Sunday, April 30, 2017

Good Morning - 638


వేదనతో నిరాశ చెందిన ప్రేమకు, 
స్నేహం అనేది తప్పనిసరిగా ఉపశమనం కలిగించే ఔషధం. 



Thursday, April 27, 2017

Bahubali 2


నీవు నా ప్రక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా..!


అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ధన, మాన, ప్రాణ సంరక్షుడిగా ప్రాణత్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను..





Wednesday, April 26, 2017

పొడుపు కథలు - 38


నల్లకుక్కకు నాలుగు చెవులు.. 
ఏమిటదీ..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

విడుపు  :


Friday, April 21, 2017

Quiz

పైన ఇచ్చిన చిత్రం లోని గుర్తుల విలువలను కనుగొనండి. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Monday, April 17, 2017

Good Morning - 637


ఓటమి అనేది ఒక ఆలోచన మాత్రమే..! 
ఓడిపోయామని అంగీకరించకుండా గెలుపు కోసం పోరాడినంత కాలం ఓటమి ఎవరినీ ఓడించలేదు. 

Tuesday, April 11, 2017

Beware! Rs. 60 charge for 37 sec. only..

ఈరోజు బయటకెళ్ళి, నా పనులు చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలో నా మొబైల్ ఫోన్ మ్రోగింది. ఒకే ఒక రింగ్ వచ్చి, కట్ అయ్యింది. అప్పుడు రాత్రి 8:21 అవుతున్నది. బయలుదేరుతున్న నాకు ఎవరో నాతో అర్జంట్ అయి మిస్ కాల్ చేశారేమో అనుకున్నాను.. జేబులోంచి ఫోన్ తీసి, చూశాను. ఏదో గుర్తు తెలీని నంబర్. +960... తో మొదలయ్యే నంబర్ సీరిస్ అది. అంతకు కొద్ది సమయం క్రిందటే గుజరాత్ లోని రాజ్ కోట్ Rajkot నుండి కాల్ వస్తే మాట్లాడాను. అదీ క్రొత్త నంబరే.. అది మొబైల్ లో ఫీడింగ్ చెయ్యని ల్యాండ్ ఫోన్ నంబర్.. ఇదీ వారిదేమో.. మళ్ళీ చేశారేమో అనుకున్నా.. నంబర్ ని పరిశీలనగా చూశా.. పది నంబర్లు ఉన్న ఫోన్ నంబర్ అది. అంటే మొబైల్ ఫోన్ నంబర్ అన్నమాట.. అనుకున్నా.

సాధారణముగా నా ఫోన్ లిస్టు లో లేని క్రొత్త నంబర్స్ వద్దనుండి అలాంటి మిస్ కాల్స్ వస్తే - అస్సలు పట్టించుకోను.. రూపాయి పెడితే ఎంచక్కా ఒక నిమిషం మాట్లాడుకొనే పరిస్థితులున్న ఈ కాలంలో ( ఇప్పుడైతే కొన్ని నెట్వర్క్ లలో అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా వచ్చేసింది ) ఇంకా ఈ మిస్ కాల్స్ ఏమిటా అని అస్సలు పట్టించుకోను. తెలిసిన వారివీ, తాత్కాలికముగా కొద్దిరోజులు ఫోన్ చెయ్యాల్సిన వారి నంబర్స్.. అంటూ చాలా మొబైల్ నంబర్లు ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లిస్టులో చేరుస్తూనే ఉంటాను. అలాగే ఆయా వ్యక్తుల ఫోటో అందుబాటులో ఉంటే వారి నంబర్ కి ఆ ఫోటో జత చేస్తాను. ఆ లిస్టు లో ఉన్నవారు ఫోన్ చేస్తే వారి నంబర్ మాత్రమే కాకుండా, వారి పేరు, ఫోటో కూడా కనిపిస్తుంది. అలా ఉన్నవారికే మిస్ కాల్ చేస్తే - నేను మళ్ళీ కాల్ చేస్తాను. మామూలుగా నంబర్స్ వచ్చిన వారికి / లిస్టు లో లేని నంబర్స్ కి అస్సలు తిరిగి కాల్ చెయ్యను.

ఇంటికి త్వరగా వెళ్ళాలన్న ఆదుర్దాలో ఉన్నా - ఎవరిదీ ఈ పది అంకెల క్రొత్త నంబర్? ఎందుకు చేశారు? అనే ఆలోచనలు మొదలయ్యాయి. బహుశా మా పిల్లల స్నేహితుల వద్దనుండి వచ్చిన కాల్ కావచ్చు అనుకొన్నా.. వారికి - ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాల్ చేయిస్తాను అని చెప్పాలని, మళ్ళీ తిరిగి వారికి కాల్ చేశాను.

