Thursday, April 28, 2016

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 1


Thursday, April 21, 2016

Heart Touching Story

( నేనొక కథని చదివాను. చాలా బాగా నచ్చింది. మనం ఒకరికి మేలు చేస్తే - మనకూ మేలు జరుగుతుంది అని తెలియజేసే ఈ కథకి రచయిత / రచయిత్రి ఎవరో నాకు తెలీదు. కొద్దిపాటి మార్పులతో ఈ కథని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అభినందనలు అన్నీ వారికే చెందుతాయి )

:: హృదయాన్ని హత్తుకొనే చిన్ని కథ ::
****************************************
హైవే మీద వెళుతున్న కారు టైర్ పంక్చర్ అవడం వల్ల ఆగిపోయింది. ఆ కార్ నుండి దిగిన ఆమెకు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ కార్ లో స్టేఫినీ టైర్ ఉంది కానీ తనకు వెయ్యడం రాదు. కార్ ని రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం ఎదురుచూస్తోంది కానీ ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది.
నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన. తను ఒక్కర్తే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు కూడా లేవు. ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేవు గనుక సెల్ పనిచెయ్యడం లేదు.
ఎవరూ ఆ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా? అనుకుంటూ ముసురుకుంటున్న చీకటిని చూసి భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.
అటుగా ముందుకు వెళ్తున్న ఒక పాత కారు , పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది. అందులో నుండి నల్లగా, మొరటుగా ఉన్న ఒక వ్యక్తి దిగాడు. అతడు తన దగ్గరకు రావడం చూసి, బెదిరిపోతోంది..  
ఏమి జరుగుతుంది?
ఎందుకు వస్తున్నాడు ??
ఏమి చేస్తాడు .???
మనసులో ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు.. కార్ టైర్ పంక్చర్ అయ్యిందని గమనించాడు. అలాగే తనని చూసి ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు. " భయపడకండి. నా పేరు బ్రియాన్ అండెర్సన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పనిచేస్తాను. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా ! మీరు మీ కారులో కూర్చోండి. నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది.
అతను ఆ కార్ డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని, కారు కిందకి దూరి జాకీ బిగించాడు. తారు రోడ్డు గీసుకుని చేతులు రక్తం కారాయి. జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టి చెప్పాడు.. " టైర్ మార్చడం అయిపోయింది మేడం."
ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. వద్దు అన్నాడు. " ఎంత అయినా ఇస్తాను ఎంతో చెప్పండి.. మీరు కనక కనబడి ఈ సహాయం చెయ్యకపోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎందరో సహాయ పడ్డారు. మీకు అంతగా సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మీకు అనిపించినపుడు నా తరపున వారికి సహాయం చెయ్యండి. బై " అని వెళ్లి పోయాడు.
మనసులోనే తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది. తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఆకలీ, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ దగ్గరకి వెళ్ళేలా చేశాయి.
అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక నిండు గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి, ఆయాసంతో బరువుగా నడుస్తున్నదని గ్రహించింది, ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో అన్ని టేబుల్స్ వద్దకి వెళ్ళి, వాళ్లకు కావలసిన ఆర్డర్స్ తీసుకోవడం, సర్వ్ చెయ్యడం, బిల్ తీసుకొని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తున్నది.
ఆమె తన టేబుల్ వద్దకి వచ్చి, చిరునవ్వుతో " ఏమి కావాలండి? " అని అడిగింది. 
అంత శ్రమ పడుతూ కూడా ఆమె ముఖంలో చెరిగిపోని చిరునవ్వు ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతూ - భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం అయ్యాక ఆమెకు 1000 డాలర్ల నోటు ఇచ్చింది. ఆమె వెళ్ళి చిల్లర తెచ్చి ఇవ్వబోతే ఆ కార్ ఆవిడ లేదు అక్కడ. ఆమె కూర్చున్న టేబుల్ మీద ఒక గ్లాస్ క్రింద ఒక పేపర్ మరియు 4000 డాలర్లు నోట్లు కనిపించాయి.. ఆ కాగితం చదివిన ఆ గర్భిణీ కి కన్నీళ్ళు ఆగలేదు.
అందులో - " చిరునవ్వుతో ఉన్న నీ ముఖం చూసి, నీకు బాధలు లేవేమో అన్నట్లు ఉంది. కానీ నిండు నెలలతో పనిచేస్తున్నావూ అంటే నీకు డబ్బు అవసరం చాలా ఉందని అనిపిస్తోంది. నాకు ఇందాక ఒక మిత్రుడు - బ్రియాన్ అండెర్సన్ కార్ టైర్ మార్పిడిలో సహాయపడినట్లే అతడిని తలచుకుంటూ ఈ డబ్బుల రూపములో నేను నీకు సహాయపడుతున్నాను. ఈ గొలుసు ఇంతటితో ఆగిపోకూడదు. నువ్వూ ఇతరులకు సహాయపడు.. " అని వ్రాసి ఉంది.
ఆమె ఇంటికి వచ్చింది. అంతక్రితమే - అలసిపోయి, ఇంటికి వచ్చి పడుకున్న భర్త చేతికేసి చూసింది. గీసుకపోయిన చేతుల మీద అక్కడక్కడా రక్తం గడ్డ కట్టుకపోయింది. అతని ప్రక్కగా కూర్చుంటూ " డబ్బుల సమస్యతో నా డెలివరీ ఎలాగా అని మనం బెంగ పడుతున్నాం కదా.. ఇక ఆ బెంగ తీరిపోయింది. ఆ భగవంతుడు మనకు సహాయం చేశాడు మై డియర్ బ్రియాన్ అండెర్సన్. ఆ దేవునికి కృతజ్ఞతలు.. " అంది ప్రశాంతముగా.

