ఈ రోజు ఉదయం లభించిన అరుదైన చేప = బ్లాబ్ ఫిష్ అణు జలచరం ఫోటో ఇది. ఇదేదో మాంసం ముద్దలా ఉన్ననూ ఇది ఒక చేప.. ఏదో తోలుబొమ్మలాట లోని వింత బొమ్మ కాదు.. నిజం చేప!! కేవలం అడుగు పొడుగుండే చేప ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ మహా సముద్రాలలో రెండువేల అడుగుల క్రిందన మాత్రమే ఉంటుంది. వేగముగా అంతరించిపోతున్న జీవచరాల లిస్టులో ఉన్న ఇది ల్యాబ్ స్టర్ లనీ, ఎండ్రకాయలను మాత్రమే తింటుంది.
Achampetraj garu !
ReplyDeletemee blog chalaa bagundi kaani
chaala photolu kanipinchadam leedu
enduko mari chudandi.
niranjan bobbilipati
నా బ్లాగ్ నచ్చినందులకు కృతజ్ఞతలు. చాలా ఫొటోస్ కనిపించకుండా పోయాయి. ఆ విషయం నేనూ గమనించాను. కారణం ఏమిటంటే - ఒకసారి ఈ బ్లాగ్ హ్యాక్ కి గురి అయ్యింది. డాటా ఏమీ నష్టపోలేదు కానీ, చాలా బూతు బొమ్మలు ఈ బ్లాగ్ ఆల్బం లో కనిపించాయి. బ్లాగ్ ఆల్బమ్ - ఈ పదం క్రొత్తగా ఉండొచ్చును. బ్లాగ్ లోకి అప్లోడ్ చేసే ఫొటోస్ అన్నీ ఒక ఆల్బంగా ఉంటాయి. నేను చెయ్యని దానికి - ఇలాంటి ఫొటోస్ ఈ బ్లాగ్ లో ఉంటే బ్లాగ్ కి చెడ్డపేరు వస్తుందని ఆ ఫొటోస్ ని ఒక్కొక్కటీ డిలీట్ చెయ్యక, తొందరపడి, అన్నీ ఒకేసారి డిలీట్ చేశా. అలా చాలా ఫొటోస్ పోయాయి. ఎలా డిలీట్ చెయ్యాలో తెలీని చిన్న పొరబాటు వల్ల ఇలా జరిగింది. వీలు చూసుకొని, మళ్ళీ అన్నీ పోస్ట్ చేస్తాను.
ReplyDelete