mlaana పదాన్ని లెఖినిలో వ్రాయడమెలా?
మీరడిగిన mlaana అనే పదాన్ని లేఖినిలో తెలుగులో ఎలా వ్రాయాలి అని అడిగారు కదా.. అలాగే టైపు చేస్తే ఈ క్రింది - మొదటి తెరపట్టు లాగా వచ్చిందని అనుకుంటున్నాను. ( జూమ్ చేసి ఎర్రని గదుల్లో పెద్దగా అందరికీ కనిపించేలా చేశాను ) కొన్ని కాంబినేషన్ పదాలు టైపింగ్ లో ఇబ్బంది పెడుతాయి.
Sunday, July 29, 2018
Saturday, July 21, 2018
Good Morning - 748
రోజూ ఓ గంటసేపు నిశ్చలంగా కూర్చో, ఆ కాసేపు మనోమౌనముగా ఉండు. ఆ తర్వాత ఒక తెల్లకాగితం తీసుకొని నీ లక్ష్యమేమిటో దానిపై వ్రాయు. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం, ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని పడే పడే జ్ఞాపకం చేసుకో, అది నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది.
ఈ ఉరుకుల పరుగుల పరుగుల జీవితములో కాసింత వీలు చేసుకొని - అది ఉదయమే కావొచ్చు, సాయంత్రమే కావొచ్చు.. ఆఖరికి రాత్రి పడుకొనే ముందే కావొచ్చు.. మనకు వీలున్నప్పుడు అది గంటైనా కావొచ్చు, పట్టుమని పది నిముషాలే కావొచ్చు.. ఒక చోట ప్రశాంతముగా కూర్చోవాలి. అప్పుడు పరిపరివిధాలుగా ఆలోచనలతో పరిగెత్తే మన మనసుని నిలిపి, నిశ్చలముగా ఉంచాలి. మీ లక్ష్యాలేమిటో వాటిని ఒక చిన్న కాగితం మీద వ్రాసుకొని, మీ వెంటే ఉంచుకోవాలి. ఇలాంటి సమయాల్లో దాన్ని తెరచి, మననం చేసుకోండి. మీరు మీ లక్ష్యాల నెరవేరణలో మీరు ఎంత దూరం విజయవంతముగా రాగలిగారో మీరంతట మీరుగా విష్లేశించుకోండి. ఇలా చేస్తే అనతికాలములోనే మీ లక్ష్యాలని చేరుకోవచ్చు.
మీ వెంట లక్ష్యాల కాగితాలను ఉంచుకోవడం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్లనేమో - పూజా కార్యక్రమాల్లో మనసులో సంకల్పించుకొని, చేతికి కంకణం కట్టుకోనేది ఇందువల్లనేమో అని అనుకుంటాను. దైనందిక జీవితములో అరచేతి వైపుగా తరచుగా చూస్తుంటాం. ఆ చేయికి కట్టిన కంకణం కనిపించి, మన లక్ష్యాన్ని గుర్తుచేస్తుంటుందని కాబోలు - అలా చేతికి కంకణం కట్టడం ఆచారముగా మారి ఉండొచ్చు.
Monday, July 9, 2018
Thursday, July 5, 2018
Tuesday, July 3, 2018
Subscribe to:
Posts (Atom)