Monday, January 30, 2017
Sunday, January 22, 2017
Thursday, January 19, 2017
జెండా వందనం రోజున డ్రెస్ కోడ్..
వీరులారా! వందనములు.
ప్రతీ జెండా వందనానికి తప్పక వెళ్ళే నాకు - అప్పటి జెండా దినోత్సవం నన్ను బాగా నిరాశపరిచింది. అసలు కార్యక్రమం బాగా జరిగినా వేరే విషయాలు నన్ను మానసికముగా బాధించాయి. కొందరు వ్యక్తులు లీడర్లలాగా ఖద్దరు దుస్తులు వేసుకొని వచ్చి, నానా హంగామా చేశారు. అంతా వారిదే అన్నట్లు చేశారు. అది నాకు నచ్చలేదు. ఎవరినీ ఏమీ అనలేకపోయా.. కానీ అది నా మదిలో అలాగే ముద్రపడిపోయింది. దీనికి విరుగుడు ఏమిటా అని ఆలోచించా.. అది సింపుల్ గా ఉండి, ఖద్దరు రాజకీయ నాయకుల డ్రెస్ కన్నా చాలా బాగుండాలి, అది వేసుకుంటే గౌరవం గా కనిపించాలి, వారి హంగామాని దెబ్బకొట్టేలా ఉండాలి అని ఆలోచించా.. కానీ ఏమీ తట్టలేదు.. ఇది కొద్ది సంవత్సరాల క్రిందట జరిగింది.
రెండు సంవత్సరాల క్రిందట అనుకుంటా.. అలా షాపింగ్ వీధుల గుండా వెళుతున్నప్పుడు ఒక బట్టల కొట్టు బాగా ఆకర్షించింది. ఆ బట్టల కొట్టు కన్నా ఆ షాప్ బయట వ్రేలాడదీసిన మిలిటరీ సైనికుల డ్రెస్ ని పోలిన టీ షర్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది.
Military dress T shirt ( Google images ) |
వెంటనే దగ్గరగా వెళ్ళి చూశా... దానిని చూస్తుంటే ఏదో తెలీని భావావేశం నాలో క్రమక్రమముగా నాలో పెరగసాగింది. అలా దాన్ని చూస్తుండగానే - ఆ రంగుకీ, ఆ డిజైన్ కీ ముగ్దుడినైపోయాను. "మళ్ళి మళ్ళి ఇది రానిరోజు" సినిమాలో హీరోతో అథ్లెట్ షూస్ ఎలా మాట్లాడుతాయో, అచ్చు అలాగే ఈ టీ షర్ట్ నాతో మాట్లాడిందనిపించింది. ఇక ఆగలేకపోయాను. ఆ టీ షర్ట్ ని కోనేసేయాలన్న ఆత్రుతగా ఆ షాప్ లోకి వెళ్ళి అడిగాను. ఆ షాప్ వాడు రెండొందలు అని చెప్పాడు. బట్ట మామూలుగా ఉన్నా, పైన ఉన్న ఆర్మీ డిజైన్ బాగుందని తీసుకున్నాను. అది అచ్చు పై ఫోటోలో ఉన్న టీ షర్ట్ లాగే ఉంది. అదే రంగూ, డిజైన్ కూడా.
అది నా చేతికి వచ్చాక ఎంతో సంతోషమేసింది. ఏదో గొప్ప వస్తువునేదో నేను పొందినట్లు అనుభూతి. గాల్లో తేలినట్లు అగుపిస్తున్నది. దాన్ని ఎప్పుడు ధరిద్దామా అన్నట్లుగా ఉన్నాను.
ఇంటికి వచ్చాక వేసుకొని చూశా.. చక్కగా అమరింది. అందులో నేను బాగున్నాను అనిపించింది. అప్పుడే నాకు ఒక ఆలోచన కలిగింది. (అప్పట్లో) త్వరలోనే వస్తున్న రిపబ్లిక్ డే నాడు వేసుకొని జండా వందనానికి వెళితే ఎలా ఉంటుందీ అనీ..
ఎస్.. గుడ్ ఐడియా... నిజముగా అత్యంత అద్భుతముగా ఉంటుంది. దేశ రక్షణకి ఎంతగానో పాటుపడుతున్న సైనికుల వీరత్వానికీ, త్యాగానికి ప్రతీకగా - నేనూ ఒక దేశ సైనికుడినే అన్న ఆలోచనతో ఈ డ్రెస్ తో జెండా వందనానికి వెళితే చాలా అపూర్వముగా ఉంటుంది అనిపించింది. ఈసారికి ఈ ఆలోచనని అమలుచెయ్యాలనుకున్నాను.
ముందు రోజున - సైనికుల మాదిరిగానే నా తలకట్టుని చిన్నగా చేయించాను. నున్నగా షేవ్ చేశాను. కొద్దిగా అథ్లెటిక్ బాడీ ఉన్న నేను రిపబ్లిక్ డే నాడు జండా వందనానికి వెళ్లాను. నా బైక్ ని కాస్త దూరముగా ఆపి, కార్యక్రమానికి నడుచుకుంటూ వెళ్లాను. అప్పటికే అక్కడ రాజకీయ నాయకుల ఖద్దరు బట్టల్లో - ఎప్పటిలా నాయకులు హంగామా చేస్తున్నారు.
