Saturday, April 26, 2014

Photo / word links పెట్టొచ్చా ?

నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా? on Blog address
ప్రవీణ్ గారూ..
మామూలుగా అయితే బ్లాగుల్లో ఏదైనా ఒక పదంని పెట్టి, ఆ పదాన్ని క్లిక్ చేస్తే, ఏమని లింక్ ఇచ్చామో అది ఓపెన్ అవుతుంది. ఒక ఫోటో పెట్టి, ఆ ఫొటోస్ కి లింక్ ఇచ్చేలా బ్లాగుల్లో సెట్టింగ్స్ నాకు అగుపించలేదు. కావాలంటే ఆ ఫోటో పేరు వ్రాసుకొని ఆ పేరుకి లింక్ పెట్టుకోవచ్చును.

ఆ ఫొటోస్ ని కాపీ చేసుకొని, మీ బ్లాగులోకి అప్లోడ్ చెయ్యటం : ఈ పద్ధతిలో గూగుల్ ద్వారానే కానీ, మరే ఇతర పద్ధతుల వల్లనే గానీ మీరు సేకరించిన ఫొటోస్ ని మీ పోస్టుల్లోని టపాలలో అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మీరు ఆ ఫోటో లింక్ ఇవ్వదలచుకుంటే ఎలా ఇవ్వాలో మీకు తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి వివరముగా చెబుతాను.

బ్లాగులోని క్రొత్త పోస్ట్ వ్రాయాలనుకున్నప్పుడు, క్రొత్తగా Create new post ని ఓపెన్ చేస్తాము కదా.. అందులోని టూల్ బార్ ని ఒకసారి పరిశీలనగా చూస్తే, మీకు అందులో ఒక లింక్ Link టూల్ కనిపిస్తుంది. ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపెట్టబడినది - చూడవచ్చును.


ఆ లింక్ టూల్ ని నొక్కితే మీకు ఇలా క్రింద కనిపించేలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. 


ఇందులో ఉన్న Link to క్రిందన ఉన్న Web address ప్రక్కనే ఉన్న గడిలో Which URL should link to go to లో మీరు యే ఫోటో గానీ, టపా గానీ, పోస్ట్ గానీ..... వాటిని ప్రత్యేకముగా వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసినప్పుడు, అప్పుడు అడ్రెస్ బార్ లో ఉండే అడ్రెస్ ని కాపీ చేసుకొని, ఇందులో పేస్ట్ చెయ్యాలి. ( అడ్రెస్ బార్ అంటే ఈ లింక్ చూడండిhttp://achampetraj.blogspot.in/2014/04/blog-address.html ) అంటే ఈ క్రింద గడిలో అన్నమాట.


అందులో - లింక్ ని నొక్కగానే ఎక్కడికి వెళ్ళాలో ఆ సైట్ అడ్రెస్స్ / పోస్ట్ / ఫోటో.. అడ్రెస్ ని అందులో పేస్ట్ చేశాం కదా.. ఇప్పుడు దాని మీద ఉన్న మరో గడి - Text to display గడిలో - మన బ్లాగ్ టపాలో ఆ లింక్ ఏమిటో పేరు టైప్ చెయ్యాలి. 


ఇందులో వ్రాశాక - మామూలుగా ఆ టపాని పోస్ట్ చేస్తే చాలు.. అలా పబ్లిష్ అయిన టపాలో మనం ఇచ్చిన పేరుని క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అయ్యి, వీక్షకులకు మరింత సౌకర్యముగా ఉంటుంది. 

ఉదాహరణకి : ఇలా టెస్టింగ్ కోసం అనీ కొన్నింటిని చూద్దాం. ఇందులో నీలం రంగులో చూపెట్టినవి ( పబ్లిష్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నీలం రంగులో వస్తాయి ) లింక్స్ అని గుర్తించండి. అవి నిజమా కాదా అని ఒకసారి చెక్ చేసి, ఎలా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోండి. 


2. మహాత్మాగాంధీ గారు చరఖా మీద నూలు వడుకుతున్నప్పుడు 


ఇప్పుడు మీకు ఎలా లింక్స్ పెట్టాలో అర్థం అయిందనుకుంటాను. 

7 comments:

  1. raj garu .. photo ki kuda miru cheppinattugane cheyavacchu.. photo mida click chesi.. link ivvadame..
    nenu naa blog lo icchanu chudandi ..
    http://www.templeinformation.in/2013/12/tamilnadu-temple-information.html

    ReplyDelete
  2. ధన్యవాదములు రాజాచంద్ర గారూ..

    ReplyDelete
  3. Thank you so much.. raja garu and raja chandra garu

    ReplyDelete
  4. రాజ చంద్ర గారు మీ బ్లాగ్ చూసాను, మిరు ఫొటోస్ క్లిక్ చేస్తే ధాని గురించి సమాచారం వచ్చేలా చాలా బాగ పెట్టారు కాని నాకు అలా లింక్ ఇవ్వడం రవట్లేధు, ధయచేసి అధి ఎలాగో పూర్తిగ, వివరంగా చెప్పగలరు. (రాజ గారు చెప్పినట్టు ఇమెజెస్ తో చెప్తె సులభంగా అర్దం అవుతుంధి.)

    ReplyDelete
  5. ప్రవీణ్ జిల్లెల గారూ.. మీ సమస్య గురించి ఈ పోస్ట్ లో సమాధానం ఇచ్చాను. కానీ అది అసంపూర్తిగా ఉందని రాజాచంద్ర గారు అంటే మళ్ళీ మీకోసమని - మీకు కావలసిన సమాచారం పొందుపరుస్తూ మళ్ళీ అదే పోస్ట్ రెండో భాగం అంటూ సీక్వెల్ గా మళ్ళీ ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను. అది చూడండి. మీ సమస్యని పరిష్కరిస్తుంది. లింక్ : http://achampetraj.blogspot.in/2014/04/photo-word-links-2.html

    ReplyDelete
  6. చాల ధన్యవాదాలు రాజా గారు.. మీ పోస్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంధి..

    ReplyDelete
  7. కృతజ్ఞతలు ప్రవీణ్ గారూ..

    ReplyDelete

.