Wednesday, November 20, 2013

Good Morning - 503


నువ్వు చెప్పేది అందరూ చెవులతో వింటారు. 
ఆత్మీయులు మనసుతో వింటారు. 
ఒక్క స్నేహితుడు మాత్రమే నువ్వు చెప్పలేని మాటల్నీ, 
గుండెలోని ఊసుల్నీ వినగలడు. 

మనం చెప్పే ఊసులూ, భావాలూ, మాటలనీ ఆత్మీయులు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, అన్యమనస్కముగా కాకుండా - మనసు పెట్టి శ్రద్ధగా వింటారు. అవే మాటల్ని అందరూ కేవలం చెవులతో - అంటే హృదయముతో వినరు. సరిగా చెప్పాలీ అంటే మనం చెప్పే విషయం మీద అంత ఆసక్తి చూపకుండా, ఏదో వినాలి నీ సోది అన్నట్లు వింటారు. అదే స్నేహితుడు అయితే మనం చెప్పే మాటలు మాత్రమే కాకుండా, మనం చెప్పని ఊసులూ, వెల్లడించలేని భావాలనూ, గుండె గదిలో దాచిన మాటల్నీ కూడా వినగలడు. అదే స్నేహితుని - స్నేహం యొక్క గొప్పదనం. 

అలా కుదరాలీ అంటే - ఆ స్నేహం, వారిద్దరి మనసులూ మమేకమై పోవాలి. మామూలుగా స్నేహం అనుకున్ననాళ్ళూ ఇలా కుదరటం కష్టమే. నా స్నేహితుడు బాగుండాలీ, వాడి శ్రేయస్సుని కోరుకునే మనసు, అవతలి వాడి మనసుతో అనుసంధానమైనప్పుడు, ఇరువురి వేవ్ లెంత్స్ ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే అలా కుదురుతుందని నేను అనుకుంటాను. 

No comments:

Post a Comment

.