Wednesday, November 29, 2017
Sunday, November 26, 2017
Saturday, November 25, 2017
Wednesday, November 22, 2017
Monday, November 20, 2017
LED Street lights
ఈ మధ్య మా నగర రహదారులన్నీ రాత్రిపూట తెల్లగా, పండు వెన్నెలతో మెరసిపోతున్నాయి. నగరమంతా పండుగ వాతావరణం ఏర్పడినట్లుగా, రహదారుల మీదున్న కరెంట్ స్థంభాలన్నింటిమీదా దేదీప్యమాన వెలుతురునిచ్చే ఎల్ ఈ డీ LED బల్బ్స్ అమర్చడం వల్ల ఈ మార్పు. అంతకు ముందు ఈ కరెంట్ స్థంభాల మీద ఉన్న ట్యూబ్ లైట్స్ కొన్ని వెలిగేవి.. మరికొన్ని వెలగక పోయేవి. వెలిగే ట్యూబ్ లైట్స్ కాంతి కన్నా మరింత ఎక్కువ వెలుగునిచ్చే - ఈ రహదారుల మీద ఒక ఫంక్షన్ చేస్తున్నట్లుగా - అందుకే ఇలాంటి మరింత ప్రకాశవంతమైన బల్బులను పెట్టారా అన్నట్లుగా అగుపించుచున్నది. ఇక్కడ మార్పు అంతా ట్యూబ్ లైట్స్ స్థానాన LED బల్బ్స్ అమర్చడమే.. అంతే
ఈ LED ల్యాంప్స్ ఎప్పటి నుండో అమర్చుతున్నారు. కానీ ఈ మధ్యే ఆ అమర్చడం అన్నది మరింత వేగవంతం చేశారు. ప్రతీ గల్లీలో నుండి పెద్ద పెద్ద రహదారుల వరకూ అన్ని రోడ్ల మీదున్న ట్యూబ్ లైట్స్ ని తొలగించి, వాటి స్థానాన ఈ LED బల్బ్స్ ని పెడుతున్నారు. ఇవి సైజులో చిన్నగా ఉండి, ట్యూబ్ లైట్స్ కన్నా మరింత కాంతిని ఇస్తున్నాయి. ఆ వెలుతురులో రోడ్డు మీద ఏదైనా పడినా చక్కగా వెతుక్కోనేలా ఉంది వీటి వెలుగు. మొదట్లో వచ్చిన LED లైట్ల కన్నా ఈ మధ్య వచ్చిన LED లైట్స్ మరింత వెలుగుని ఇస్తున్నాయి. ఈ విషయమే మరింతగా నన్ను ఆకట్టుకొని ఈ టపా వ్రాయటానికి మూల కారణమైంది.
ఈ LED లైట్స్ కీ - ట్యూబ్ లైట్స్ కీ తేడాలు చూద్దాం..
ట్యూబ్ లైట్స్ LED
సెట్ ధర తక్కువ ఎక్కువ
వెలుతురు తక్కువ ఎక్కువ
ఛోక్ తప్పనిసరి అవసరం లేదు
స్టార్టర్ తప్పనిసరి అవసరం లేదు
సైజు పెద్ద ఆకారం చిన్నగా ఉంటుంది.
స్టార్టప్ ప్లిక్ అయ్యాక వస్తుంది. వెంటనే వెలుగునిస్తుంది.
లోవోల్టేజ్ వెలగటం కష్టం భేషుగ్గా వెలుగునిస్తుంది.
నిర్వహణ అప్పుడప్పుడు అవసరం అవసరం లేదు.
ఖరీదు తక్కువ చాలా ఎక్కువ
మన్నిక అన్నీ బాగుంటేనే ఎక్కువకాలం వస్తుంది. మరింత ఎక్కువకాలం వస్తుంది.
ప్రతి వాట్ కి ఇచ్చే వెలుగు తక్కువ ఎక్కువ
సెట్ కి గ్యారంటీ ఏమీ లేదు కనీసం ఒక సంవత్సరం
వెలుగు తెలుపు మరింత తెలుపు
ఈ LED లైట్లని గమనిస్తున్నాను కదా.. వెనకటి తరం లైట్ల కన్నా ప్రస్తుతం వస్తున్న లైట్లు రాత్రిపూట రహదారులని పట్టపగలుగా మార్చుతున్నాయి. ఇక్కడ మరింతగా ఆకట్టుకున్నది ప్రస్తుతం మా వీధిలో అమర్చిన LED వీధి దీపాలు. ఆ వీధి దీపం వెలుతురుని చూశాక మరుసటి రోజున వాటి గురించి తెలుసుకున్నాను.
ప్రభుత్వం వారు ఈ వీధి దీపాలని ప్రతి నగరాల్లో, పల్లెల్లో అమర్చుతున్నారు. దీని వల్ల రహదారులన్నీ మరింత ఎక్కువ వెలుతురుతో జిగేల్మని మెరసిపోతున్నాయి.
వీటి వివరాలని తెలుసుకోవాలని గూగుల్ లో వెతికాను. పైన చూపిన ఫోటో లోని LED లైట్ ( వీటినే మా వీధి రహదారుల స్థంభాలకు అమర్చారు ) అమెజాన్ కంపనీ వారి సైట్ లో కనిపించింది. దాని గురించి వివరాలు తెలుసుకున్నాను. ఇది 20W వాట్ల LED వీధి దీపం. ఆకారం అంతగా ఆకట్టుకోకున్నా, వీటి వెలుగు మాత్రం భలేగా మనల్ని ఆకట్టుకుంటుంది. కేవలం ఈ 20 వాట్ల కరెంట్ ఖర్చుతో ( ట్యూబ్ లైట్ కరెంట్ వినియోగం లో సగం ఖర్చుతో ) వాటికన్నా ఎన్నో రెట్లు ప్రకాశవంతముగా వీటి సామర్థ్యం ఉంది. వీటి ధర ప్రస్తుతం అమెజాన్ లో కేవలం 1500 రూపాయలుగా ఉంది. బల్బ్ చుట్టూ ఉన్న బాడీ ఆకారం మారిస్తే మరింత అందముగా కనిపిస్తుంది.
Wednesday, November 15, 2017
Tuesday, November 14, 2017
Saturday, November 11, 2017
Thursday, November 9, 2017
Monday, November 6, 2017
Friday, November 3, 2017
Subscribe to:
Posts (Atom)