Friday, December 9, 2016

New Blogger Dashboard

కొద్దిరోజుల క్రిందట బ్లాగర్ డాష్ బోర్డ్ మారింది. ఇది వీక్షకులకు కనిపించదు. ఈ మారిన డాష్ బోర్డ్ కేవలం ఆయా బ్లాగ్ స్వంతదారులకు మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు బ్లాగర్ డాష్ బోర్డ్ ఇలా క్రింద ఫోటోలోలా కనిపించేడిది. దీని క్రింద మనం పోస్ట్ చేసిన పోస్ట్స్ తాలూకు వివరాలు కనిపించేవి. మిగతా వాటన్నింటికీ లోపలికి వెళ్ళి వివరముగా చూడాల్సి వచ్చేది. 


ఇప్పుడు అలా కాకుండా అంతా ఒకే డాష్ బోర్డ్ క్రిందకు మార్చి, ఒకచోటనే మన బ్లాగుకి సంబంధించినవన్నీ చూడటానికి - పాత డాష్ బోర్డ్ స్థానాన్నే - మరొక క్రొత్త బ్లాగ్ డాష్ బోర్డ్  Blog Dash board ని ప్రవేశపెట్టారు. మీరు మీ బ్లాగ్ ని తెరచి చూస్తే మీ బ్లాగ్ హోం పేజీ గా - ఈ క్రొత్త డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఆది ఇలా ఉంటుంది. 


అలా మారిన బ్లాగ్ హోం పేజీ కాస్త మసకగా మారి, దానిపైన కాన్ఫిడెన్షియల్ Confidential అంటూ పాపప్ విండో Popup Window కనిపిస్తుంది. 1 వద్ద కనిపిస్తున్న Got it అనే బటన్ ని నొక్కి ఆ పాపప్ విండో ని తీసేయ్యవచ్చు. 

అలా అయ్యాక, మీకు Your blogs live here అంటూ మరొక పాపప్ విండో కనిపిస్తుంది. ఇది ఆ డాష్ బోర్డ్ లో ఎడమ, పై భాగములో మూలన కనిపిస్తుంది. ఇందులో - మీరు ఈమధ్య అప్డేట్ చేసిన / పోస్ట్ చేసిన మీ స్వంత బ్లాగ్స్ అన్నింటినీ ఒక వరుసక్రమములో మీరు ఇక్కడ చూడవచ్చును. 2 వద్దనున్న Got it ని నొక్కి, ఈ పాపప్ విండో ని తొలగించవచ్చు. 


బ్లాగర్ గుర్తు క్రిందన మీరు ఈమధ్య అప్డేట్ చేసిన / పోస్ట్ చేసిన బ్లాగ్ పేరు కనిపిస్తుంది ( పై ఫోటోలో My VALUABLE LESSONS అని కనిపిస్తున్నది ) దాని ప్రక్కన ఉన్న త్రికోణాన్ని ( ఎర్రని వృత్తములో 3 అనే అంకె వద్ద చూపెట్టబడినది )  నొక్కితే - ఒక డ్రాప్ మెనూ తెరచుకొని, Your blogs అంటూ మీరు నిర్వహిస్తున్న బ్లాగుల లిస్టు 4 కనిపిస్తుంది. అది ఈ క్రింది విధముగా ఉంటుంది. 


మీరు ఏదైనా మరొక క్రొత్త బ్లాగ్ ని తెరవాలంటే - ఇక్కడే ఉన్న New blog ని 5 నొక్కి తేలికగా క్రొత్త బ్లాగ్ ని ప్రారంభించవచ్చు. అలా నొక్కితే ఇలా వస్తుంది. 


ఈ క్రొత్త డాష్ బోర్డ్ లో చాలానే బగ్స్ ఉన్నాయి. పాత డాష్ బోర్డ్ కన్నా కాస్త తేలికగా ఉన్నా, సాంకేతికముగా కొన్ని బగ్స్ అలాగే ఉండిపోయాయి. కొన్ని అదనముగా వచ్చాయి. వాటిని అప్డేట్ బ్లాగర్ వారు అప్డేట్ చేస్తే మరీ బాగుంటుంది. 


No comments:

Related Posts with Thumbnails