అవతలి ఫోన్ రింగ్ అయినట్లు తెలుస్తూనే ఉంది. మూడు రింగుల తరవాత ఫోన్ ఎత్తారు.
హలో.. హలో అన్నా..
అవతలి వైపు నుండీ అలాగే హలో హలో అని ఆడ గొంతు. మా పిల్లల స్నేహితుల కుటుంబీకులేమో అనుకున్నాను. అప్పుడే అక్కడే మరో చిన్న పాప గొంతులా ఉన్న వాయిస్ వినపడింది. నేను హలో అంటున్నా వారిలో వారు ఏదేదో మాట్లాడుతున్నట్లుగా హడావిడి ఉందక్కడ. కొద్ది క్షణాల పాటు విన్నాను. ఏమీ అర్థం కావటం లేదు. చిన్న పాపలా వాయిస్ ఉన్న అమ్మాయి ఏదో మాట్లాడుతూ ఉంది. ఆ మాటల్లో - F_ck అనే బూతుమాట చాలా స్పష్టముగా వినపడింది. కొంపదీసి, ఇది ఇంటర్నేషనల్ సెక్స్ చాట్ కాల్ నంబర్ అయితే కాదుగా.. ఒకవేళ అదే నిజమే అయితే నా మొబైల్ బ్యాలన్స్ గోవిందా.. అని చప్పున గుర్తుకొచ్చింది. వెంటనే కాల్ కట్ చేశాను.

నంబర్ చెక్ చేశాను. నంబర్ లోని అంకెలని (మళ్ళీ) లెక్కబెట్టాను. పది అంకెల నంబర్ అది. దానికి ముందు + గుర్తుకూడా ఉంది. చూస్తే ఇంటర్నేషనల్ కాల్ నంబర్ లా ఉంది. లేకుంటే ఏదైనా ఇంటర్నెట్ కాల్ నంబర్ కావొచ్చు.. కానీ నెట్ నంబర్ ఇలా రాదే.. మరి వాట్సప్ నంబరా? ఎటూ తోచడం లేదు.. ఇలా కాదనుకొని ఆ నంబర్ కి మొదట ఉన్న + గుర్తులో దాగిన కంట్రీ కోడ్ ఏమిటో చూడాలని ప్రయత్నించాను. అదీ తెరచుకోవడం లేదు. మామూలుగా అయితే భారతదేశం కోడ్ +91 తో మొదలవుతుంది. అది కనిపించడం లేదు. ఇలా కాదనుకొని ఆ నంబర్ ని ఎడిట్ చేస్తే అలా అయినా కనిపిస్తుందేమో అనుకొని చేస్తే - ఊహు.. లాభం లేదు. ఇంకా పట్టుదల పెరిగిపోయింది. ఇక కాల్ లాగ్ చూస్తే సరి అనుకొని చూశా.. అక్కడా దేశం కోడ్ లేనే లేదు.. చూస్తే మన ప్రక్కనే ఎవరిదో ఆ నంబర్ అన్నట్లుగా కనిపిస్తున్నది. ఇక చివరి ప్రయత్నముగా కాల్ డ్యురేషణ్ Call duration ని చూశా.. కేవలం 37 సెకన్లు మాత్రమే కాల్ మాట్లాడినట్లుగా ఉంది. అప్పుడే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ వద్దనుండి కాల్ కి అయిన చార్జీ, మిగిలిన బ్యాలన్స్ ఎంతో చూపే మెసేజ్ వచ్చింది. ఆ మాత్రం మాట్లాడినందుకే Rs. 60 రూపాయలు కట్ అయ్యాయి. ఇంకా అలాగే మాట్లాడుతూ వెళుతూ ఉంటే - అ బ్యాలన్స్ లోని మిగిలిన ఒక వేయి చిలుకు బ్యాలన్స్ ఎంచక్కా ఆవిరయిపోయేది.



ఇంకా నయం ఒకప్పుడు నా ఫోన్ బ్యాలన్స్ Rs. 9,450+ గా ఉండేడిది. అప్పుడు గనుక ఇలాంటి కాల్ గనుక అందుకొని ఉంటే - ఎంచక్కా క్షవరం అయ్యి ఉండేది. అలా కావొద్దని బ్యాలన్స్ గత ఏడు సంవత్సరాలుగా వాలిడిటీ డేట్ పెంచుకుంటూ ఖర్చుచేస్తూ వస్తున్నా.. చివరకు వేయి వద్ద వచ్చి, ఆగింది. చప్పున ఏదో గుర్తుకవచ్చి ఆగిపోయాను గానీ, లేకుంటే నా పని అయ్యేదే..

ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండేందుకై ఈ పోస్ట్ ని వ్రాశా... ఇక్కడ మీకు కొని సూచనలు చెయ్యబోతున్నాను.


  • గుర్తు తెలీని వారి వద్ద నుండి మిస్ కాల్స్ వస్తే అస్సలు పట్టించుకోవద్దు. 
  • కవేళ మన ఫోన్ లోని కాంటాక్ట్స్ లిస్టు లో లేని నంబర్ నుండి మిస్ కాల్ వస్తే - పట్టించుకోకండి. 
  • కటీ, రెండు రింగ్స్ వచ్చాక లైన్ కట్ అయ్యిందనుకోండి. వారు కావాలని అలా లైన్ కట్ చేశారని అనుకోవాలి. 
  • వెంటనే తిరిగి కాల్ చెయ్యకుండా కాసేపు ఆగాలి. 
  • న వద్ద నుండి తిరుగు కాల్ వస్తుందని ఎదురుచూసిన వాళ్ళే మళ్ళీ ఇంకొకసారి చేస్తారు. (అప్పుడే కాల్ లిఫ్ట్ చెయ్యటానికి వాడే బటన్ మీద వ్రేలిని పెట్టి వెంటనే నొక్కాలి. వాళ్ళు కట్ చేసేలోగా మనం ఫోన్ లేపాం కనుక డబ్బులు ఎలాగూ పోయాయని - వాళ్ళే మాట్లాడుతారు. నేను మాత్రం అలా చేసే వాళ్లకు గుణపాఠంగా అలాగే చేస్తుంటాను ) 
  • కాల్స్ అటెండ్ అయ్యాక ఆ నంబర్ ని ఫీడ్ చేసుకోవాలి. మళ్ళీ చేస్తే వారి ఫీడింగ్ పేరు కనిపిస్తుంది. ఫోన్ ఎత్తాలా వద్దా  ?? అనేది మనం నిర్ణయించుకోవచ్చు. 
  • నాకు జరిగిన అనుభవం లాగా ఇంతకుముందు చాలామందికి అయ్యి తమ తమ ఫోన్ బ్యాలన్స్ లని హారతి కర్పూరం లా ఆవిరయ్యాయి.. దాంతో ప్రభుత్వం చొరవ తీసుకొని - వచ్చే కాల్  ఫోన్ నంబర్ మన ఫోన్ తెర మీద - కంట్రీ కోడ్ తో కనపడేలా చేశారు. అలా లేకుంటే అది ఇలాంటి డబ్బులు ఆవిరయ్యే కాల్ యే అని అనుకోవాలి. 
  • తిరిగి కాల్ చేసేముందు - ఒకసారి ఆ వచ్చిన నంబర్ ని పరిశీలనగా చూడటం మానవద్దు. +91 ఉంటే అది భారత దేశం నుండే ఎవరో చేస్తున్నారని అనుకోవచ్చు. 
  • నాకు వచ్చిన కాల్ ని True caller ఆప్ తో  ఆ నంబర్ ని వెదికితే - ఆ నంబర్ కాల్ మాల్దీవుల నుండి వచ్చిందని అర్థం అయ్యింది. 
  • వతలి వాళ్ళు మాట్లాడే మాటలు అర్థం కాకుంటే వెంటనే కాల్ కట్ చేసిన ఆ ఫోన్ నంబర్ తాలుకు వివరాలు పరిశీలించాలి. 
  • కేవలం 37 సెకన్లకే 60 రూపాయలు అయితే ఇక నిమిషానికి - వందరూపాయల మీదనే అవుతుంది. వామ్మో!.. జాగ్రత్త. 


Sunday, April 9, 2017

Good Morning - 636



నిన్ను చూసి అసహ్యించుకొనే మనుష్యులే - 
అసూయపడే స్థాయికి చేరుకోవడమే నీవు సాధించే గొప్ప విజయం.. 



Friday, April 7, 2017

Good Morning - 635


గతంలో నిన్ను బాధపెట్టిన క్షణాలను మరచిపో.. 
కానీ - 
ఆ బాధ నేర్పిన పాఠాన్ని ఎన్నడూ మరచిపోకు.. 



Wednesday, April 5, 2017

Good Morning - 634


నీ దగ్గర ఏమీ లేనప్పుడు చూపించే సహనం, 
అన్నీ ఉన్నప్పుడు ఉండే నీ వ్యక్తిత్వం, 
ఈ రెండూ నీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. 



Saturday, April 1, 2017

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 105 Kgs. 



Related Posts with Thumbnails