Monday, April 30, 2018

Good Morning - 731


ఇతరుల తిరస్కారాన్ని ఆమోదించడం నేర్చుకోండి. 
ఇతరులకు ఎవరినైనా, దేన్నైనా తిరస్కరించే హక్కు ఉంటుంది. 
అంత మాత్రాన వాళ్ళకి నచ్చనివన్నీ పనికిరానివై పోవుకదా.. !

అవును.. ఇతరులకు మనం నచ్చకుంటే / మనం చేసిన పనులు నచ్చకపోతే.. వారు మన పట్ల చూపే తిరస్కారాన్ని ఒప్పుకోవడం మనకు అలవాటు లేకుంటే ఇకనుండైనా ఆమోదించడం నేర్చుకోండి. మనం ఎంత పర్ఫెక్షన్ గా పనిచేసినా, ఎంత సరిగ్గా ఉన్నా ఒక్కోసారి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన మనం ఎదో తప్పు చేశామనో, మనలో ఎదో పొరబాటు ఉందని - తప్పుడు భావనని మనసు మీదకు తెచ్చుకోవద్దు. అన్నీ అందరికీ నచ్చాలన్న నియమేమీ లేదు. మనం చేసిన పని మన వృత్తిలో భాగమైతే - మనకన్నా బాగాచేసే వారి నుండి ఇంతకు ముందు పనిని పొంది ఉండొచ్చు. దానితో పోల్చితే వారికి మన పని నచ్చకపోవచ్చు. లేదా మనలో ఏదో లోపం కనిపించి ఉండవచ్చు. వారిని అలా ఎందుకు భావిస్తున్నారో అడిగి తెలుసుకోవడం చాలా తెలివైన చర్య. అప్పుడు వారు తెలియచేస్తే - మీకు ఎదిగే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. అది తెలుసుకోవడం వల్ల మీ లోపమేమిటో తెలుసుకొని, దానిని కాసింత కృషితో దాన్ని మరింత మెరుగుపరుచుకొనే ఒక అద్భుత అవకాశం మీకు లభించినట్లే. ఒకవేళ వారు చెప్పిన కారణం మీ అనుభవ రూపేణా తప్పే అనుకున్నట్లైతే - నవ్వేసి ఊరుకోండి. వాదనల వల్ల ఎదుటివారిని ఈకాలంలో మార్చలేం.. అది మన పని కూడా కాదని గ్రహించండి. 




Saturday, April 28, 2018

Good Morning - 730


మనుష్యులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. 
తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని, అలసిపోయినవాడికే - 
అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకొనే అవకాశం చిక్కుతుంది. 




Wednesday, April 25, 2018

Good Morning - 729


ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి, ఏదో విధముగా బందీయే! దాన్నుంచి తప్పించుకొనే అవకాశం కోసం తపించడమే - సాధన. 





Saturday, April 21, 2018

Good Morning - 728


ఎదగటానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. 

Thursday, April 19, 2018

Good Morning - 727


వాగుడు అలవాటైతే అది నీ శక్తిని నాశనం చేస్తుంది. 
నీ లక్ష్యాన్ని చేరనీయకుండా అడ్డుపడుతుంది. 
వాగడం మానేస్తే ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది. 






Sunday, April 15, 2018

Good Morning - 726


నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది. 
నమ్మకమే లేకుంటే ప్రతిమాటా అపార్థమే అవుతుంది. 
నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. 



Friday, April 13, 2018

Good Morning - 725


జీవితానికి ఏకాంతం చాలా ఉపయోగపడుతుంది. 
అయితే ఒంటరిగా జీవించకూడదు. 




Wednesday, April 11, 2018

Good Morning - 724


నిరంతరం వరదలా వచ్చిపడే అసత్యపు విలువలు మరింత దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. 




Saturday, April 7, 2018

Good Morning - 723


అధికులం, సర్వజ్ఞులం, ఉన్నతులం అనుకొనే వాళ్ళంతా - ఆ వంచనలో దాగిన బోలుతనాన్ని గుర్తించకుండానే బ్రతుకుతున్నారు. 



Wednesday, April 4, 2018

Good Morning - 722


నిజాయితీ - మాటమాత్రంగా కాక, నిజంగా ఉండాలి. అది తనను తాను చీల్చుకొని, చర్మాన్ని ఒలుచుకొని, చూసుకోవడం లాంటిది. 




Related Posts with Thumbnails