Wednesday, February 23, 2011

How to set Blog Archive - Post Headlines.

Sudha said...
పైన ఉన్న సుధ నేను కాదండీ.
మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగపడుతుంది. శ్రమ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు.
నాకు ఒక సహాయం కావాలి. బ్లాగ్ లో మన టపాలు వాటికి మనం పెట్టిన పేర్లతో కనిపించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరా దయచేసి...blog archive ని add చేసాక ఏం చేస్తే మన టపాలు వాటి పేర్లతో కనిపిస్తాయో అర్థం కాలేదు. వాటిని ప్రచురించిన తేదీలు మాత్రమే కనిపిస్తున్నాయి.
వీలయితే దీనిగురించి కూడా ఓ టపా....
Wednesday, February 23, 2011 12:11:00 AM ఈ అభ్యర్ధన కి సమాధానం ఇప్పుడు మీకు టపా రూపములో అందిస్తున్నాను.. 

ఇది నిజానికి చాలా చిన్న సమస్య.. ఓకే.. బ్లాగర్ యొక్క ఆర్కివ్ లో మనం పోస్ట్ చేసిన టపాల పేర్లు కాకుండా ఆ టపాలను పోస్ట్ చేసిన తేదీలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే కాస్త చిక్కే!.. ఈ సమస్యని తొలగించుకోవటానికి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలో చూద్దాం.

ముందుగా మీరు హోం పేజి ఓపెన్ చెయ్యండి. అక్కడ కనిపిస్తున్న టూల్స్ లలో Design ని 1 నొక్కండి. నొక్కారా..?


ఇప్పుడు ఈ క్రింది పేజీలాగ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అందులో 2 వద్ద చూపినట్లు - Blog Archive వద్ద నున్న Edit ని నొక్కండి. 


ఇప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెయ్యల్సింది చాలా సింపుల్. 
3 వద్ద చూపినట్లుగా Hierarchy వద్ద ఓకే చెయ్యండి. 
అలాగే 4 వద్ద చూపినట్లు, Options వద్ద ఉన్న Show post titles అనే వద్ద ఉన్న గదిలో టిక్ (మౌస్ తో క్లిక్) చెయ్యండి. బహుశా మీరు ఇదే చేసి ఉండకపోవచ్చును. 
ఆతర్వాత 5 వద్ద ఉన్న SAVE ని నొక్కండి. అంతే.. మీ బ్లాగ్ ఆర్కివ్ లో తేదీలు కాకుండా టపాల శీర్షికలు వస్తాయి.



ఇంతేనండీ..

1 comment:

  1. ఇప్పుడు చూస్తున్నానండీ...వెంటనే పోస్టు రాస్తారనుకోలేదేమో మరి నేను...ధన్యవాదాలు.
    నిజానికి నాకు కావలసినది ఇదో కాదో అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను.నేనే క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ అడుగుతాను. ఈడౌట్ ఎప్పుడో 10 పోస్టలు రాస్తున్నప్పుడు వచ్చింది. మీరు చెప్పినట్టు ఎక్కడో సేవ్ అనడం మర్చిపోయి ఉంటాను.
    ఆ తర్వాత స్క్రోలింగ్ తో పోస్టులు కనిపించేలా చేయడం అనేది మహేష్ గారి బ్లాగ్లో నేర్చుకొని దాంతో గడిపేస్తున్నా. ప్రస్తుతం 37 అయినట్టున్నాయి. నేను అడిగినట్టుగా అన్నిటి పేర్లు వస్తుంటే ఇక బ్లాగునిండా అవే నిండిపోతాయేమో. మీరు చెప్పినదాన్ని సేవ్ చేసి పెట్టుకున్నాలెండి.థాంక్స్.

    ReplyDelete

.