Thursday, March 11, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 10

ఇప్పుడు మీకు కొద్ది కొద్దిగా తెలుగులో టైపింగ్ చెయ్యటమెలాగో వచ్చిందన్న మాట! లేఖిని, బరహా లో వలె కేపిటల్ అక్షరాలు (అప్పెర్ కేజ్ అక్షరాలు), స్మాల్ లెటర్స్ (లోయర్ కేజ్ అక్షరాలు) ఇందులో వ్రాయడం ఉండదు. అన్నీ చిన్న అక్షరాలలోనే టైపింగ్ చెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన పాఠాలలో అలాగే చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి.  మీకు ఈ తేడా స్పష్టముగా తెలియాలంటే ఈ క్రింది ఉదాహరణ చూడండి.:

ఇప్పుడు మనం ఒక పదాన్ని లేఖిని లేదా బరహా లో వ్రాద్దాం. ఆ తరవాత దాన్ని గూగుల్ లిప్యంతరము లో వ్రాద్దాము. మాయా, బ్లాగులో, ఆషాడమాసం అన్న ఈ మూడు పదాలు తీసుకున్నామే అనుకుందాము. వీటిని ముందుగా బర్హాలోనో, లేఖిని లో ఇలా వ్రాస్తాము..

మాయా = mAyA
బ్లాగులో = blAgulO
ఆషాడమాసంAshADamAsaM 

అని అలా పెద్దా చిన్న అక్షరాలని వాడుతూ ఇంగ్లీషులో వ్రాస్తాము కదా.. ఇప్పడు గూగుల్ లిప్యంతరాన్ని వాడి పదాలని ఎలా తెలుగులో వ్రాయగలమో చెబుతాను.

మాయాmaayaa 
బ్లాగులో =  blaagulo  
ఆషాడమాసంaashaadamaasam    

ఇలా వ్రాయవచ్చును. మీకిక్కడ ఒక విషయం చెప్పదలచుకున్నాను.. మీరు వాడుతున్న లేఖిని, బరహా.. లని నేను తక్కువ చూపు చూసి, వాటిని వాడకండీ, అవి వాడితే తలనొప్పులు.. అని ఏమీ చెప్పటం లేదు. అది మీ ఇష్టం. కాదనను. ఎవరికీ ఏది బాగుంటే అదే వాడండి. మిమ్మల్ని ఇదే వాడండి అని ప్రాధేయపడటం లేదు. గూగుల్ వాడి లిప్యంతరము వాడితే / వాడమని మీతో చెబితే నాకేమీ కమీషను గానీ, మరే ఇతర ప్రోత్సాహకాలు గానీ నాకు రావని మీకు సహృదయముతో విన్నవించుకుంటున్నాను.

మరి ఇదంతా ఎందుకు అని మీరడిగితే ఒక స్నేహితురాలు నాకు తెలుగు టైపింగ్ నేర్పించరా? అని (గోముగా) అడిగితే దగ్గరుండి(!!) నేర్పించలేక ఇలా ఆమెకి పాఠాలు చెప్పాల్సివస్తున్నది. అలాగే పనిలో పనిగా మీకూ ఈ విషయములో సాయం చేద్దామని, నా బ్లాగులో వ్రాస్తే ఆమెకీ, అందరికీ ఉపయోగపడుతుందని.. అలాని ఇక్కడ వ్రాయటం. అంతే!! నేను తెలుగు పండితున్నీ కాను. అలాగే సాఫ్ట్వేర్ రంగానికీ చెందిన వాడిని కూడా కాను.. ఓ సాధారణ అంతర్జాల వీక్షకుడిని.. అంతే! దైవానుగ్రహం వల్ల ఈ టైపింగ్ ని స్వంతముగా నేర్చుకొని, మీకు చెప్పటం. నా బ్లాగు హెడర్ లో చెప్పినట్లు "నా జీవిత పాఠాలు నాతోనే ముగిసిపోకుండా, మీకూ పనిచేస్తాయన్న ఉద్దేశ్యముతో ఈ బ్లాగ్ ని మీకోసం రాయడం. ఏఒక్కరికైనా ఈ బ్లాగ్ లోని సమాచారం ఉపయోగపడిందంటే - ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్లే.." అంతే! అలాని నేనేదో పెద్ద సహాయం చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవటం లేదు. అలనాడు - లంకకి శ్రీ రాముడు వారధి కట్టినప్పుడు.. తనవంతు సహాయం చేసిన ఉడుత లాగా నా సహాయమూ అంతే!..

ఎవరైనా ఈ పాఠాలు చదివి "ఏకలవ్యుడిలా" వారి వారి నైపుణ్యాన్ని పెంచుకుంటే, నాకేమీ మీ చేతి వ్రేళ్ళని గురుదక్షిణగా అడగను అని మరీ మరీ విన్నవించుకుంటున్నాను. కాకపోతే - (ఆ! కాకపోతే!!- త్వరగా చెప్పూ..సస్పెన్సు ఎందుకూ - అని అంటున్నారా? ) OK!! ఒక చిన్న స్క్రాపు రాయండి చాలు. మీవల్ల తెలుగుని ఇంకా బాగా వ్రాయగలుగుతున్నాను అని. బస్! అంతే!! నాకొక అదో తుత్తి..

ఇక వచ్చే క్లాసుల్లో ఇంగ్లీషు పదాలని తెలుగులో ఎలా వ్రాయాలో చెబుతాను.

2 comments:

  1. why true translation? more meaningful without ' naa '. ' jeevitha ' more meaqningful?

    ReplyDelete
  2. మీ సలహాకి కృతజ్ఞతలు..

    ReplyDelete

.