Sunday, March 26, 2017
Friday, March 24, 2017
Stone turning Mortar
మన చుట్టూ ఉన్న వస్తువులు ఎంతో ఆధునికతని సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ నమ్మశక్యం కాని రీతిలో ఎంతగానో అభివృద్ధి చెందుతూనే ఉంది. పాతవస్తువులు కూడా క్రొత్తగా ఆధునిక రూపుని పొందుతున్నాయి. బండగా ఉండే బండ వస్తువులు కూడా క్రొత్తగా, నాజూకుగా మారి, షోకేసుల్లో పెట్టుకునేలా తయారవుతున్నాయి. అలాంటిదే - అలా ఆధునికంగా మారిన ఒక వంటింటి పనిముట్టుని పరిచయం చేద్దామని ఈ పోస్ట్.
మొన్న అలా మార్కెట్ గుండా వస్తుండగా సూదంటురాయిలా ఒక బండి నన్ను ఆకర్షించింది. చూసిన క్షణమే అదేమిటో, దాని తయారీ వెనక ఉన్న శ్రమ, ఇప్పటి పనితనం వెనుక ఉన్న విజ్ఞానం, తయారీ నేర్పు.. ఏమిటో అర్థమయ్యాయి. ధర అందుబాటులో గనుక ఉంటే ఒక కలెక్షన్ పీస్ లా దాచుకోవాలని వెంటనే అనుకున్నాను. ఆ బండి వద్దకు వెళ్లాను. చేతుల్లోకి తీసుకొని చూశాను. సన్నని రాతి పౌడర్ చేతులకు అంటుకొని చేతులు మురికి అవుతున్నా పట్టించుకోలేదు. నాకు అది అపురూపముగా తోచింది. ఆ వస్తువుని నేను ఏమాత్రం వాడకున్నా అంత బాగా తయారీ ఉన్న దాన్ని తప్పక తీసుకోవాలనుకున్నాను.
సుత్తి, ఉలితో చెక్కిన రోలు సాధారణముగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అవి కాస్త రఫ్ గా ఉంటాయి. వాటినే ఇప్పుడు నాజూకుగా చేస్తున్నారు. అదే ఇది. టేకు చెక్కలని సంగడి Turning పట్టించి చేసే పద్ధతిలోనే గ్రానైట్ రాయినీ డైమండ్ టూల్స్ సహాయాన గుండ్రముగా తిరిగే లేత్ మెషీన్ మీద తొలచి వీటిని తయారుచేస్తున్నారు. ఇవి తమిళనాడు లో తయారు అవుతాయని చెప్పాడు. రాతిని కూడా అలా సంగడి పట్టి, చెయ్యటం ఇదే తొలిసారిగా, ప్రత్యక్షముగా చూస్తున్నాను. యూట్యూబ్ లో Stone turning lathe అని టైపు చేసి వెదికితే చాలా వీడియోలు కనిపిస్తాయి. ఈ క్రింది ఫోటోల మీద డబల్ క్లిక్ చేసి, చూస్తే వాటి పనితనం, అందం కనిపిస్తాయి.
ధర ఎంతనో అడిగా.. రెండువందల యాభై రూపాయలు చెప్పాడు. చివరకు నూటా యాభై Rs. 150 కి ఇచ్చాడు. నేను కాస్త పరిశీలనగా చూస్తుంటే - అది నల్లని గ్రానైట్ తో చేసినదనీ, నీటిలో కడిగితే, ఆ పైన ఉన్న పౌడర్ వెళ్ళిపోయి, నల్లని గ్రానైట్ కనిపిస్తుందని చెప్పాడు. కడిగీ చూపించాడు. నిజమే.. నల్లని గ్రానైట్ తో చేసినదే అది. ఇందులో ఇంకా చిన్నవీ, సన్నగా ఉన్నవీ ఉన్నాయి కూడా. కానీ సన్నగా ఉండి, వాడకములో పగిలి ఎక్కువ రోజులు రావేమో అని వద్దనుకున్నాను.
Thursday, March 23, 2017
Wall Hanging Cover box
ఈ మధ్యన ఏమీ తోచక ఉంటే - అటూ ఇటూ చూసినప్పుడు కొన్ని సన్నని బీడింగ్ చెక్క ముక్కలు కనిపించాయి. అవి - ఉపయోగించగా మిగిలిన ముక్కలు. వాటితో ఏమైనా చేసుకుంటే - వాటి రద్దీ పోతుంది కదా.. అని అనుకున్నాను. వాటితో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తే - కాగితాలు, ఉత్తరాలు, కవర్లూ.. దాచుకొనే స్టాండ్ Wall Hanging Cover box చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. సరే అని ముందుగా అది నాకు ఏ విధముగా ఉండాలో, ఎలాగ నాకు ఉపయోగపడాలో వివిధ ఆలోచనను చేసి, స్కెచ్ వేసి, ఒక రూపానికి ఒకే చేసి, ఇక మొదలెట్టాను.
ఆ మిగిలిన బీడింగ్ చెక్క ముక్కలూ, కాసిన్ని సన్నని మేకులూ, చెక్కలని అతికే జిగురు, ఒక చిన్న సుత్తె, ఒక హెక్సా బ్లేడ్.. ని వాడి ఈ క్రింది రూపాన్ని తయారుచేశాను.
దీన్ని చాలా త్వరగానే చేసాను. నిజానికి వడ్రంగి పని నా అభిరుచి మాత్రమే.. దైనందిక జీవితములోని వత్తిడిని ఎదురుకోవడానికి, అందులో ఉండే వత్తిడి నుండి బయటపడేందుకు ఇలాంటివి చేస్తుంటాను. నాకు అది అవసరమయ్యే విధముగా ముందే ఆలోచించాను, స్కెచ్ వేసుకున్నాను కాబట్టి చెయ్యటం కాస్త తొందరగానే అయ్యిందనిపించింది. మొత్తం చేసాక - దాన్ని ఆరబెట్టి, ఆతర్వాత దాన్ని సాండ్ పేపర్ కి రుద్ది, నునుపు చేశాను. ఆ తరవాత టచ్ వుడ్ ని ఒక సింగల్ కోటింగ్ వేసి, ఆ తరవాత దాన్ని వాడుకోవడం మొదలెట్టాను. నా తయారీని మీరూ చూడండి.
Bottom side view |
Left side view |
Right side view |
Top side view |
Top view |
Ready for use |
ఎలా ఉంది? బాగానే చేశాను కదూ..!!
Tuesday, March 21, 2017
Thursday, March 16, 2017
Sunday, March 12, 2017
Wednesday, March 8, 2017
Friday, March 3, 2017
Good Morning - 629
కాలం - ఎన్నడూ స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది. నిన్నటి బికారి నేడు ఈలోకంలోనే అత్యంత సంపన్నుడు కావోచ్చును. నేటి కోటీశ్వరుడు రేపు బిచ్చగాడిలా మారిపోవచ్చును. నిన్న, నేడు, రేపు ఎలాంటి పరిణామాలనైనా కలిగించవచ్చు. మనిషి విజ్ఞతతో ఈ మూడు కాలాలను సద్వినియోగం చేసుకొని, జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాలాన్ని వృధా చేసి, చేతులు కాల్చుకోకూడదు..
Wednesday, March 1, 2017
Subscribe to:
Posts (Atom)