్లైన్లో పెడితే, ఎవరికైనా ఎప్పుడైనా అవసరమున్నప్పుడు - ఆ విశేషాలు ఉపయోగపడతాయని అనిపించి, పెడుతున్నాను. నాకంటూ ఉన్న పోటో కలెక్షన్ ని ఇలా తీర్చుకుంటున్నాను. 

తెలంగాణా లోని మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి దగ్గరలో ఉన్న సిరిసినగండ్ల అనే ఊరికి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాల స్వామీ Sri Rukmini, Satybhama sahitha Venugopala swamy temple, Sirsingandla, Near Siddipet, Telangaana ఆలయానికి వెళ్ళాను. 

చాలా పాతనైనదీ, అక్కడ ఇలా ఒక ఆలయం ఉన్నదనీ చుట్టుప్రక్కల చాలామందికి తెలీదు కూడా. క్రొత్తగా అయ్యవారు పూజారిగా రావటం మూలాన మరుగున పడ్డ ఈ ఆలయం - జీర్ణోద్ధారణ జరిగి, కొద్ది కొద్దిగా అభివృద్ధిలోకి రావటం జరిగింది. నా ఫోటో కలెక్షన్ దాహాన్ని తీర్చుకోవడానికి / దాచుకోవటానికి ఈ టపా.. 

ఈ ఫోటోలు అన్నీ మొబైల్ కెమరాతో  తీశా. నాణ్యత లోపించినందులకు మన్నించండి. చాలా ఫోటోలు  అడ్డముగా 90 డిగ్రీలలో అప్లోడ్ అయ్యాయి. కెమరాలో ఆటో రొటేషన్ మోడ్  లో పెట్టి ఫోటో తీసినందులకు అనుకుంటా.. మామూలుగా ఫోటో చూస్తే సరిగ్గానే ఉంది. అప్లోడ్ చేస్తే తిరిగి ఉంటున్నాయి. వాటిని సరి చెయ్యడం చా కష్టముగా ఉండి, ఎలా ఉన్నాయో అలాగే అప్లోడ్ చేస్తున్నాను. ఈ అసౌకర్యానికి మన్నించండి. బ్లాగుల్లో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు - ఫోటో రొటేషన్ కీలని పెట్టాలని ఇంతకు ముందే ఒకసారి పోస్ట్ పెట్టాను కూడా.. లింక్ : http://achampetraj.blogspot.in/2015/06/we-want-rotate-keys-in-blog-tools.html






















ఆలయ పూజారి 










పై ఫోటో లోనిది - ఆలయానికి ఆనుకొని ఉన్న కళ్యాణ మండపం. 



ఇవి చెదలు / చీమలు పెట్టిన పుట్టలు. 



Saturday, August 8, 2015

Good Morning - 587


గడిచిపోయిన దాని గురించి ఆలోచించి, సమయం వృధా చేయడం కన్నా జరగాల్సింది దాని గురించి ఆలోచించడం మిన్న.. 

అవును.. గతంలో ఇలా జరిగింది, అలా అయ్యింది నాకు అంటూ జరిగిపోయిన సంఘటనల గురించే ఆలోచించుకుంటూ ఉండిపోయే బదులు - ఇకముందు జరగాల్సింది గురించి ఆలోచన చెయ్యడం చాలా మంచిది. ఎందుకంటే గతం గతః. జరిగిపోయిన దాన్ని ఎలానూ పొందలేం, మార్చలేం.. అది చేసిన తాలూకు గాయం / ఫలితాన్ని - వెనక్కు వెళ్ళి మార్చలేం. అలాంటి దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండి, అమూల్యమైన సమయాన్ని వృధా చేసి, చెయ్యాల్సిన సమయంలో చెయ్యాల్సిన పనులని వాయిదా వేసే జీవితాన్ని మరింత క్లిష్టముగా  చేసుకోవడం మంచిది కానే కాదు. అలా చేసేదాని  కన్నా జరిగాల్సింది ఎలా జరగాలి, ఎలా చెయ్యాలి, ఏమి చేస్తే - మరింతగా ఎక్కువ మన్నికగా, ప్రతిభావంతముగా చెయ్యగలం అన్న దిశగా ఆలోచనలు చేస్తే - గతం తాలూకు వైఫల్యాలని కొంతమేరకు తగ్గించుకోవచ్చును. 

Monday, August 3, 2015

Good Morning - 586


మనం అభిమానించే వాళ్ళు ఆనందిస్తే - 
ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. 

అవును కదూ.. మనం ఎంతో ఇష్టపడేవాళ్ళని మనం ఆనందింపచేసే వారు సంతోషముగా ఉంటారు. వారి మొహాల్లోని ఆనందాన్ని చూస్తే మనం ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లకి చాక్లెట్ ఇచ్చినా, దానివల్ల ఆ అమ్మాయి మొహంలోని చిరునవ్వు వల్ల మనకు ఎంతో ఆనందం వేస్తుంది. అలాగే లేనివారికి వారికి కావాల్సింది ఇస్తే - అది పొందాక వారిలోని ఆనందాన్ని చూశాక, వారికి సాయపడ్డాం అన్న తృప్తితో మనకి మరింతగా ఆనందం వేస్తుంది. అది గుర్తుకువచ్చినప్పుడల్లా మనకి మరింతగా మనసుకి సంతోషాన్ని కలిగిస్తూనే ఉంటుంది. 



Related Posts with Thumbnails