చాలామంది తమ మెయిల్ బాక్స్ వచ్చిన మెయిల్స్ అన్నింటినీ ఓపెన్ చేస్తూ ఉంటారు.. తమకి వచ్చిన ప్రతి మెయిల్ లో ఏదో ఉందని అనుకుంటూ ఓపెన్ చేస్తారు.. (ఏమి ఉంటుందో మీకు చివరలో తెలుస్తుంది.) అందులో ఏమున్నదో తెలుసుకోవడం చాలా సాధారణ ఆసక్తే. కాని కొన్ని మెయిల్స్ మాత్రం అన్ని మెయిల్స్ లా ఉండవు. అవి సంథింగ్ డిఫరెంట్. వీటి గురించి చెప్పే ముందు, కొన్ని విషయాలు చెబుతాను.
నా బ్లాగ్ లోనే ఒకసారి చెప్పాను - మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని.. అనే లింక్ పోస్ట్ కి వెళ్లి చదవండి. పనిలో పనిగా అలాగే కామెంట్స్ చూడండి. అలా వారు మన మెయిల్ ID పంపాక మన మెయిల్ బాక్స్ కి ఏదో ఒక మెయిల్ వస్తుంది. "..వీరి పరిస్థితి ఇలా ఉంది.. వీరికి ఇలా అయ్యింది.. అది బాగు కావాలంటే ఇంత డబ్బు కావాలి.. మీరు ఈ మెయిల్ ని మీ మిత్రులకి పంపితే చాలు.. గూగుల్ వాడు ఒక్కో మెయిల్ కి మాకు కొంత ఆర్ధిక సహాయం చేస్తాడు.. మీకు హృదయమే ఉన్న మనుష్యులు ఆయితే (?) మీరు మీ మెయిల్ లిస్టు లోని అందరికీ పంపండీ.." - అని అందులో ఉంటుంది. ఇలాని కాదు ఇలా సహాయం చెయ్యమనీ, చూడమనీ ఎన్నో రకాలు ఉంటాయి.
అది నిజమే అని అమాయకముగా అందరికీ పంపిస్తుంటారు.. అలా నా మెయిల్ ID నీ, ఏదో పుణ్య కార్యక్రమం చేసినట్లు - అందరికీ పంపారు కూడా. ఇంకా పంపుతూనే ఉన్నారు కూడా.. ఏమి చేస్తాం.. చదువుకొని కూడా లోకజ్ఞానం అబ్బని అమాయకులు (మూర్ఖులు) - అని అనుకోవాలి వారిని. అలా చేసిన "విశాల హృదయ పుణ్య కార్యక్రమానికి" ఆహ్వానం అందుకొని, నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి. ఆయా సైట్ల ఫిల్టర్స్ వల్ల అవి - స్పామ్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. అందులో అన్నీ మనసుని ఊరించి ఓపెన్ చేయించే మెయిల్స్. క్రిందన ఉన్న ఈ మెయిల్ బాడీ చూడండి. అందులో ఒక సైట్ లింక్ తప్ప మరేం లేదు. ఇలాంటిదే ఒక మెయిల్ వస్తే - అప్పట్లో తెలీక ఓపెన్ చేశా.. బూతుబొమ్మల సైటు అది. ఆ సైట్ లోని మాల్వేర్స్ నా సిస్టం లో తిష్ట వేశాయి. ఫలితముగా నా సిస్టం చాలా స్లో గా నడవటం మొదలెట్టింది. అంటి వైరస్ అప్డేట్ చేసినా, టెంపరరీ ఫైల్స్ అన్నీ తీసేసినా, అనుమానిత ఫైల్స్ అన్నీ తీసేసినా, కూకీస్ అన్నీ తొలగించినా.. ఊహు.. లాభం లేదు. సిస్టం హాంగ్ అవటం మొదలెట్టింది. నా సిస్టం నుండి ఎంత డాటా హ్యాక్ అయ్యిందో? చివరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల - చాలా రోజులకి సమస్య తీరింది. అన్ని రోజులూ నెట్ కి రావాలంటేనే - విసుగు. ఏదైనా సైట్ ఓపెన్ అవ్వాలంటే - అది ఓపెన్ అయ్యేలోపు టీ ఈజీగా త్రాగేయవచ్చు. అంతగా స్లో అన్నమాట.. అలాగే ఈ క్రింది మెయిల్ కూడా అటువంటివే.. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి..
అలాగే - మీకు "ఒకటి" పంపిస్తే కొరియర్ వాపస్ తిరిగి వచ్చింది. అందులో మీకు ఏమి పంపామో - అటాచ్మెంట్ ఫైల్ ఓపెన్ చేసి చూడండి - అని ఉంటుంది. అది డౌన్ లోడ్ చేసుకుంటే - ఇక నుండి సిస్టం లో శాశ్వతముగా తిష్ట వేసుకొనే మాల్వేర్స్ డౌన్ లోడ్ అవుతాయి. మొదట్లో నేనూ నమ్మలేదు. కాని పై అనుభవం వల్ల నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు మీరూ నమ్ముతారు. అది ఎలాగో ఈ క్రింది ఫోటో చూడండి. అలాగే ఈ మెయిల్ వస్తే కొద్ది రోజులాగి, ఓపెన్ చేశా. అంతలోగా అంటి వైరస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుందిగా. అలా ఆ మెయిల్ బండారం బయటపడింది. మీరూ చూడండి. సరిగా కనిపించకపోతే పెద్దగా చూడటానికి ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి.
