మీరు మీ జిమెయిల్ లో తెలుగులో ఒక మెయిల్ తయారుచేసి, పంపాలీ అని అనుకుంటున్నారా? అలా కూడా తెలుగులో పంపవచ్చును. చాలాకాలం క్రిందటే గూగుల్ ఈ టూల్ ని జిమెయిల్ కి అందించాడు. మీ జిమెయిల్ లోని Compose Mail ని ఓపెన్ చేస్తే మీకు మెయిల్ వ్రాసుకునే బాక్స్ ఇలా ఓపెన్ ఆవుతుంది. అందులో టూల్ బార్ లోని మొదటగా ఉన్న అ అనే అక్షరాన్ని నొక్కి, క్రిందన ఉన్న మెస్సేజ్ బాడీలో టైప్ చేస్తే ఎంచక్కా తెలుగులోకి వచ్చేస్తుంది.
అలా తెలుగులో ఎంచక్కా వ్రాసుకోవచ్చును. అలా ఈజీగా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాస్తూ, స్పేస్ నొక్కగానే వెంటనే తెలుగులోకి మారిపోతుంది. చాల బాగుంది కదూ!. తెలుగే కాదు అలా పంతోమ్మిది భాషల్లో వ్రాసుకోవచ్చును. ఇది అన్ని మెయిల్ బాక్స్ లలో డిఫాల్ట్ గా ఉంటుంది. ఒకవేళ - ఇలా మీ మెయిల్ బాక్స్ లో ఈ టూల్ కనిపించనప్పుడు, క్రింది ఫోటోలో మాదిరి దాన్ని మీ అందుబాటులోకి తెచ్చుకోవటానికి :
1. మీ జిమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
2. General ఓపెన్ చెయ్యండి.
3. Enable Transliteration ప్రక్కన ఉన్న గదిలో టిక్ చెయ్యండి.
4. అక్కడ డ్రాప్ బార్ ని నొక్కి అందులో తెలుగుని ఎంచుకోండి.
5. Right to left encoding support off ని నొక్కండి.
ఇప్పుడు క్రిందన ఉన్న Save బటన్ నొక్కేస్తే తెలుగు లో మెస్సేజ్ బాడీలో వ్రాసుకోవచ్చును.
మీ మెయిల్ లో ఇలా కనిపించట్లేదు అని మీ ఫిర్యాదే అయితే - మీరు మొత్తం మెయిల్ బాక్స్ ని Basic HTML ని నొక్కి, వాడుతున్నారు అన్నమాట. అప్పుడు మీరు ఆ మెయిల్ బాక్స్ బేసిక్ HTML వాడుతున్నారు అన్నమాట. ఆలాంటప్పుడు మీరు పైన ఉన్న Switch to Standard view ని నొక్కితే సరి. మీకు అలా తెలుగు టూల్ సెలెక్ట్ చేసుకొనే ఆప్షన్ సెట్టింగ్స్ లలో కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఎనేబుల్ చేసుకొని వాడేసేయ్యండి.
ఇలా తెలుగు టూల్ ని, మన జిమెయిల్ అక్కౌంట్ కి వేసుకోవచ్చును.
It is most usefull post to me. Thanks.
ReplyDeleteVery useful guidance
ReplyDeletePrabhakar.rayabaram@gmail.com
థాంక్స్..
ReplyDelete