సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం స్నేహం. 
తీపినే కాదు చెడుని కూడా పంచుకొనేది స్నేహం. 
సంతోషంలో నీతో చేతులు కలిపి, 
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని.. 
నిన్ను బాధ్యతలనుండి మరలిపోకుండా 
నీవెంటే ఉంటూ నిన్ను వెన్ను తట్టి నడిపించేది - స్నేహం. 
అవును... ఈలోకములో చాలా మధురమైనది వాటిల్లో ఈ స్నేహం కూడా ఒకటి. నిజమైన స్నేహంలో  - మన జీవితాన ఉండే తీపినే కాదు.. చేదుని కూడా పంచుకుంటుంది.నీ సంతోషములో  పాలు పంచుకుంటూ, బాధల్లో నీకు అండగా ఉంటూ, నీవు నిర్వర్తించాల్సిన బాధ్యతలను వెంటే ఉండి గుర్తు చేస్తూ, అందులో అండగా, సహాయకారిగా ఉంటూ - నీ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముందుకు నడిపించేదే స్నేహం.. 
ఇలాంటి స్నేహం నాకు లభించినదని చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను.. 

 
 








 
 
 
 
 
 
 
 

