Tuesday, August 7, 2018

Good Morning - 749


గతంలో సాధించిన విజయం చూసుకొని, మురిసిపడితే - భవిష్యత్తులో వచ్చే విజయాలు అన్నీ దూరం అవుతాయి. 
అన్నింటినీ సమానముగా పరిగణిస్తూ ముందుకు పయనం చేసినప్పుడే - మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము. 

మనం ఎప్పుడో సాధించిన విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ - నేనిలా చేశా, అలా చేశా, ఫలానా వారు మెచ్చుకున్నారు, నాతో ఇలా అన్నారు అనుకుంటూ ఉంటుంటే - ఆ మానసిక తృప్తితో ఇక ముందున్న కాలములో అంత కష్టపడలేని, నిరాశాపూరిత వాతావరణాన్ని మనమే మనకు తెలీకుండా కల్పించుకున్నవారిమి అవుతాం. అలా అనుకోవడం - ఒక సంతృప్తికరమైన ( Saturated సాచురేటేడ్ ) భావన. అది మన భవిష్యత్తు ఎదుగుదలని ఆపేస్తుంది. ఫలితముగా మనం ఎక్కడో ఒకచోట మన అభివృద్ధి ఆగిపోతుంది. అది ఆగింది అని తెలుసుకొనేలోపు మన జీవితాలలో ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఎక్కువగా - ఒకప్పుడు నేనిలా చేశా, ఇంతగా సంపాదించా, ఈ పని మొదటగా నేనే చేశా, ఈ ప్రాంతములో మొదటగా నేనే మొదలుపెట్టా... ఇలా చెప్పుకొనే వారి జీవితాలు చక్కని ఉదాహరణ. 

ఉదాహరణకు : ఒకతను బ్యాంక్ క్లర్క్ కావాలని - రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఉద్యోగం సాధిస్తాడు. పదే పదే నేను ఇంతలా కష్టపడ్డా అని అనుకుంటూ పోతుంటే - ఇక మేనేజర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యం మీద అంతగా దృష్టి పెట్టలేకపోతాడు. ఫలితముగా సాంఘికముగా మరింత హోదా, పలుకుబడి, సౌకర్యాలు, జీవన ప్రమాణాలు వచ్చేవి అలాగే నిలిచిపోతాయి. అందుకే మన లక్ష్యాన్ని ఒకటి తరవాత ఒకటి పెట్టుకుంటూ ఎదుగుతూ కష్టపడుతూ అభివృద్ధిలోకి రావాల్సిందే. అలా చేస్తే మన జీవితం మరింత బాగా అగుపిస్తుంది. 




Sunday, July 29, 2018

[తెలుగుబ్లాగు:22491] mlaana పదాన్ని లెఖినిలో వ్రాయడమెలా?

mlaana పదాన్ని లెఖినిలో  వ్రాయడమెలా?

మీరడిగిన mlaana అనే పదాన్ని లేఖినిలో తెలుగులో ఎలా వ్రాయాలి అని అడిగారు కదా.. అలాగే టైపు చేస్తే ఈ క్రింది - మొదటి తెరపట్టు లాగా వచ్చిందని అనుకుంటున్నాను. ( జూమ్ చేసి ఎర్రని గదుల్లో పెద్దగా అందరికీ కనిపించేలా చేశాను ) కొన్ని కాంబినేషన్ పదాలు టైపింగ్ లో ఇబ్బంది పెడుతాయి. 




ఇలాంటి కాంబినేషన్ పదాలని & కీ తో ( కీ బోర్డ్ లో shift + & ) వాడితే మీకొచ్చిన ఇబ్బందిని తేలికగా తొలగించుకోవచ్చును. అది ఎలాగో ఈ క్రిందన చూడండి. 




Saturday, July 21, 2018

Good Morning - 748


రోజూ ఓ గంటసేపు నిశ్చలంగా కూర్చో, ఆ కాసేపు మనోమౌనముగా ఉండు. ఆ తర్వాత ఒక తెల్లకాగితం తీసుకొని నీ లక్ష్యమేమిటో దానిపై వ్రాయు. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం, ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని పడే పడే జ్ఞాపకం చేసుకో, అది నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. 

ఈ ఉరుకుల పరుగుల పరుగుల జీవితములో కాసింత వీలు చేసుకొని - అది ఉదయమే కావొచ్చు, సాయంత్రమే కావొచ్చు.. ఆఖరికి రాత్రి పడుకొనే ముందే కావొచ్చు.. మనకు వీలున్నప్పుడు అది గంటైనా  కావొచ్చు, పట్టుమని పది నిముషాలే కావొచ్చు.. ఒక చోట ప్రశాంతముగా కూర్చోవాలి. అప్పుడు పరిపరివిధాలుగా ఆలోచనలతో పరిగెత్తే మన మనసుని నిలిపి, నిశ్చలముగా ఉంచాలి. మీ లక్ష్యాలేమిటో వాటిని ఒక చిన్న కాగితం మీద వ్రాసుకొని, మీ వెంటే ఉంచుకోవాలి. ఇలాంటి సమయాల్లో దాన్ని తెరచి, మననం చేసుకోండి. మీరు మీ లక్ష్యాల నెరవేరణలో మీరు ఎంత దూరం విజయవంతముగా రాగలిగారో మీరంతట మీరుగా విష్లేశించుకోండి. ఇలా చేస్తే అనతికాలములోనే మీ లక్ష్యాలని చేరుకోవచ్చు. 

మీ వెంట లక్ష్యాల కాగితాలను ఉంచుకోవడం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్లనేమో - పూజా కార్యక్రమాల్లో మనసులో సంకల్పించుకొని, చేతికి కంకణం కట్టుకోనేది ఇందువల్లనేమో అని అనుకుంటాను. దైనందిక జీవితములో అరచేతి వైపుగా తరచుగా చూస్తుంటాం. ఆ చేయికి కట్టిన కంకణం కనిపించి, మన లక్ష్యాన్ని గుర్తుచేస్తుంటుందని కాబోలు - అలా చేతికి కంకణం కట్టడం ఆచారముగా మారి ఉండొచ్చు. 



Related Posts with Thumbnails