Saturday, February 7, 2009

డ్యూయట్ - అంజలీ అంజలీ పుష్పాంజలి..



చిత్రం: డ్యూయట్
రచన: వెన్నెలకంటి
సంగీతం: A.R రెహమాన్
గాయకులు: S.P.బాలసుబ్రమణ్యం, చిత్ర
పాటలో నటించిన వారు: ప్రభు, మీనాక్షి శేషాద్రి
*******************


పల్లవి:

అంజలీ అంజలీ పుష్పంజలీ
అంజలీ అంజలీ పుష్పాంజలీ
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కానరాని నగవులకు కవితాంజలి 

చరణం 1: 

నిన్నటి దాక నువ్వు నేను 
ఇరువురం ఎవరని 
కమ్మని బంధం యిలా తెలిపెను ఒకటని 
కడలిన పడు వానలా కలిపిన మది 
ఇది కరిగిన సిరి మోజుల కదా యిది 
నా చెలి ఎదురుగా తొలి స్వప్నం తోనికినది 
ఎదలో మధు కావ్యం పలికినది 
అంజలీ అంజలీ వలపుల నా చెలీ 
పూవంటి పదములకు పుష్పాంజలి 
ముద్దయిన పెదవులకు మోహాంజలి 
కలహంస నడకలకు గీతాంజలి 
కనరాని నగవులకు కవితాంజలి // అంజలీ అంజలీ పుష్పాంజలీ // 

చరణం 2: 

కన్నుల సంకేతమే కలలకు తొలకరి 
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి 
గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిలపాటే 
యిలా పలికినదెందుకో చెలువుగా ఎద మారే 
మడువనిధ అమావాస్య నిశిమారే 
వెన్నెలగా అంజలీ అంజలీ 
ఇది హృదయాంజలి 
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి 
నీ గానమాధురికి గీతాంజలి 
ఎద దోచు నవ్వులకు నటనాంజలి 
కవి ఐనా నీ మదికి కవితాంజలి // అంజలీ అంజలీ పుష్పాంజలీ /

చరణం 3: 

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి 
నా వూపిరి పలికెను పల్లవే కన్నుల్లో 
నువ్వు లేనిదే కలలే రావులే నా మది 
నువ్వు లేనిదే కవితే లేదులే తెలిసెను 
నువ్వే నా మనసువని మోజుకు నెలవయిన వలపువని 
అంజలీ అంజలీ వలపుల నా చెలీ // అంజలీ అంజలీ పుష్పాంజలీ //

1 comment:

.