Friday, December 31, 2010

Youtube నుండి వీడియోల డౌన్లోడ్.

మీకందరికీ నూత సంవత్సశుభాకాంక్షలు.

మీకు నాకు చెప్పే విషేష్ కి ధన్యవాదములు బదులుగా - యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతాను.. అనుకోకుండా తెలుసుకున్న ఈ విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసి నేను నేను ఎన్నో వీడియోలు యూ ట్యూబ్ లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ క్రింది పద్దతులని ఆచరించి మీరూ అలా చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది కూడా. ఒక్క యూ ట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ యే కాకుండా, వాటిని ప్లే కూడా చేసుకోవచ్చు, వాటిని కత్తిరించి చిన్నగా చేసుకోవచ్చును. వేరే ఫార్మాట్స్ కి సులభముగా మార్చుకోవచ్చును. అన్నీ ప్లే చేసుకోవచ్చును. అన్నింటికన్నా మించి ఇది ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

మీకు ఎక్కడైనా బొమ్మలు అర్థం కాకుంటే ఆ ఫోటోల మీద డబల్ క్లిక్ చెయ్యండి..

ముందుగా మీరు ఈ రియల్ ప్లేయర్ లింక్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీరు ఆ సైటు లోకి వెళతారు. అప్పడు ఆ సైటు ఇలా మీకు కనపడుతుంది.


ఇప్పుడు ఓపెన్ చేశారు కదా.. ఓకే. ఇప్పుడు ఆ క్రింది బొమ్మలో చూపించినట్లుగా, ఎర్రరంగు వృత్తాకారము (1) వద్దకి రండి. అక్కడ ఉన్న Real Player - Basic Player ని నొక్కండి.  


ఇప్పుడు వచ్చే దాంట్లో ఎర్రరంగులో ఉన్న Download Now (2) వద్ద నొక్కండీ. నొక్కారా..!! 


అలా నొక్కగానే మీకు Save (3) ఆప్షన్ గల ఒక మెనూ వెంటనే ప్రత్యక్షం అవుతుంది.  అక్కడ ఆ SAVE ఆప్షన్ ని నొక్కండి. మీరు మీ సిస్టం లో ఎక్కడ SAVE చెయ్యాలో నిర్ణయించుకొని సేవ్ చెయ్యండి. అప్పుడు 585 KB సైజులోని ఒక ఫైల్ మీ సిస్టం లో SAVE అవుతుంది.


ఇప్పుడు ఆ ఫైల్ ని వెదికి, దాన్ని ఓపెన్ చెయ్యండి. ఇప్పుడు దాన్ని RUN (4) చెయ్యండి. చేశారా?.. 


ఇప్పుడు ఇలా మీ సిస్టం లో REAL PLAYER ఇన్స్టాల్ అవటానికి ప్రిపేర్ (5) అవుతుంది.  


ఇప్పుడు కాసేపట్లో ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ (6) దగ్గర ఉన్న ACCEPT ని నొక్కండి. 


అలా నొక్కగానే - ఇలా ఇంటర్నెట్ లో నుండి ఆ సాఫ్ట్వేర్ మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. బ్రాడ్ బ్యాండ్ ఆయితే (ఇండియాలో ఆయితే 256 kbps) అదంతా జరగటానికి 16 నుండి 18 నిముషాలు పడుతుంది. స్పీడ్ బాగా ఉంటే ఇంకా త్వరగానే అవుతుంది. అదంతా అయ్యేవరకు వేచి చూడండి.  


అలా 100 % శాతం పూర్తయ్యాక ఇలా ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో (7) వద్ద నున్న REAL PLAYER PLUS వద్ద సెలెక్ట్ చెయ్యండి. మళ్ళీ (8 వద్ద) Continue అవండి.. 


అలా కంటిన్యూ అయ్యారుగా.. ఇప్పుడు ఇంకొకటి పాపప్ విండో వస్తుంది. అందులో (9 వద్ద) మీ ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ టైపు చేసి, మళ్ళీ పాస్ వర్డ్ మళ్ళీ టైపు చేసి, (10 వద్ద) Next step వద్ద నొక్కండి.  


