Tuesday, January 30, 2018

Good Morning - 707


మనం చేసే ప్రతిపనిలోనూ ఆనందం లేకపోవచ్చు..! 
కానీ ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము.. 




Sunday, January 28, 2018

Good Morning - 706


నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు.. 
వారన్నదానికి నువ్వెలా ప్రతిస్పందించావన్నది ముఖ్యం. 
కొన్నిసార్లు తప్పుకొని వెళ్ళిపోవడం కంటే - 
నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది. 




Wednesday, January 24, 2018

Good Morning - 705


మనతో ఏకీభవించే వాళ్ళతో సౌఖ్యముగా ఉండగలం కానీ - ఏకీభవించని వాళ్ళ వల్లే ఎదుగుతాము. 



Tuesday, January 23, 2018

Good Morning - 704


పిల్లలకు జన్మనివ్వడం కంటే ఒక తండ్రికి వేరే గొప్ప ఆనందం లేదు.. 
ప్రతి తండ్రికి గొప్ప తండ్రిగా అనిపించుకోవడమే పెద్ద విజయం. 






Sunday, January 21, 2018

Good Morning - 703


మనిషి తన లోటుపాట్లు తెలిసీ కూడా తనను తాను ఇష్టపడటం మానడు. 
అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అదే ఈ సృష్టి విచిత్రం. 



Thursday, January 18, 2018

Good Morning - 702


మనిషి ఎన్నడూ ఒంటరి కాదు.. భౌతికముగా ఏకాంతముగా ఉన్నప్పటికీ - పదుగురి ఆలోచనలు, ప్రభావం తనని వీడనంత వరకూ అతనికి నిజమైన ఏకాంతం లభించదు. 

Tuesday, January 16, 2018

Good Morning - 701


వందమంది ఉపాధ్యాయుల కన్నా కన్నతండ్రి మిన్న. 

Sunday, January 14, 2018

Good Morning - 700



విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతుల్లో విద్యను భోదించడం ఉపాధ్యాయుల పని. ఉపాధ్యాయుల్లోని సృజనాత్మకతను, అంతర్గత శక్తులను గుర్తించి అవి పెంపొందించే విధముగా ప్రోత్సాహించాలి. 


Wednesday, January 10, 2018

Good Morning - 699


గురువు నుంచి జ్ఞానం పొందాలంటే - శిష్యుడికి ఆయన పట్ల నమ్మకం, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. ఈ రెండే ఆ శిష్యుని సంకల్పాన్ని దృఢ పరుస్తాయి. 



Good Morning - 698



గురువు శిష్యుడి అజ్ఞానపు చీకటిని ప్రారదోలి జ్ఞాన పకాశాన్ని అనుగ్రహిస్తాడు. 

Sunday, January 7, 2018

Good Morning - 697



ఒక విద్యార్ధి నోటు పుస్తకములో ఒక చిత్రాన్ని గీస్తే - అలాంటి వాటికి వేరే నోటు పుస్తకాన్ని వాడాలని ప్రేమగా చెప్పాలి. అలాగే చిత్రకారుడిగా ఎలా ఎదగాలో వివరించాలి. దానికి బదులుగా తనని శిక్షిస్తే - భవిష్యత్తులో ఒక గొప్ప చిత్రకారుడు అవకాశాన్ని అయ్యే అవకాశాన్ని అతడు కోల్పోవచ్చు.. 

Thursday, January 4, 2018

Good Morning - 696


హృదయం ఉన్నది పగలటానికేనేమో.. 
ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది - 
మళ్ళీ పగలటానికేనేమో.. !



Tuesday, January 2, 2018

Good Morning - 695


ఓడిపోయిన ప్రతిసారీ నా మది ఒకమాట అంటుంది. అదేమిటంటే - 
ఇంకో ప్రయత్నంలో నేను ఖచ్చితముగా గెలుస్తానని.. 

Related Posts with Thumbnails