Thursday, January 14, 2010

సూర్యగ్రహణం

సంపూర్ణ సూర్యగ్రహణం ఇంకా కొద్దిగంటలలో మొదలవబోతున్నది.. ఈ శతాబ్దములోనే (సెంచురీ) అతి పెద్ద నిడివిగల సూర్యగ్రహణం ఇది. 1968 సంవత్సరములో ఇంత దీర్ఘ సూర్యగ్రహణం వచ్చింది. తరవాత ఇప్పుడే..


ఇక్కడ మీకో విషయం చెప్పదలచుకున్నాను. మీరు నమ్మితే నమ్మండి - నమ్మకుంటే నమ్మకండి. నేనూ నమ్మేవాడిని కాను. కాని నమ్మాల్సివచ్చింది - ఒక సంఘటన జరగక పోయిఉంటే.

ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రిందట సూర్య గ్రహణం ఏర్పడితే గ్రహణ సమయములో ఒక ఉంగరం చేయించుకొని ఆ గ్రహణం అయిపోయే లోపుగా ఆ వ్యక్తి ధరిస్తే మంచిది అని తెలిసింది. సరే అని ఆ సమయములో ఉంగరం చేయించాను.. గ్రహణం అయిపోయేలోగా నేనా ఉంగరం ధరించాను. ఆ తరవాత అంతా బాగుంటుందని అనుకున్నాను.. కాని ఆర్థికముగా బాగా దెబ్బతిన్నాను.. ఎందుకిలా అనుకున్నానే గాని కారణాలు తెలీదు.. సంపాదన బాగుండేది కాని మిగులు చూస్తే ఏమీ ఉండేది కాదు. దీని కారణం వెదకగా వెదకగా చివరికి ఒక జ్యోతిష్య శాస్త్రము పుస్తకములో చూసాను.. అది యే పుస్తకం అని గుర్తులేదు.. కాని అది నిజమే.. అందులో (ఆ ఉంగరాన్ని) గ్రహణ సమయములో ఆ ఆ గ్రహ భాదితుడు (ఇక్కడ సూర్యుడు) అంశాన / జన్మ సమయం రాశ్యాదిపతి ఉండి ఆ సమయములో పుట్టినవారు / జన్మించినవారు ఆ గ్రహణ సమయములో బయటకి రావద్దు - అనేది. ఏది ఎంత సత్యమో తెలీదు.. ... ... నేను మాత్రం ఆ రోజున ఆ సమయములో బయటనే ఆ గ్రహణ కాంతిలోనే ఉండి మరీ ఉంగరం చేయించి ధరించాను. అలా ఉంటే / అలా వారి అంశాధిపతికి అలా ఉన్నప్పుడు వీరు ఇలా ప్రవర్తిస్తే వీరికి ఆ అంశాధిపతి (ఇక్కడ సూర్యుడు) యొక్క తేజస్సు వీరిపట్ల నశిస్తుంది / తగ్గుతుంది. ఇది చాలా ఆలస్యముగా తెలిసింది. అంతలోగానే అయ్యాల్సింది అయిపొయింది.. ఆర్థికముగా బాగా దెబ్బతిన్నాను.. ఆ రోజులలో సంపాదన బాగుందేడిది.. కాని నాకు తెలీకుండానే ఒక్క పైసా మిగిలేది కాదు.. ఆ తరవాత రెండు, మూడు సంవత్సరాలనుండీ కొద్ది కొద్దిగా బాగుపడుతున్నాను..
మిమ్మల్ని నమ్మించడానికి ఇదంతా చెప్పటం లేదు. ముందే చెప్పాను నమ్మితే నమ్మండి... అని. నేను మాత్రం గ్రహణ సమయం అంతా బయటకి వెళ్లక నెట్ ముందే హాయిగా కాలం గడుపుతానని నిర్ణయించుకున్నాను.. మీరు మీ ఇష్టం.

ఒక చిన్న సూచన: ఇది రాశ్యాదిపతి సూర్యుడు, ప్రస్తుతం సూర్యదశ నడుస్తున్నవారు గ్రహణం చూడరాదనీ, గ్రహణ కాలములో బయటకి వెళ్లి ఆ వెలుతుర్లో ఉండరాదనీ, గ్రహనాంతరం విధిగా దోషనివారణలు చేయించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.

No comments:

Post a Comment

.