మనం అందరికీ నచ్చాలన్నది లేదు..
కాబట్టి ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలన్న ఆరాటం అనవసరం.
మనపని మనం చేసుకుంటూ పోవాలి.
మనల్ని ఇష్టపడాలా, వద్దా అనే ఎంపికని వారికే వదిలెయ్యాలి.
అవును.. మనం అందరికీ నచ్చాలన్నది రూలేమీ లేదు. అలాగే మనం కూడా అందరికీ నచ్చతీరాలన్నది నియమమేమీ లేదు. మన ప్రవర్తన, భాష, నడవడిక, హుందాతనం, సంస్కారం... ఇత్యాది విషయాలే ఎదుటివారిని బాగా ప్రభావితం చేస్తాయి.. ( ఈరోజుల్లో అయితే మన వెనక ఉన్న పలుకుబడి, డబ్బూ కూడా ఈకోవకే చెందుతాయి. ) మనల్ని చూసి మనతో వచ్చేవారితో సఖ్యతగా ఉండటం చాలా మంచిది. మనమంటే ఇష్టపడని వారినీ వారి మనసుల్ని ఆకట్టుకోవాలన్న తాపత్రయం మాత్రం మంచిది కాదు. అలా చెయ్యటం మీకు అమితమైన బాధని కలిగిస్తుంది. మనమంటూ ఎలా ఉండాలో అలాగే ఉంటూ జీవన ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. నచ్చిన వారు మనతో ఉంటారు. నచ్చినవారు మనతో ఉంటారు. నచ్చనివారు మన జీవితం నుండి వైదొలుగుతారు. అది వారి ఇష్టం.