Wednesday, June 28, 2017
Monday, June 26, 2017
Good Morning - 647
ప్రేమ అనేది ఒక నిలకడ లేని, చంచలమైన భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించాననుకున్నవారు దూరమైనప్పుడు కృంగిపోకు. ఓపిక పట్టు.. కాలం నీ గాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది. కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాలను గమనించు.. ప్రేమ సౌందర్యాన్ని, అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు.. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో..
Thursday, June 22, 2017
Wednesday, June 21, 2017
Thursday, June 15, 2017
Good Morning - 645
హృదయానికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి కన్నీళ్ళు కారతాయి.. అది ప్రేమ.
కళ్ళనుండి కన్నీళ్ళు కారినప్పుడు హృదయం నొప్పి పెడుతుంది.. అది స్నేహం.
హృదయానికి బాధ కలిగినప్పుడు - మనం అనుకున్నది జరగనప్పుడు, పెట్టుకున్న ఆశలు వమ్ము అయినప్పుడు, ఓటమి బాధ వల్ల మనసు బాధతో నిండిపోయి, అది కన్నీళ్ళ రూపములో మన కన్నుల వెంట బయటకు వస్తుంది. అది ప్రేమ. ఉదాహరణగా చెప్పాలంటే తల్లితండ్రుల ప్రేమ. మనకిష్టమైన వారి కళ్ళనుండి కన్నీళ్ళు కారినప్పుడు మన మనసుకి నొప్పిలా అనిపిస్తుంది. అది స్నేహం.. ఇది నిజమైన స్నేహములో, ఇరువురి మనసులూ ఒకటైన స్నేహంలో చూస్తాము. స్నేహితుని కళ్ళలో కన్నీరు చూడాల్సిరావటం ఏ ఆప్త స్నేహితుడూ ఇష్టపడడు. అవసరమైతే తన బదులు తాను ఏడ్వాల్సివచ్చినా సంతోషముగా ఒప్పుకుంటాడే కానీ, తన స్నేహితున్ని మాత్రం ఏమాత్రం ఏడవటానికి ఇష్టపడడు. ఇదే చక్కని స్నేహానికి పరాకాష్ట.
( ఇలాంటి స్నేహం నాకు దొరికింది.. అది ఈ జన్మకు చాలు )
Saturday, June 10, 2017
Sunday, June 4, 2017
Friday, June 2, 2017
Subscribe to:
Posts (Atom)