నన్ను చూడగానే వారు వారి హంగామా ని ఆపేశారు. అందరి దృష్టీ నామీద పడింది. కొందరు ఆహా! అన్నట్లు చూశారు. మరింకొందరు మెచ్చుకున్నారు.. ఇంకొందరు మాత్రం పుల్లవిరుపుగా మాట్లాడారు.. " మన జండా వందనానికి మిలిట్రీ మ్యాన్ వచ్చాడు.. స్పెషల్ పర్సన్.." అంటూ ఏదేదో అన్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. అసలు వారి మాటలేమీ వినిపించడం లేదు అదేమిటో గానీ.. నాలోపల అంతా ఒక ఉద్విగ్న భావన నాలో ఉంది. గుండెల నిండా అదే పరచుకున్నప్పుడు ఈ రాజకీయుల మూకల మాటలు ఎలా వినపడతాయి? ఇది ఆ డ్రెస్ వేసుకుంటే వచ్చే గొప్పదనం కాబోలు.. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నాను.
జెండా వందన కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమం అంతా నేను ఒక సైనికుడిలాగే చేస్తూ పోయాను. చాలా గర్వముగా సెల్యూట్ చేశాను. ఒక అత్యంత అద్భుత భావన నాలో కలిగింది. కార్యక్రమం ముగిసింది.
ఖద్దరు దుస్తుల్లో ఉన్న ఒకతను నా దగ్గరికి వచ్చి, " ఏం! మామా!.. ఈ డ్రెస్ లో వచ్చావు..? సూపర్ గా ఉన్నావు.. " అన్నాడు. ఆ గొంతులో కాస్త వెటకారం కనిపించింది.
" కావాలనే, నాకిష్టమై వచ్చాను ఇలా. దేశాన్ని దోచుకొనే రాజకీయుల ఖద్దరు కన్నా, దేశాన్ని అనుక్షణం కాపాడే సైనికుల పరాక్రమాన్నీ, త్యాగాన్ని చూపించే ఈ డ్రెస్ కన్నా అసలు సిసలు డ్రెస్ ఏమున్నది? నిజానికి అందరూ ఈ డ్రెస్ లోనే వస్తే - ఈ వందన దినోత్సవానికి ఒక చక్కని అందం వస్తుంది.. దేశ భక్తీ పెరుగుతుంది..." అన్నాను. " ఇది వేసుకొని వస్తే - నవ్వుకొనే వారికి వారి ఖర్మ, అజ్ఞానం, అది వారి మానసిక స్థితి అని అనుకుంటాను.. "
అప్పటి నుండీ గత రెండు సంవత్సరకాలము నుండీ ప్రతి జెండా వందనానికి అదే డ్రెస్ తో వెళుతున్నాను.
ఈసారీ అదే డ్రెస్ కోడ్ తో వెళ్ళబోతున్నాను.
మీరూ వెళ్ళడానికి ప్రయత్నించండి.
మీ తోటివారినీ అలా వెళ్ళటానికి ప్రేరణని ఇవ్వండి.
ఆరోజున జీన్స్, సూట్స్, సఫారీలు కాకుండా కనీసం ఉడుతా భక్తిగా నైనా ఈ డ్రెస్ తో వెళదాం..
దేశాన్ని అహర్నిశలూ కాపాడే సైనికుల పరాక్రమానికీ, త్యాగానికి గుర్తుగా మనమూ ఒక చక్కని దేశభక్తిగల సైనికుడిగా మారుదాం..
Tuesday, January 17, 2017
Friday, January 13, 2017
Quiz
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 22
ఎలా అంటే :
మూడు గుర్రాలు మొత్తం 30 అంటే ఒక్కో గుర్రం విలువ = 30 / 3 = 10
ఒక గుర్రం + రెండేసి రెండు గుర్రం నాడాలు విలువ = 18. ఇక్కడ గుర్రం విలువ 10 అని తెలుసు కాబట్టి రెండేసి గుర్రం నాడాల రెండు సెట్ల విలువ = 18 - 10 = 8. ఇప్పుడు ఒక్కో రెండు గుర్రపు నాడాల సెట్ విలువ = 8 / 2 = 4
ఒక సెట్ గుర్రపు నాడాలు - ఒక జత గమ్ బూట్ల సెట్ విలువ = 4 - 2 = 2
ఇక్కడ రెండు బూట్ల విలువ = 2
అంటే ఒక్కో గమ్ బూటు విలువ = 1
ఒక గమ్ బూటు + ఒక గుర్రం x ఒక గుర్రం నాడా విలువ ఎంత అంటే :
= 1 + 10 x 2
= 11 x 2
= 22
Tuesday, January 10, 2017
Khaidi Number 150 punch dialogues
Khaidi Number 150 punch dialogues
ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా,
నచ్చితేనే చూస్తా..
