చిత్రం: చందమామ
సంగీతం: కె.యం. రాధాకృష్ణన్
సాహిత్యం: పెద్దాడమూర్తి
గానం: రాజేష్
****************************
సాకీ:
పచ్చి పాల యవ్వనాల గువ్వలాట
పంచుకుంటే రాతిరంతా జాతరంటా
లా ల లా లా ల
పల్లవి:
బుగ్గే బంగారమా - సిగ్గే సింగారమా
అగ్గే రాజేసే లెమ్మా - ఒళ్లే వయ్యరమా
నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ
పట్టు చీరల్లో చందమామ - ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాన కోనసీమ - కొటి తారల్లో ముద్దు గుమ్మ //బుగ్గే బంగారమా //
చరణం 1:
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం.. చెలికే సొంతం.. వసంతం ..
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసేవరకూ.. కలలో జరిగే.. విహారం ..
పుష్యమాసాల మంచు నీవో
భోగిమంటల్లో వేడి నీవో
పూల గాంధాల గాలి నీవో
పాల నురగల్లొ తీపి నీవో //బుగ్గే బంగారమా//
చరణం 2:
హియర్ వి గో
నారు మల్లె తోట కాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానె ఆరుబయట వెన్నెలింట
సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో ..ఓ //నారుమల్లె//
చరణం 3:
ఎదలొ జరిగే విరాహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం.. ఒదిగే సమయం.. ఎపుడో..
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం.. జరిగే సరసం.. ఎప్పుడో..
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపె
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే
నన్ను మొత్తం గా మాయ చేసే //బుగ్గే బంగారమా//
No comments:
Post a Comment
.