Monday, October 28, 2013

Ramappa Temple - 13

Ramappa Temple - 12 తరవాయి భాగం.

Sree Ramalingeshwara Swamy Temple బయట నుండి ఇలా కనిపిస్తుంది. 

ఆ ఆలయం ప్రక్కన ఉన్న మామిడి చెట్టు క్రింద ఇలా మరో శివలింగం ఉంటుంది. 

ఆలయానికి ఎదురుగా నందీశ్వర స్వామి గద్దె ఉంటుంది. దీని పైకి చేరుటకి - ముందున ఉన్న ఇనుప మెట్ల మీదుగా పైకి ఎక్కాలి. 

కొద్దిగా శిధిలమయిన ఆ నందీశ్వరుని గద్దె. 

ఇలా వచ్చి కూర్చుందా అన్నట్లు అగుపించే నల్లని నంది. 

ఆ నంది గద్దెకి ఇరువైపులా ఉండే ద్వారపాలకులు. 



ఆ నంది పూర్తి రూపం. 

ఆ నందికి చెక్కిన / వేసిన రాతి ఆభరణాలు. 



హ్మ్.. అద్భుత అనుభూతిలో ఉన్నారా ? అలాగే ఉండిపోండి. ఈ టపాతో రామప్ప గుడి Ramappa Temple పర్యటన పూర్తి అయ్యింది. 

( అయిపొయింది - సమాప్తం )


Sunday, October 27, 2013

Ramappa Temple - 12

Ramappa Temple - 11 తరవాయి భాగం.. 
..ఇక రామప్ప గుడిలోని ప్రధాన ఆలయం లోని మండపం పైకప్పు సౌందర్యం గురించి, వర్ణింప వీలుకాదు. అదేమిటో మీరే చూడండి. నాకు మాటలు రావటం లేదు కూడా - అంతగా ముగ్దుడనయ్యాను. 


నిజమే కదూ..

ఈ డిజైన్ ప్రధాన ఆలయ గర్భ గుడి వెలుపలది. ఈ గర్భగుడికి ఇంకా చక్కని డిజైన్స్ ఉన్నాయి కానీ, అనుమతించలేదు. ఇంతకన్నా దాటి కెమరా వెళ్ళలేదు. గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంటుంది. అర్చనలూ, పూజలూ చేసుకోవచ్చును. లోపల ఒక పూజారి ఉంటారు. 

ఈ గర్భగుడి ద్వారం ప్రక్కన ఈ డిజైన్స్ ఉన్నాయి. ఇంతవరకే ఫొటోస్ తీసుకోవటానికి అనుమతిని ఇచ్చారు. కొద్దిగా ప్రక్కన రెండు రాతి త్రాళ్ళు పెనవేసుకొని ఉన్నట్లు ఉన్న నిలువు శిల్పకృతిని ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అది ఇంకా చాలా బాగుంటుంది. 

శ్రీ రామలింగేశ్వర స్వామివారి తూర్పు ద్వారం. ఇందులోంచి అవతలకి వస్తే - నేరుగా ఎదురుగా కూర్చొని ఉన్న నందీశ్వరుని దగ్గరికి చేరుకుంటాం. 

(మరిన్ని మరో టపాలో.. )

Saturday, October 26, 2013

Ramappa Temple - 11

Ramappa Temple - 10 తరవాయి భాగం. 
రామప్ప గుడిలో మరో సంభ్రముగా కనిపించేవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం స్థంభాలు, మధ్యలో ఉన్న పైకప్పు నగిషీ పనితనం. సరిగా పర్యవేక్షణ లేకుండా ఉండి, దానివల్ల కళాకాంతులు కోల్పోయినట్లుండే ఈ ఆలయ శిల్ప సంపద - నిజముగా వెల కట్టలేనివి. ఇంత అద్భుతమైన పనితనం కాపాడి, ముందు తరాల వారికి అందించే బాధ్యత ఆలయ నిర్వాహకులకు ఉంది. 

ఆలయానికి ఎదురుగా ఉండే నాలుగు స్థంభాలలో ఇది ఒకటి. అచ్చు ఇలాగే మరో మూడు ఉంటాయి. వీటి మీద ఉన్న శిల్ప సంపద వెల కట్టలేనివి. చాలా అత్యద్భుతముగా ఉంటాయి. 

ఇదే ఆ అద్భుత శిల్ప సౌందర్యం ఉన్న నాలుగు స్థంభాల మండపం లోని స్థంభాలు. వాటి మీద ఉన్న కళాకృతులు, నునుపుదనం.. ఓహ్! వర్ణింప వీలుకాదు. నేను చూసినవాతిల్లో మాస్టర్ పీస్ అనదగ్గ గొప్ప కళా నిలయాలు. 

ఆ నాలుగు స్తంభాలలో - ప్రతివాటికీ ఉన్న ఈ డిజైన్ ని గమనించారా? చుట్టూ వలయాకృతిలో, సన్నని శిల్ప పట్టిని అలా సున్నితముగా, విరిగిపోకుండా - ఎలా  చెక్కారో, ఎంతగా కష్టపడ్డారో ఒక పట్టాన అర్థం కాదు. ఆలోచిస్తుంటే - ఒక పట్టాన కొరుకుడుపడని శిల్ప సంపద. ఆ పట్టీలోని అన్నింటికీ రంధ్రాలు చెయ్యటం మరీ అద్భుతమనే చెప్పాలి. 


చూశారు కదూ.. నేను చెప్పిన మాటలు నిజమే కదూ..

వీటిల్లో ఉన్న సన్నని గొలుసు డిజైన్స్ చూశారా ? నిజమే అవి అన్నట్లుగా ఎంత బాగా చెక్కారు కదూ.. 

(మరికొన్ని ఇంకో భాగము లో..)

Related Posts with Thumbnails