ఇప్పుడు మీ డెస్క్టాప్ మీద ఇలా రియల్ ప్లేయర్ (11) లా కనిపిస్తుంది.. వచ్చింది కదూ.. OK 


ఇప్పుడు మీరు యూ ట్యూబ్ సైటు http://www.youtube.com/ ఓపెన్ చెయ్యండి. అందులో మీకు నచ్చిన ఒక పాటని, లేదా వీడియో ని ఓపెన్ చెయ్యండి. చేశారా. ఆ వీడియో బఫరింగ్ అయ్యి బొమ్మ వచ్చేదాకా ఆగండి. అలా వీడియో స్టార్ట్ అయ్యాక ఆ వీడియో మీద మీ మౌస్ కర్సర్ ని తీసుకరండి. తీసుకొచ్చారా.. OK . అలా మీరు కర్సర్ ని తీసుకరాగానే మీకు ఆ వీడియో పైన కుడి మూలన Download this video అని (12 న వద్ద ) కనిపిస్తుంది. కనిపించిందా? దాన్ని నొక్కండి. 


ఇప్పుడు ఆ వీడియో మీద ఇలా డౌన్లోడ్ బాక్స్ కనిపిస్తుంది. కనిపించిందా.? అలాగే టాస్క్ బార్ లో కూడా, సిస్టం ట్రే లో కూడా కనిపిస్తుంది. ఇక దాన్ని అలాగే వదిలెయ్యండి. మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన ఆ వీడియో (డిఫాల్ట్ గా ఆయితే) My డాకుమెంట్స్ > My Videos > Realplayer Downloads లో కనిపిస్తాయి. ఇక ఆ వీడియోలను మీరు ప్లే చేస్తూ, చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. 


మీకు ఈ నూతన సంవత్సర కానుకగా మీకు ఇది ఇస్తున్నాను.. నేను చూసిన వాటిల్లో, మరియు వాడుతున్న దానిలో - దీనికన్నా మించి యూ టూబ్ వీడియోలని డౌన్లోడ్ చెయ్యటానికి యే సాఫ్ట్వేర్ కనిపించలేదు. అంత బాగా నచ్చేసింది. మీకూ తెగ నచ్చేస్తుందని అనుకుంటాను. ఒక్క యూ ట్యూబ్ లోనివే కాకుండా ఇంటర్నెట్ లోని అన్ని వీడియోలూ దీని ద్వారా కాపీ చేసుకోవచ్చును..


మరొకసారి ఆ  లింక్ : రియల్ ప్లేయర్

మీకు మరొక్కసారి
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2011

మీ స్పందనని ఆశిస్తున్నాను..

Saturday, December 18, 2010

Athadu - Adaraka badule cheppeti

చిత్రం : అతడు
సంగీతం : మణిశర్మ
పాడినవారు : విశ్వ
రచన : విశ్వ
**************
అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే

తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అతడే - అతడే - అతడే

ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే

వాహువా వావా వా వ వ్వు వ్వా (కోరస్)

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్

వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి
వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
హో హొ హొ హొ..
హో హొ హొ హొ
హో హొ హొ హొ

కాలం నను తరిమిందో, శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే, సమరం లో గెలిచేస్తా
హు యే హొ, హొ యే హొ
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ, జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ, జడివానై నే కలబడతా!
హు యే హొ,
పెనుతుఫాను తలవంచి చూసే, హో హొ హొ హొ
తొలినిప్పు కణం అతడే - అతడే - అతడే

డబ డబ దేరిరా డబిన్నం, డబ డబ దేరిరా డబిన్నం,
డబ డబ దేరిరా డబిన్నం, ల ల ల ల ల ల లా..
హిస్ స్మైల్ ఈజ్ ఆల్, ఈజ్ టేకెన్ ఆల్

చుట్టూ చీకటి ఉన్నా, వెలిగే కిరణం అతడు
తెగబడే అల యెదురైతే, తలపడే తీరం అతడు
హొ యే హొ 

పెను తుఫాను తలొంచి చూసే, హొ యే హొ
తొలి నిప్పు కణం అతడే, హొ యే హొ

తన యదలో పగ మేల్కొలుపుతూ, ఒడిదుడుకుల వల చేధించుతూ,
ప్రతి నిత్యం కదనం జరుపుతూ, చెలరేగే ఓ శరమతడు

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్

Wednesday, December 15, 2010

నేను వేసిన గోరింటాకు ఫోటోలు

ఇది నేను సరదాగా వేసిన - గోరింటాకు ఫోటోలు. పెద్దగా చూడాలీ అంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.






బాగున్నాయా.. ?

Wednesday, December 8, 2010

Naalona shivudu galadu..

