Sunday, October 29, 2017

Good morning - 676


మానసికముగా ఇష్టపడండి. 
కానీ శారీరకముగా ఇష్టపడకండి.. 
శరీరం ఈరోజు ఉన్న అందముగా రేపటికి ఉండదు. 



Tuesday, October 24, 2017

Good Morning - 675


ఒంటరిగా పయనిస్తున్న నా జీవితంలోకి - 
అనుకోకుండా వచ్చావు..!
నా గమ్యం నీవైన క్షణాన - 
నా నుండి దూరముగా వెళ్ళిపోయావు.. 
నీవు లేని ఈ జీవితంలో - 
అనుభవాలే కానీ అనుభూతులు లేవు.. 



Saturday, October 21, 2017

Good Morning - 674


ఇదిగో.. ఇప్పుడే.. నువ్వటు వెళ్ళావో లేవో 
నా మనస్సంతా ఎదో చెప్పలేని వెలతి 
అంతా శూన్యం.. 
భరించలేని శూన్యం.. 




Wednesday, October 18, 2017

Good Morning - 673


హృదయానికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి కన్నీళ్లు కారతాయి - అది ప్రేమ. 
కళ్ళనుండి కన్నీళ్లు కారినప్పుడు హృదయం నొప్పి పెడుతుంది - అది స్నేహం. 





Thursday, October 12, 2017

Good Morning - 672


రేపటి దినం ఎంత అందమైనదో ఈరోజు అంతకన్నా అద్భుతమైన రోజు.. 
అనుక్షణం ఆనందించు.. ఆస్వాదించు.. 




Tuesday, October 10, 2017

Good Morning - 671



మనిషి తన నుండి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు. 
తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. 
దానికి తీవ్ర సాధన కావాలి. 




Thursday, October 5, 2017

[తెలుగుబ్లాగు:22483] కి నా జవాబు

[తెలుగుబ్లాగు:22483] BhutEbhya&@H  ani koditE భుతేభ్యః Ya vattu last lo vasthondi Bha prakkana raavadaaniki nenu emi cheyyali? అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు : 

మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు కావలసిన పదాన్ని తెలుగులో చూపించారు. అది చూస్తే - మీకు కావలసిన పదం (  భుతేభ్యః  ) మీకు వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అలా వచ్చాక కూడా మీరు అలా ఎలా టైప్ చెయ్యాలో మళ్ళీ అడిగినట్లుగా తికమకగా ఉంది. అయిననూ మీకు సమాధానంగా ఈక్రింది తెరపట్టుని చూపిస్తున్నాను. అందులో మీకు పరిష్కారం కనిపించవచ్చు. 

గూగుల్ తెలుగు లిప్యంతరములో : 


లేఖిని లో : 


ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు నాకు ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలను ఇకమీదట అడిగే ఈ బ్లాగర్స్ గ్రూప్ సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. 

1. మీరు టైప్ చెయ్యాలనుకుంటున్న పదం ని టైప్ చెయ్యడం రాకపోతే - దాన్ని ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి మెయిల్ తో బాటుగా పంపండి. దాన్ని చూశాక ఎలా దాన్ని టైప్ చెయ్యాలో చెప్పడం ఇతర సభ్యులకు తేలికగా ఉంటుంది. 

2. మీరు అడుగుతున్న పదం ఎలా టైపు చెయ్యాలన్నది - ఇంస్క్రిప్ట్, లేఖిని..... లాంటి సైట్లలోనా లేక గూగుల్ వారి లిప్యంతరం లోనా అన్నది కూడా తెలియచెయ్యండి. ఇది ఎందుకంటే ఈ రెండింటిలో కాస్త వేరుగా టైప్ చెయ్యాల్సి ఉంటుంది. పైన ఉన్న తెరపట్లలో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. చాలామంది ఇక్కడే అయోమయానికి గురి అవుతారు. మీరు ఇంస్క్రిప్ట్ లో టైప్ చెయ్యాలని అనుకొని అది ( ఇంస్క్రిప్ట్ అని ) ప్రస్తావించకుండా అడిగితే - సభ్యులు లిప్యంతరం లో గనుక మీకు సమాధానం ఇస్తే - అది మీకు సరియైన పరిష్కారంగా తోచదు. అందువల్ల మీరు ఎందులో టైపింగ్ చేస్తున్నారో  తప్పనిసరిగా చెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి. 

3. మీరు టైప్ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పుడు పదాన్ని - ఎలా వస్తున్నదో గ్రూప్ లోని ఇతర సభ్యులకు చూపించడానికి - దాన్ని స్క్రీన్ షాట్ ( తెరపట్టు ) తీసి, పోస్ట్ చెయ్యండి. మీ సమస్య ఏమిటో తోటి బ్లాగర్స్ కి బాగా అర్థం అవుతుంది. 

- అచ్చంపేట్ రాజ్  



Related Posts with Thumbnails