సచిన్ టెండూల్కర్ నిన్నటి దక్షిణాఫ్రికా తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మాచ్లో 147 బంతుల్లో 200 ల పరుగులు చేసాడు. ఇది నిజముగా భారతీయులు గర్వించదగ్గ విషయం. అతని రికార్డుల గురించి ఇక్కడ చెప్పటం లేదు గాని.. అతడికి ఉన్న ఒక గొప్ప ప్రత్యేకతని ఇక్కడ చెప్పదలచుకున్నాను..
ఎవరైనా ఎన్నైనా అనుకోనీ! ఎన్నైనా విమర్శలు చేయనీ!! - తన ఆటేదో తాను ఆడుతాడు. వయసు మీద పడింది.. అడ్వర్టైజ్ ల మీదనే దృష్టి.. తన రాంకుల కోసమే ఆట.. ఇలా ఎన్ని విమర్శలున్నా ఒక్క మాట కూడా మాట్లాడక, తానేమిటో తన బ్యాటు ద్వారానే ఆట చూపి సమాధానం చెప్పే ఒక్క మగాడు - సచిన్. విమర్శలు చేసేవారు ఒక విషయం గమనించాలి - ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ప్రతి సినిమా హిట్ చేయలేడు ఎలాగో ఆటకి వచ్చిన ప్రతిసారీ బాగా ఆడటం ఎవరివల్లా కాదు. ఇంతగా చెబుతున్నాను.. నేను సచిన్ అభిమానినా? అని మీకు అనుమానం రావచ్చును.. కాని ఎవరి పట్లా అభిమానం లేదు. నేనూ ఒకప్పుడు గొప్పగా క్రికెట్ ఆడేవాడిని.. నేను ఆడుతున్నానంటే అవతలి జట్లు ఓ మోస్తారు భయానికి గురి అయ్యేటివి.. అవన్నీ ఇప్పుడెందుకులే!.. ఆ అనుభవాల మీద సచిన్ గురించి చెప్పాలనిపించింది.
No comments:
Post a Comment
.