Saturday, April 24, 2010

Oke oka maata.. Chakram

చిత్రం: చక్రం
సంగీతం: చక్రి
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: చక్రి
******************************



పల్లవి:
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ,
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని...

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం 1:
నేను అని లేను అని - చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని - చాల్లే పోమంటావు
నీ మనసులోని ఆశగా - నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా - తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో - నను పోల్చుకుంటానని
తల ఆన్చి నీ గుండెపై - నా పేరు వింటానని
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం 2:
నీ అడుగై నడవడమే - పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే - మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం - గురుతైన లేదనీ!
నిను కలుసుకున్న ఆ క్షణం - నను వదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా - నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ - నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన - దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత - తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన - దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత - తీయంగా

1 comment:

  1. Raj గారూ...,చిత్రం: చక్రం
    సంగీతం: చక్రి
    రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
    గానం: చక్రి
    ******************************






    పల్లవి:
    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
    _____________________భలే రాసారండీ .. సూపరు :)

    ReplyDelete

.