కాదని బలవంతం చేస్తే - కోస్తా..
పొగరు నా వంట్లో ఉంటుంది.
హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది.
కార్పోరేట్ బీర్లు త్రాగిన బాడీ నీదిరా..!
కార్పోరేషన్ నీళ్ళు త్రాగిన బాడీ నాది.
పెట్టుకోకు.. ఆఫ్టర్ గ్యాప్..
బాస్ ఈజ్ బ్యాక్.
జస్ట్ టైం గ్యాప్ అంతే!
టైమింగ్ లో గ్యాప్ ఉండదు..
Monday, January 2, 2017
Wireless Optical Mouse repairing
నేను సిస్టం కొన్నప్పుడే దానితో బాటే మైక్రోసాఫ్ట్ వైర్ లెస్ కీబోర్డ్ Wireless key board కొన్నాను. అప్పటి నుండీ నేటివరకూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కీ బోర్డ్ వాడుతూనే ఉన్నాను. గత సంవత్సర కాలం నుండీ మౌస్ లో ఎదో తేడా వచ్చి, మానిటర్ స్క్రీన్ మీద కర్సర్ కదిలిపోవడం మొదలెట్టింది. అంటే కర్సర్ మానిటర్ స్క్రీన్ మీద ఒకదగ్గర ఉండకుండా వణుక్కుంటూ ప్రక్కకి కదిలిపోయేది. ఏదైనా సెలెక్ట్ చెయ్యడం, మార్కింగ్ చెయ్యటం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇలా కాదనుకొని, ఇంకో మౌస్ కొనడానికి నిర్ణయించుకున్నాను.
కొనే ముందు ఒకసారి ఈ మౌస్ సంగతి తేల్చుకోవాలనుకున్నాను. ఒకసారి దాన్ని తెరచి ఏమైందో చూడాలనుకున్నాను. నాకున్న హాబీలలో - రిపేర్లు చెయ్యటం కూడా పిచ్చ పాషన్. రిపేర్ వల్ల అది బాగయితే - క్రొత్త మౌస్ కొనాల్సిన అవసరం తప్పిపోతుంది. బాగు కాకుంటే ఎలాగూ కొనబోతున్నాను కదా.. వదులుకొనే ముందు చివరివరకూ ప్రయత్నిస్తే - ఒక చిన్న ఆత్మ సంతృప్తి ఉండిపోతుంది - చివరికి వరకూ ప్రయత్నించాం అనీ..
ఇదే నా సిస్టం వైర్లెస్ మౌస్.. @ పాడయిన మౌస్.
ముందుగా మౌస్ తీసుకొని చూశా.. విడదీయటం ఎలా అనీ.. లోపల స్క్రూస్ ఉండొచ్చు అని అనుకున్నాను. పైన ఉన్న బ్యాటరీ సెల్స్ కవర్ తెరిచాను. 2.0 వర్షన్ మౌస్ కాబట్టి AA సైజు బ్యాటరీలు ఉన్నాయి.
స్క్రూల కోసం వెదికితే - ప్రక్కగా రెండు స్క్రూలు కనిపించాయి. వాటిని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన విడదీశాను.
వాటిని విప్పి, మౌస్ ని తెరిచాను. లోపల ఇలా ఉంది.
మౌస్ క్రింద బాడీ నుండి ఆ లోన ఉన్న మౌస్ మదర్ బోర్డ్ ని విడదీశాను. అప్పుడు ఇలా అడుగు భాగం విడిపోతుంది. ఇందులో ఉన్న ట్రాన్స్పరెంట్ Transparent పార్ట్ ని సేపరేటుగా విడదీయాలి. ఈ భాగమే కర్సర్ కదలికల్లో కీలమైన భాగం. దీని పైన LED డయోడ్ ( మదర్ బోర్డ్ మీద ) ఉంటుంది.
మౌస్ లోని మదర్ బోర్డ్ ఈ క్రింది విధముగా ఉంటుంది. ఇది Microsoft వారి 2.0v కీబోర్డ్ మౌస్. ఇందులో ఉన్న LED డయోడ్ మీద సెక్యూరిటీ గా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీసి, ప్రక్కన పెట్టండి.
ఈ రెండు ట్రాన్స్పరెంట్ భాగాలను మెత్తటి గుడ్డతో శుభ్రముగా తుడవాలి.
ఇవే ఆ రెండు ట్రాన్స్పరెంట్ భాగాలు. వీటిని ఏమాత్రం మరకలు, దుమ్ము లేకుండా శుభ్రం చెయ్యాలి.
ఇలా వీటిని శుభ్రం చేశాక మళ్ళీ వాటిని యధావిధిగా బిగించేసేయ్యాలి. అలా బిగించాక చూస్తే ఆశ్చర్యం.. నా సిస్టం మౌస్ కర్సర్ ఏమాత్రం వణుకు లేకుండా నిశ్చలముగా మానిటర్ స్క్రీన్ మీద ఉంటున్నది. ఇక క్రొత్త మౌస్ కొనాల్సిన బాధ తప్పింది.
Subscribe to:
Posts (Atom)