Thursday, September 1, 2011

Your comment will be visible after approval

నేను ఒక బ్లాగ్ లో కామెంట్ పొస్ట్ చెద్దమని ఎంత ప్రయత్నించినా నా కామెంట్ పోస్ట్ కాకుండా Your comment will be visible after  approval అని వస్తుంది, ఎందుకు అలా వస్తుంది, ఆ బ్లాగ్ లో  కామెంట్  పోస్ట్ చేయాలి అంటే ఎలా?

మీరు కామెంట్ ని పోస్ట్ చేసిన బ్లాగ్ లో - కామెంట్ మాడరేషన్ పెట్టారు. అనగా - ఆ బ్లాగ్ లోని టపాలని చదివి, ఎవరైనా ఇబ్బందికరమైన  కామెంట్స్, అభ్యంతకరమైన, స్పాం కామెంట్స్ పెట్టకుండా - ఆ బ్లాగర్ స్వంతదారుడు అలా సెట్టింగ్ ఎన్నుకొని అలా సందర్శకులు వ్రాసిన కామెంట్స్ వెంటనే పబ్లిష్ కాకుండా చూస్తారు. అప్పుడు ఆ కామెంట్ వ్రాసిన వారికి  Your comment will be visible after approval అని వస్తుంది. వీలున్నప్పుడు ఆ కామెంట్స్ చూసి, బాగుంటే - వాటిని అక్కడ పబ్లిష్ చేస్తారు. 



మీకు ఆ బ్లాగ్ లో అలా కామెంట్ మాడరేషన్ ఉందని మీకు తెలీకపోవచ్చును. మామూలుగానే కామెంట్ పోస్ట్ చెయ్యండి చాలు.ఆ బ్లాగ్ ఓనర్ - ఆ బ్లాగ్ హోం పేజికి వచ్చినప్పుడో, లేదా మెయిల్ ID ఓపెన్ చేసినప్పుడు ఆ కామెంట్ ని చూసి, బాగుంది అనుకున్నప్పుడు ఓకే చేస్తాడు. లేదా డిలీట్ చేస్తాడు. ఇది మీ సమస్య కానే కాదు. అవాంఛనీయమైన కామెంట్స్ పెట్టేవారి సమస్య. మీరు హ్యాపీగా ఉండండి. 

2 comments:

  1. రాజ్ గారు, నేను తెలుగు మంచి మాటలు పేజి అడ్మిన్మం జునాథ శర్మగారి మిత్రుడను..
    (నేను ఫేస్ బుక్ పేజీ.. తెలుగువిజ్ఞానం వినోదం అడ్మిన్ ను)వారి ద్వారా మీగురించి తెలుసుకున్నా మిమ్మల్ని కలిసే భాగ్యం నేటికి దొరికింది... మీ సలహాలు/బ్లాగు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి!! ధన్యవాదములు...
    నాబ్లాగు:
    www.teluguvignanamvinodam1.blogspot.in
    www.facebook.com/telugu.vignanam.vinodam

    ReplyDelete
  2. నా బ్లాగు పట్ల మీ స్పందనకి కృతజ్ఞుడిని. .

    ReplyDelete

.