Saturday, January 10, 2015

Good Morning - 574


" నీతో ఒకసారి మాట్లాడాలిరా.. " అని నాన్న పిలవగానే గతవారం రోజుల్లో చేసిన తప్పులన్నీ ఒకదాని తరవాత ఒకటి గుర్తుకొచ్చేస్తాయి. నిజమే కదూ.. 

నిజమే కదూ.. అలా నాన్నగారు పిలవగానే మనసులో ఏదో తెలీని గుబులు.. నేనేం తప్పు పని చేశానూ అని ఆలోచనల్లో ఈ కొద్దిరోజుల్లో ఏమేమి చేశామో అన్నీ గుర్తు తెచ్చేసుకుంటాం.. మది అంతా గజిబిజిగా తయారవుతుంది. అప్పటిదాకా మామూలుగా ఉన్న వాళ్ళం అర్థం కాని గందరగోళానికి గురి అవుతాం. ఎంతో ధైర్యం తెచ్చేసుకుని - నాన్నగారి వద్దకి వెళతాం. ఆ సమయాన అక్కడ ఏమి జరుగుతుందో చూసేందుకు వచ్చే మన ఈడువారు, మరెవరూ లేని సమయాన - నాన్నగారు ఒక్కరే ఉన్నప్పుడు కలవటానికి వెళతాం. 

పిలిచిన కారణం ఏదైనా మామూలు విషయమే అయితే - గుండెల మీద నుండి ఎవరెస్ట్ పర్వతం చప్పున దిగిపోయినట్లు అగుపిస్తుంది. మళ్ళీ ఎప్పటిలా మనసు మామూలుగా ఉరుకులు పరుగులు మొదలెడుతుంది. ఈ సందర్భాన్ని కొంతకాలం తరవాత  గుర్తు తెచ్చేసుకుంటే - ఆ పరిస్థితిలో మనం పడ్డ ఆందోళన మన పెదాలపై సన్నని చిరునవ్వుతో, కొంత సిగ్గుతో కూడినదై ఉంటుంది.. 


Wednesday, January 7, 2015

Quiz

పదడుగుల త్రాడుతో కట్టేసిన ఆవు ఇరవై అడుగుల వరకూ ఉన్న గడ్డిని ఎలా మేసింది..?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

Sunday, January 4, 2015

Quiz

ఈ క్రింది చిత్రంలో ఎన్ని త్రికోణాలు / త్రిభుజాలు Triangles ఉన్నాయో చెప్పండి చూద్దాం. 

How many triangles are there in a diamond? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 

ఎలా అంటే : 








Related Posts with Thumbnails