Tuesday, April 19, 2016

Quiz


నా దగ్గర Rs. 50 ఉన్నాయి. 
Rs. 20 తో టిఫిన్ చేశాను - Rs. 30 మిగిలాయి.
Rs. 15 తో టిఫిన్ చేశాను - Rs. 15 మిగిలాయి.
Rs. 9 టిఫిన్ చేశాను - Rs. 6 మిగిలాయి.
Rs. 6 తో టిఫిన్ చేశాను - Rs. 0 డబ్బులు అయిపోయాయి.
---------------------------------------------------------------------
Rs. 50 Rs. 51
========================================
ఇదెలా సాధ్యం..?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కొన్ని ప్రత్యేకమైనవి " కొన్నిసార్లు " అలా జవాబులు వస్తుంటాయ్. వాటికి అలాగే జవాబులు వెదుకుతూ ఉంటే - విఫలమవుతుంటాం.. పై లెక్కనే నిజమే అనుకుంటే - దాన్నే చాలా కొద్దిగా మార్చి లెక్క ని సరి చూద్దాం. అప్పుడు మీరు అంటారు - కొన్ని అలా " ఫ్లో " లో అలా కుదిరిపోతుంటాయ్ అనీ.. కొద్దిగా మారిస్తే తప్పుగా కనిపిస్తాయనీ..

పై లెక్కని మళ్ళీ చేస్తే :
నాదగ్గర Rs. 50 ఉన్నాయి.

Rs. 20 టిఫిన్ చేశా - Rs. 30 మిగిలింది.
Rs. 15 టిఫిన్ చేశా - Rs. 15 మిగిలాయి.
Rs. 15 టిఫిన్ చేశా - Rs. 0 ( డబ్బులయిపోయాయి )
----------------- ---------------------
Rs. 50 Rs. 45
మరి ఇప్పుడెలా చాలా తేడాగా మారింది ? చివరి ఖర్చు మారుస్తూ పోతుంటే - ఎంతో తేడాగా కనిపిస్తుందీ ఈ ప్రశ్న .పైన లెక్క సరి అయితే ఇక్కడా అంతే తేడా రావాలి కదా.. తేడా ఎలా మారింది..? సో, కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆశించకూడదు.

Saturday, April 16, 2016

Quiz

ఇందులో ఒక అంకె తప్పుగా ఉంది. 
అదేమిటో కనుక్కోండి. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
జవాబు : 6


Wednesday, April 13, 2016

పొడుపు కథలు - 28


చూస్తే చూసింది గానీ, కళ్ళు లేవు. 
నవ్వితే నవ్వింది గానీ పళ్ళు నోరూ లేదు, 
తంతే తన్నింది కానీ కాలు లేదు. ఏమిటది? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



Sunday, April 10, 2016

Quiz

ఇందులో 3 ఎన్నిసార్లు ఉందో చెప్పండి చూద్దాం.. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

Friday, April 8, 2016

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Tuesday, April 5, 2016

2% కమీషన్

మొన్న ఆదివారం నాడు - నా మొబైల్ కి హెడ్ ఫోన్స్ కొనాలనుకొని బయలుదేరాను. క్రొత్త క్రొత్త చోట్లలో షాపింగ్ చెయ్యడం నాకు అలవాటు. అలా ఎందుకూ అంటే ఎప్పుడూ ఒకేచోట కొంటూనే ఉంటుంటే - బావిలోని కప్పలా మారిపోతాను అని నా జీవిత అనుభవం. ఇది తెలుసుకొని కొద్దిసంవత్సరాలే అయ్యింది. కానీ ఈ అలవాటు చేసుకోవడం వల్ల చాలానే విషయాలు తెలుసుకుంటున్నాను. ( ఎందుకో, ఎలాగో అన్నది వివరముగా మరొకసారి వ్రాస్తాను. అంతలోగా మీరూ ఈ పద్ధతిని అలవాటుగా చేసుకోండి. చేసుకుంటారు కదూ.. )

ఈసారి మౌలాలి Moulali వైపుగా పని ఉండి వెళ్ళాను. ప్రొద్దున నుండీ సాయంత్రం వరకూ అక్కడే పని. బోర్ వస్తే - మధ్య మధ్యలో అక్కడున్న షాప్స్ లలో షాపింగ్ చేస్తూ పోయాను. అలా సాయంత్రం వరకూ గడిపేశాను. ఒక షాప్ లో నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికిది చాలా మామూలు విషయమైనా - నాకు కాస్త ప్రేరణని ఇచ్చింది. కొన్ని భవిష్యత్ ఆలోచనలు ఆ దిశగా సాగాయి.

