Sunday, June 27, 2010

Time - Screen saver

మీకు ఈ రోజు ఒక అందమైన స్క్రీన్ సేవర్ ని పరిచయం చేస్తాను.. ఈ పాటికే మీరు మీ కంపూటర్స్ కి ఎంతో అందమైన స్క్రీన్ సేవర్స్ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నేను పరిచయం చేసే స్క్రీన్ సేవర్ ని ఇది మీ ఆఫీస్, ఇంట్లోని సిస్టం కి పెట్టుకోండి. అందానికి అందం, మరియు ఉపయోగకరముగా ఉంటుంది కూడా.. పెట్టుకున్నకా మీకు నచ్చిందీ, నచ్చలేనిదీ చెప్పటం మరచిపోకండీ! ఓకే.. ఇంకేం! ఇక్కడ చెప్పినట్లుగా పద్ధతులని ఫాలో అయిపోండి.

ముందుగా మీరు మానిటర్ మీద ఉన్న అన్ని అప్లికేషన్లని క్లోజ్ చెయ్యండి. అలాగే ఈ బ్లాగు పేజిని మినిమైజ్ చెయ్యండి. మానిటర్ లో సగం వరకు వచ్చేలా మినిమైజ్ చెయ్యండి. ఇలా చేస్తే ఇదంతా చదువుకుంటూ - మిగతా సగములో అలా చేసుకోవచ్చు. తేలికగా ఉంటుంది. అలా చేశాక మోనిటర్ మీద కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చెయ్యండి. ఇదిగో అప్పుడు ఇలా వస్తుంది.


1. వద్ద ఉన్న Properties ని ఎంచుకోండి. దాన్ని క్లిక్ చెయ్యండి. చేశారా.. అప్పుడు క్రింది ఫోటో మాదిరిగా వస్తుంది.


 ఇప్పుడు 2 వద్ద చూపిన Screen saver ని నొక్కండి. అప్పుడు ఈ ఈ ఫోటో మాదిరిగా మెనూ వస్తుంది. ఇప్పుడు మీరు 3వద్ద చూపిన బార్ ని ఓపెన్ చెయ్యండి.



ఓపెన్ చేశారా? అప్పుడు మీకు ఈ క్రింది ఫోటోలో చూపిన విధముగా వస్తుంది. అందులో 3 వద్ద మీరు 3D Text ని ఎంచుకోండి. అక్కడ 4 వద్ద 3D Text సెలెక్ట్ చేశారుగా.. ఇప్పుడు మీరు 5 వద్ద ఉన్న Wait ప్రక్కన ఉన్న బాణం గుర్తులని వాడి రెండు నిముషాలు ఉండేట్లు సెట్ చేయండి. ఇక ఇప్పుడు 6 వద్ద నున్న settings ని నొక్కండి. నొక్కారా!..



అప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 7 వద్ద ఉన్న Choose font ని నొక్కండి. అలాగే Choose font మీద ఉన్న Text లో Time ని ఎన్నుకోండి. ఇదే ముఖ్యమైనది. 



ఆ తరవాత వచ్చిన ఈ క్రింది విండోలో 
8 వద్ద Palatino Linotype ని,
 9 వద్ద Bold ని,
 ఎన్నుకొని ఆ తరవాత 10 వద్ద నున్న OK నొక్కండి.


ఇప్పుడు వచ్చిన బాక్స్ లో 11 రొటేషన్ టైప్ వద్ద None,
12 సర్ఫేస్ స్టైల్ వద్ద Reflection,
 13 రిజల్యూషన్ వద్ద Low,
14 సైజ్ వద్ద Large అనీ,
15 వద్ద Rotation Speed ని Slow అని ఎంచుకొని,
16 వద్ద OK ని నొక్కండి. 


హమ్మయ్య!.. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ అంతా మార్చారు. ఇప్పుడు మీ సిస్టాన్ని రెండు నిముషాలు అలాగే వదిలేసి, అలా వెళ్లి వచ్చి చూడండి.  అప్పుడు మీ మానిటర్ ఇలా కనపడుతుంది. చాలా బాగుంది కదూ.. ఇప్పుడు మీ మానిటర్ ని చూసి అందరూ మెచ్చుకుంటారు. మాకూ చేసివ్వమని అడుగుతారు చూడండి. 


ఒక గమనిక: మీ మదర్ బోర్డులో బ్యాటరీ ఉండి, సిస్టం ట్రే లో గడియారం నడుస్తూ ఉంటే.. ఇది పనిచేస్తుంది.

3 comments:

  1. Usefull article.. Keep it up.

    ReplyDelete
  2. nice sir., ippudey naa pc ki kuda apply chesa

    ReplyDelete
  3. కృతజ్ఞతలు.. మీలా అందరూ దాన్ని వాడితే, గడియారం లాగా, మరియు విద్యుత్ పొదుపూ జరుగుతుంది.. కామెంట్ వ్రాసినందులకు ధన్యవాదములు.

    ReplyDelete

.