జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకి ప్రయాణం అంతే!.. సమస్య లేని జీవితం ఉండదు.
జీవితం అన్నాక ఎన్నో సమస్యలు. " ఏంట్రా బాబూ నాకే ఇవన్నీ.. " వాపోయేలా ఉంటాయి. నిజానికి సమస్యలు మనిషిని అభివృద్ధిలోకి తీసుకవెళుతాయి. ఈ సమస్యలు ఎవరికైనా సర్వసాధారణం. ప్రతివారికీ తప్పవు. వచ్చిన చిక్కల్లా - వాటిని ఎలా పరిష్కరించుకుంటాం అనే దగ్గరే మన ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. పరమ సత్యం చెప్పాలీ అంటే - సమస్యలు చాలా చిన్నవి. వేరేవారిని వాటిని పరిష్కరించేలా కేలికేలా చేసో, సరియైన పని చెయ్యాల్సింది మరొకటి చేసో, తగిన సమయములో తగిన నిర్ణయం తీసుకోకపోవడమో.. ఇలాంటి అనేకానేక కారణాల వల్ల అవి జటిలమవుతాయి. అప్పుడు ఇంకా చిక్కుముడులుగా మారుతాయి.
కాస్త తెలివిగా మనకున్న సమస్యలని తెలివిగా పరిష్కరించుకుంటూ వెళితే - చక్కని అభివృద్ధిలోకి వస్తాం. ఒక సమస్య కాగానే / కాకుండానే ఇంకో సమస్యలోకి వెళుతూనే ఉంటాం. అది తప్పని ఆనివార్యపు జీవిత ప్రయాణం.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteవనజ వనమాలిని గారూ..
ReplyDeleteమీ కామెంట్ పొరబాటున డిలీట్ అయ్యింది. మన్నించగలరు.. మూడు వందల చిత్రాలు సందర్భముగా మీరు చెప్పిన అభినందనలకి కృతజ్ఞతలు.. మంచి భావనలు అందిస్తాను.