తనికెళ్ళ భరణి చాలా గొప్ప రచయిత, సాహిత్యకారుడూ, సినీ నటుడూ, గొప్ప శివ భక్తుడూ, రంగస్థల నటుడూ.. ఇలా ఎన్నెన్నో పాటవాలు గలవాడు. మొన్న మొన్న అనుకోకుండా భరణి గారి విరచిత "నాలోన శివుడు గలడు.." అనే భక్తి గేయాల సంపుటిని వినడం జరిగింది. ఆహా!ఎంత అత్యద్భుతముగా ఉన్నాయి అవి!.. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత అద్భుతముగా పాడటం జరిగింది. తను ఇంత అద్భుతముగా - చిన్ని చిన్ని పదాలతో, నోటికి తేలికగా పాడుకునేగలిగే ఉండేట్లుగా ఉన్న పదాలతో, పామరులకు సైతం సులభముగా అర్థమయ్యే విధముగా ఉన్న ఈ గేయాన్ని ఒకసారి చూడండి.

మహా శివుడి గురించి - మనల్ని ఒక చిన్నపిల్లాడిని చేసి, ముద్దుగా చేసి "ఇలారా తమ్మీ శివుడంటే .." అన్నట్లుగా చెబుతూ ఈ గేయములో భక్తి, లాలింపూ, కరుణా, వేడుకోలు, విషాదం, విరుపులూ, సునిశిత హాస్యం, చమత్కారం.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో. తోడుకున్నవాడికి తోడుకున్నంత. అసలు ఈ పాటని విశ్లేషించే సామర్థ్యం నాకు లేదేమో అనిపిస్తుంది.

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు ..

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో - పండగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు  - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ - మూయగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - సగము పంచీయగలడు
తిక్కతో - అసలు తుంచేయగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు - నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు


ఈ పాటను కూడా వినండి.  అసలు ఆ చివరి వాక్యం ఉంది చూడండి.. నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు అనీ.. అది అన్నింటికన్నా హైలెట్. ఒకే లైనుని, గంభీరముగా, కరుణ తో, దయతో, కాస్త హాస్య స్పూరకముతో, విరుపులూ, చేణుక్కులతో - శంకరా బహరణం లో శంకర శాస్త్రి "అమ్మా" అనే పదాన్ని ఎవరు ఎలా అతారో చేబుతాడుగా.. అలా ఒకే ఒక వాక్యాన్ని ఐదు రసాలలో చెప్పటం ఈ భరణి గారికే చెందుతుంది..

Wednesday, December 1, 2010

DVD CD - బఫరింగ్

DVD రైటర్ లో CD పెట్టాక ఆ CD బఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ CD లోని డాటాని రైటర్ లోని లేజర్ కాంతి పుంజము ఆ CD లోని డాటాని చదువుతూ ఉంటుంది.

ఆ CD లోని డాటా చదవటానికి పది నుండి పదిహేను సెకన్ల కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు మీకు అనిపిస్తే - ఎజేక్ట్ బటన్ వాడి ఆ CD ని తీసి పరిశీలించండి. ఏమైనా స్క్రాచేస్ వచ్చాయా అని.

ఒకవేళ స్క్రాచేస్ వచ్చినట్లుంటే - ఆ CD ని మళ్ళీ రీడ్ చేసేందుకు ఆ డ్రైవ్ లో పెట్టే సాహాసం చెయ్యకండి. కొన్ని క్రొత్తగా ఉండొచ్చు.. అది కాపీ చేసిన CD అయినా - దాని మాతృక CD మాత్రం గీతలు పడి ఉండవచ్చు. అలాంటి CD నుండి కాపీ చేస్తే - ఆ డాటా ఎర్రర్ ఈ CD లోకి కూడ మారుతుంది.

అలా ఈ CD ని మీ సిస్టం కి ఉన్న రైటర్ లో పెడితే - బఫర్ టైం ఎక్కువ తీసుకొని, మీ రైటర్ ఇక DVD CD లని రీడ్ చేసుకోవు. మామూలు CD లని ప్లే మరియు రికార్డింగ్ చెయ్యగలగుతాయి. ఒక్కోసారి DVD లను ప్లే మాత్రమే చేస్తాయి. రికార్డింగ్ మాత్రం చెయ్యలేవు. వారంటీ ఉంటే - ఓకే. లేకుంటే క్రొత్తగా ఇంకో DVD రైటర్ కొనాల్సిందే.

ఇలా ఒక DVD రైటర్ ని నేను పోగొట్టుకున్నాను. మీరూ అలా చెయ్యకండీ. పది పదిహేను సెకనుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంటే - ఇక ఆ సీడీని తీసెయ్యండి. మళ్ళీ ఎప్పుడూ ఆ సీడీ ని వాడి మీ రైటర్ ని పాడుచేసుకోకండీ.
Related Posts with Thumbnails