నా పేజి చూస్తున్నందులకు/చదువుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు..
నేను నా జీవితంలో ఎన్నో ఎగుడు, దిగుల్లని చూసాను. ఇంకా చూస్తూనే ఉన్నాను. ఫలితంగా ఎన్నో విషయాలు తెలిసాయి/తెలుస్తూనే ఉన్నాయి. ఇందులో దాదాపుగా అన్నీ నేను చవిచూసినవే.. "ఇన్ని" అనుభవాలను పొందానుగా! ఇవ్వన్నీ నా "స్వంతం" అనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే నాకంటూ ఒక బ్లాగ్ పేజీని తయారుచేసి.. అందులో చిన్నవీ, పెద్దవీ, అవసరమా, కాదా ఆలోచన లేకుండా అన్నీ (చెత్త, చెదారం) విషయాలు మీముందున్చాలని, అనుకొని బ్లాగ్ పేజిని తయారు చేస్తున్నాను.
మనము సాధారణంగా మనకెవరైనా మంచి మాటలు చెబితే - "చాలు! నాకు తెలుసులే!! "అంటూ అడ్డు తగులుతాము - అవతలివారు మనకు మేలు కోరి, సాహసం చేసి మరీ చెప్పినా.. మనమూ ఒక మంచి విషయం చెప్పాలని వారితో చెబితే ... మనతో సంభందాలు అన్నీ తెంచుకుంటారు..
ఒక నెల క్రితం మధు (ఒరిస్సా) అనే ఒక అమ్మాయి ఓ ఫ్రెండ్ నా సోషల్ సైట్ పేజిలో చూసి.. ప్రొఫైల్ నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే ఒకే అంది తను.. ఆ వెంటనే తన మొబైల్ నెంబర్ ఇచ్చింది - నా స్క్రాప్ గా. నేను - అలా మొబైల్ నెంబర్ స్క్రాప్ లో రాస్తే ఎలా? ఈ-మెయిల్ చేస్తే బాగుండేది గదా.. నీకే ఇబ్బంది కదా! అని - అంటే ఆమె , ఆమె ఫ్రెండ్ లు నా పేజి లోనుండి "కట్" అయ్యారు.. ఆఖరికి వారి స్క్రాప్ లు కూడా తీసేసారు.. ఆఫ్కోర్స్ నాకేమి బాధగా లేదు! ఫ్రెండ్ గా చెబితే వినక పోతే మనమేమి చేస్తాము.. నేనూ కూడా అంతేలే! (నిజం ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి కదూ). మనకు తెలుసన్నది నిజంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఎదురుతిరిగితే అయ్యో అని అనుకుంటాము. కాని మన ఓటమిని అంగీకరించము. అదే మనిషి నైజమ్. "అయ్యో! అప్పుడే వినకపోతిమి కదా!.. సమయము, డబ్బు, శ్రమ.. అన్నీ వృధా అయ్యాయి కదా!.." అని తీరికగా చింతిస్తాము - అప్పుడలా చేయకపోతే చాలా బాగుందేడిది- అని ప్రతి ఒక్కరూ జీవితములో ఒక్కసారైనా అనుకొని ఉండవచ్చు.
అప్పుడలా ఉన్నా నేను (కొద్దిగా) మారాను.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా మిత్రులను, శ్రేయోభిలాషులను, ముఖ్యముగా ఆ సమస్యను అంతకు మునుపే ఎదుర్కున్న వారిని సలహాలు మాత్రమే అడిగి, నా స్వంత నిర్ణయం తీసుకున్తున్నానిప్పుడు.. ఫలితముగా నా జీవితము చాల మారింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది- ఈ పనేదో ఊహ వచ్చినప్పటినుండి చేస్తే ఈ పాటికి నా జీవితం తీర్చిదిద్దినట్లుగా ఉండేది..
నాకే ఇంత లాభం అనిపించినప్పుడు మిగతావారి సంగతి? తర్వాత చాలామందికి పరిష్కార మార్గాలు చెప్పి, నిర్ణయం మాత్రం వారినే తీసుకోమంటున్నాను. ఎందుకంటే వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితం వారే అనుభవిస్తారు కాబట్టి. ఫలానా వారి మాటలు వినీ నా జీవితం ఇలా తగలబడింది - అని అనుకోకుండా ఉంటారని. చాలా మందికి మేలు చేసాయి - అది చిన్నదో, పెద్దదో.. మొత్తానికి వారి జీవితానికి మేలు కలిగిందన్న చిన్న సం+తృప్తి . పెద్ద పరిష్కారమైతే ఏదో అనుకోవచ్చును కాని చిన్న దానికి కూడా లైఫ్ బాగుపడుతుందా? అంటే నేను మాత్రం ఎందుకు బాగుపడదు? అని అంటాను. మన నిజ జీవితములో మనము ఉపయోగించే చాలా వస్తువులు చిన్న చిన్న పరిష్కార మార్గల్లోనే..ఆలోచన ధోరణి నుంచే ఆవిష్కరించబడ్డాయి. ఉదాహరణకు ప్రయానించీటప్పుడు మ్యూజిక్ వినాలన్న సమస్యకు జవాబుగా వాక్ మాన్, ఐ-పాడ్ తయారయ్యాయిగా. ఇక్కడ శ్రమ ఎంత ఉన్ననూ- సైజు చిన్నగా, తక్కువ ఖరీదు, ఎక్కువ సామర్థ్యం.. మొదలగునవి అన్నీ చిన్న చిన్న పరిష్కారమార్గాలే ఆ సమస్యలకు జవాబు చెప్పాయి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే మనకు చిన్నగా ఉన్నా సమస్యలు వేరొకరికి పెద్దగానే ఉంటాయి.. మొదట్లో నాకైతే కంప్యూటర్ మౌస్ ను డబుల్ క్లిక్ చేయవచ్చేది కాదు.. నేడు చాలా తేలిక. .... అందుకే చిన్న చిన్న విషయాలనుంచి పెద్ద పెద్ద విషయాలు అన్నీ చెప్పాలనీ అనుకుంటున్నాను.. అందులో మీకు నచ్చిన విషయాలు శుభ్రముగా ఆచరణలో వాడుకోవచ్చును. నేను చెప్పే విషయాలనుండి మీరేమైనా లబ్ది పొందితే - ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్టే..
hmm bagundi andi :)
ReplyDeleteHi Raj,
ReplyDeleteI Appreciate your great work.All the best one day you will definitely reach your goal...
Yours,
Kancharla Anil
(Future Telugu Film Director)
Nice Blog. Useful informaton ni andariki share chestunnanduku thanks!
ReplyDeleteNice blog..Useful information. Thanks for sharing.
ReplyDeleteThank you Prapurna N garoo..
ReplyDeleteThank you.. Kancharla Anil gaaroo! Meelaanti vaari aasheessulu sadaa unte - thappaka cherukuntaanani anukuntunnaanu. Mee protsaaham eppudoo undaalani korukuntunnaanu.
ReplyDeleteneneppudu evari feelings hurt avakunda vundela matlada taanike try chesta. comments kuda..anthe. but incase if I hurt u r feelings ...plz take it easy. okari blog ki vachi valla feelings hurt ayyela comments pette right naaku ledu.
ReplyDeleteOk.. Manchi mentality ye meedi. Good. Please continue. Carry on..
ReplyDelete