Friday, August 5, 2011

Photos attachment in Gmail message body

మీరు జిమెయిల్ వాడుతుంటారా? అందులో మీరు ఎవరికైనా మెయిల్ చేసేటప్పుడు ఫొటోస్ ని మీరు అటాచ్ మెంట్ రూపములోనే పంపుతున్నారా? మెసేజ్ బాడీ లో పంపుటలేదా?.. అదెలా వీలవుతుంది? 
"అలా పంపటం వీలుకాదే.." అని అనుకుంటున్నారా?.. 
అలాని అధైర్యపడాల్సిన అవసరం లేదు.. ఐయాం హియర్.. యు డోన్ట్ ఫియర్!! నేనున్నానుగా..


1 వద్దనున్న మీరు ముందుగా  వద్ద నున్న Mail settings బటన్ ని నొక్కండి. 

2 వద్దనున్న Labs ని నొక్కండి. 


ఇప్పుడు లాబ్స్ 3 ని ఓపెన్ చెయ్యండి. 


ఆ లాబ్స్ లలో ఉన్న Inserting Images ని 4 వెదికి పట్టుకొని, 5 వద్దన Enable ని సెలెక్ట్ చెయ్యండి. క్రింద SAVE చెయ్యండి. 


ఇప్పుడు మీ జిమెయిల్ ని ఓపెన్ చెయ్యండి. కంపోజ్ మెయిల్ - మెస్సేజ్ బాడీలోని టూల్ బార్ లో 6 వద్ద ఇమేజ్ టూల్ కనిపిస్తుంది. 


7 వద్ద My Computer ని సెలెక్ట్ చేసి, 8 వద్ద Choose File ని నొక్కండి. 


ఇప్పుడు మీ కంప్యూటర్ లోని My Documents లోని,  My Pictures డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లోడ్ చెయ్యాలి అనుకున్న ఫోటోలని సెలెక్ట్ 9 చేసుకొని, 10 వద్ద ఓపెన్ చెయ్యండి. అలా చేస్తే ఆ మెయిల్ బాడీ లోనికి ఫొటోస్ అప్లోడ్ మొదలవుతాయి. 


అప్పుడు అప్లోడ్ అయినట్లుగా ఇలా ఒక బాక్స్ వస్తుంది. 11 లోలాగా అలా ఫోటో వచ్చేశాక, 12 వద్ద OK నొక్కండి. 


ఇప్పుడు మీ మెయిల్ బాక్స్ బాడీ లో ఆ ఫోటో ఒరిజినల్ సైజులో కనిపిస్తుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే 13 వద్దలా Small, Medium, Large, Original size, Remove అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిల్లో అక్కడ ఫోటో ఎలా కనపడాలో చూసుకొని (స్మాల్ అంటే చిన్నగా, మీడియం అనేది మధ్యరకములో, లార్జ్ అంటే పోస్ట్ కార్డ్ సైజులో, ఒరిజినల్ అంటే ఆ ఫోటో అప్లోడ్ ఎ సైజులో ఉంటె అదే సైజులో అక్కడ కనిపించటం, రిమూవ్ అంటే ఆ ఫోటోని తీసెయ్యటం..) అది ఎన్నుకొని, 14 వద్ద గల Send ని నొక్కితే చాలు. 


3 comments:

  1. Instead of doing this
    Just drag and drop in mail box

    ReplyDelete
  2. We can conveniently use Copy (Cntrl C) and Paste (Cntrl V) option also.
    -Goutham

    ReplyDelete
  3. మీరిద్దరూ చెప్పిన రెండు పద్ధతులూ సరియైనవి. నాకు తెలియచేసినందులకు మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete

.