అందుకే తస్మాత్ జాగ్రత్త!!
ఈ చదువుకున్న మూర్ఖులు చేసిన పుణ్య కార్యక్రమం వల్ల ఇంకో అపకారం కూడా జరిగిపోతుంది.. అదేమిటంటే - అలా వారు ఆ సానుభూతి మెయిల్స్ మళ్ళీ పంపటం వల్ల మిత్రులకు ద్రోహం చేసినవారూ అవుతారు. దీన్ని రెండు రకాలుగా చెబుతాను.
మొదటి రకం : ఇందులో - ఎవరో స్వార్థపరుడు ఒక మెయిల్ ID ని క్రొత్తగా సృష్టించుకొని, ఈ సింపతీ మెయిల్ ని తన మెయిల్ బాక్స్ లోని అందరికీ (మిత్రులకి) కూడా పంపిస్తాడు. వాళ్ళందరూ అందులో ఎమున్నదీ, నిజమేనా, ఆధారాలు ఉన్నాయా? అని ఏవీ ఆలోచించకుండా "విశాల దృక్పథా మనసుతో" తమ మంచి మనసుకి నిదర్శనం కి గుర్తుగా, అదో మహాద్భాగ్యం అన్న భావనతో అందరికీ ఆ మెయిల్ ని పంపిస్తారు. ఆ మెయిల్ ID లలో ఈ స్వార్థపరుడి మెయిల్ ID కూడా ఉంటుంది. - ఎలా అంటే వీడూ వారికి ఫ్రెండ్ / తెలిసిన వాడే అయి ఉంటాడు. ఎవరైనా మిత్రులవి సోషల్ వర్కింగ్ సైట్లకి ఆడ్ రిక్వెస్ట్ పంపాలన్నా, ( ఆ మిత్రులు - వారికి ఆడ్ రిక్వెస్ట్ పంపాలంటే వారి మెయిల్ ID ఖచ్చితముగా తెలిసి ఉండేలా సెట్టింగ్స్ పెడుతూ ఉంటారు.) ఒక ఈ మెయిల్ ID ని, అక్కడ పోస్ట్ చేస్తూ పోతారు. అందులో ఉన్న అన్ని మెయిల్స్ ID ని అలా టెస్ట్ చేస్తుంటే ఏదో ఒకటి తగులుతుంది. ఇక వారికి కష్టాలు మొదలవుతాయి. దానికి కారణం, మూలమూ ఈ "విశాల మనసు గల మూర్ఖులే." వీరు చేసిన ఒక చిన్నపని ఎదుటివారిని ఎన్ని అవస్థలకు గురిచేస్తుందో. మన మిత్రులని మనమే ఇబ్బందులకి గురిచేసి, అవతలి వారికి లాభం చేస్తున్నామని వీరు అనుకోని మూర్ఖులు.
రెండో రకం : ఇలా మెయిల్ ID లు తెలిశాక - అప్పుడు ఆయా మెయిల్ ID ల ద్వారా వారి అక్కౌంట్స్ ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నిస్తారు. పాస్ వర్డ్ చేధించటానికి ఆధునిక పాస్ వర్డ్ బ్రేకర్స్ ద్వారా ప్రయత్నిస్తారు.
ఆరు అక్షరాల పాస్ వర్డ్ ని ఇప్పుడున్న ఆధునిక సాఫ్ట్ వేర్ లతో మూడు గంటల్లో,
ఏడు అక్షరాల పాస్ వర్డ్ ని ఎనిమిది గంటల్లో,
ఎనిమిది అక్షరాల పాస్ వర్డ్ ని మూడు రోజులల్లో "బ్రేక్" చేయవచ్చును. ఇది పాత పద్ధతి.
ఇక క్రొత్త ఆధునిక పద్దతిలో ఆయితే - ఒక లింక్ పంపిస్తారు పైన ఉన్న ఫోటో లో లాగా. అది ఓపెన్ చేస్తే - ఒక ఫైల్ డౌన్ లోడ్ అయ్యి, అంటి వైరస్ ని ఆపేసి మన సిస్టం లో తిష్ట వేస్తుంది. మనం చేసే అన్నీ పాస్వర్డ్ లతో సహా "కీ లాగర్స్" లాగా పనిచేస్తుంది. ఏదైనా బ్యాంక్ అక్కౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు అవతలివారికి ఆ సైటూ, పాస్ వర్డూ, లాగిన్ ID అన్నీ వారికి తెలిసిపోతుంది. ఇంకేం.. అంతా మామూలే. దర్జాగా దోచేసుకుంటారు.
ఇప్పుడు చెప్పండి.. అలాంటి మెయిల్స్ మీకు వస్తే వాటిని - మీలో ఎవరైనా మీ మిత్రులకి మళ్ళీ పంపగలరా?