Tuesday, July 19, 2011

బ్లాగుల్లో టైం జోన్

కొన్ని రోజుల నుండి నా బ్లాగ్ లో పోస్ట్ పెట్టిన అది "షెడ్యుల్డ్ " అని చూపిస్తుంది.

ఎప్పుడో సాయంత్రానికో లేక రాత్రికో పోస్ట్ అవుతుంది.

నేను షెడ్యుల్డ్ తీసి "ఆటోమాటిక్ "పెట్టిన ప్రయోజనం లేదు.

ఎందుకు ఇలా? ..అందరికి ఇలానే వస్తుందా..? దయచేసితెలుపగలరు..
 
..ఇలా మీకు వస్తున్నాదా? అయితే మీరు మీ బ్లాగ్ సెట్టింగ్స్ లలో ఒక చిన్న పొరబాటు చేసి ఉంటారు. మీరు ముందుగా మీ బ్లాగ్ ఓపెన్ చేసి, ఈ క్రింది ఫోటోలో చూపినట్లుగా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
 


1. మీ బ్లాగ్ Settings కి వెళ్ళండి.

2. అందులో ఉన్న Formatting ని నొక్కండి.

3. అక్కడ మీరు Time zone యొక్క డ్రాప్ మెనూ ఓపెన్ చెయ్యండి. ఆ బార్ చివర్లో ఉన్న త్రికోణాన్ని నొక్కితే సరి.

4. ఆ వచ్చిన మెనూ లో మీరు భారత దేశానికి చెందినవారు అయితే (GMT+5:30) India Standard Time ని ఎన్నుకోండి. వేరే దేశం వారు అయితే ఆ దేశాన్ని ఇందులో వెదుక్కోవాలి.

5. క్రిందన ఉన్న Save Settings బటన్ ని నోక్కేయ్యండి. అంతే!. మీ పోస్ట్స్ వెంటనే పబ్లిష్ అవుతాయి.

2 comments:

.