Saturday, June 8, 2013

Good Morning - 365


చెప్పడం ఎప్పుడూ తేలికే..
వినడమే కష్టం. 
వినడం భలే సులభం. 
అర్థం కావడం కష్టం. 
అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. 
అంగీకరించడం ముఖ్యం. 


Friday, June 7, 2013

Good Morning - 364


జీవితాన్ని ఎంతగా అడ్జస్ట్ చేసుకుంటే - అంతమంది మిత్రులు మనతో ఉంటారు. 

అవును..! జీవితాన మిత్రులతో ఉన్నప్పుడు - వారు మనతో ఉండాలని అనుకున్నప్పుడు కొన్నిసార్లు పట్టుదలలకి పోవద్దు. అలాని మనదే కరెక్ట్ అంటూ ఈగోలకి వెళ్లి, పంతం పట్టి వ్రేలాడితే, ఆ అవతలి మిత్రులు మనకి దూరం కావచ్చును. మనం గెలిచినా అప్పుడు ఒడినట్లే.. స్నేహితులని అప్పుడప్పుడూ గెలిపించేలా మనం మన ప్రయత్నాలు చెయ్యాలి. అలాంటప్పుడు మనం ఓడినా, ఆ బంధంలో గెలుస్తాము. మనం చేసిన త్యాగాన్ని అవతలివారు గుర్తించిన నాడు మన పట్ల గొప్ప అభిమానాన్ని చూపిస్తారు. అది నిజం. 

అందరూ మనతో సఖ్యముగా ఉండాలంటే - మనం మన పద్ధతులని మార్చుకోక తప్పదు. కాసింత సహనాన్నీ పెంచుకోక తప్పదు. తప్పు మనదైనా, అవతలివారిదైనా సాగతీత చెయ్యకుండా, ఓర్పుతో సర్డుకపోవాలి. ప్రతివారినీ వారి వారి వ్యక్తిత్వాలని, పద్ధతులనీ గౌరవించాలి. అలా చేసిన నాడు వారు కూడా మన పట్ల గౌరవ మర్యాదలని చూపిస్తారు. లేకుంటే మనకి దూరముగా వెళ్ళిపోతారు. ఇక జీవితములో కలుసుకోవడం ఇక వీలుకాదేమో.. !

Thursday, June 6, 2013

Good Morning - 363


కష్టాలని తప్పించుకొనే వారికంటే - వాటిని అధిగమించేవారే విజయం సాధించగలరు. 

హా !.. అవునండీ.. కష్టాలు ఎదురయితే అవి తప్పించుకోవాలని చూసేవాడు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేడు. అలా తప్పించుకోవాలని చూసినా అన్ని కష్టాలు ఎన్నడూ వారిని వీడిపోవు. ఫలితముగా వారిని ఎన్నడు అపజయం వెక్కిరిస్తూనే ఉంటుంది. అలాకాకుండా కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదురుకోవాలో, వాటిని ఎలా పరిష్కరించుకోగలరో తెలుసుకొని, వాటిని ఎదురుకొని, అలా ఎదురైన వాటిని తెలివిగా దాటినవారిని విజయం వరిస్తుంది. 

Related Posts with Thumbnails