ఎదురయ్యే ప్రతివారి దగ్గర ఏదోకటి మనం నేర్చుకోనేదో, మనకు ప్రేరణనిచ్చేదో ఉండే ఉంటుంది అని ఒక మహానుభావుడు సెలవిచ్చారు. ఎవరి వద్దైనా మాటల్లో ఏదో ఒకటి తట్టవచ్చు. మనకున్న ఆలోచనలని మరికాస్త ముందుకు తీసుకెళ్ళే విధముగా ఆ ఒకటీ ఉండొచ్చు..

సరే.. ఆవిషయాల్ని ప్రక్కన పెట్టి, జరిగింది చూద్దాం.

మొబైల్ హెడ్ ఫోన్స్ కోసం ఒక మొబైల్ షాప్ లోకి వెళ్ళాను. ఒక పెద్దమనిషి కౌంటర్ మీదున్నారు.. తప్ప మరెవరూ లేరు ఆ మధ్యాహ్న వేళ. నాకు కావాల్సింది అడిగాను. చూపించారు. మూడు హెడ్ ఫోన్స్ చూశాను.. కానీ అవి టెక్నికల్ గా అంత బాగా లేకుండి, బాస్ బూస్ట్ లో శబ్దం రావటం లేదు. ఎంత బాగా ఉన్న పాట పెట్టినా అంతే. వద్దని సున్నితముగా చెప్పి, తనకూ ఆ హెడ్ ఫోన్స్ తగిలించి వినిపించాను. నిజానికి అలా హెడ్ ఫోన్స్ ద్వారా పాటల్ని వినడం అదే తొలిసారట. నేను ఆశ్చర్య పోయాను.

" నాకేమీ తెలీదు.. అంతా మా అబ్బాయి చూసుకుంటాడు. వాడికే తెలుసు. వాడు జాబ్ చేస్తుంటాడు. తీరిక వేళల్లో ఈ షాప్ చూసుకుంటాడు. నేను రిటైర్డ్ ఎంప్లాయిని. ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ వస్తుందని ఇది పెట్టుకున్నాను. నాకేమో ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే ఈ షాప్. మొత్తం ముగ్గురం కలిసి ఈ షాప్ చూసుకుంటాం. ప్రొద్దున 8 నుండి రాత్రి 10 వరకూ షాప్ ఉంటుంది. నేనూ, మా అమ్మాయి, అబ్బాయి. ఒకరి తరవాత ఒకరుంటాం. లేకుంటే ఈ షాప్ ఖర్చు వెళ్ళుతుందా? " అన్నారు.

ఎంత షాప్ ఖర్చు అన్నాను.. ఏదో ఒకటి మాట్లాడాలని.

" స్వంత షాప్ కాదు. అద్దె షాప్. నెలకు 7,700 అద్దె.. " అన్నారు.

" మరి అంతగా సంపాదిస్తున్నారా?.." అన్నాను.. ( అలా అన్నాక నాకే ఏదోలా అనిపించింది.. మరీ పర్సనల్ వి అడుగుతున్నానేమో అనీ.. )

" హా..! రోజువారీ మొబైల్ రీచార్జ్, డాటా 30, 000 రూపాయలు ఉంటుంది. అందులో 2% వస్తుంది. అంటే రోజూ 600 రూపాయలు ఆదాయం. నెలకు 18,000 ( 600 x 30 రోజులు ). ఖర్చులు పోగా నెలకు పదివేలు మిగులుతాయి " అన్నారు.

షాప్ ని పరిశీలనగా చూశాను. పదీ X పది అడుగుల షాప్ అది. L టైపు కౌంటర్ + ర్యాక్స్ కి అరవై, డెబ్బై వేలు ఖర్చు కావచ్చు. మామూలుగా సింపుల్ గా ఉంది. అమ్మే మొబైల్ అస్సోస్సరీస్ ( ఉపకరణాలు ) అన్నీ కలిపి ఒక పదివేల రూపాయలు ఉండొచ్చు. ఆ మాత్రం పెట్టుబడికి అంత లాభం అంటే చాలా బాగున్నట్టే కదా.. ఇంతకన్నా మించి వ్యాపారాలున్నా అవిక్కడ అప్రస్తుతం.

నేనిక్కడ నేర్చుకున్న విషయాలు.. 

1. చిన్న పెట్టుబడి పెట్టి - చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
2. ఖాళీగా ఉండకుండా - గౌరవముగా ఉంటూ, బోర్ ని తొలగించుకోవచ్చు.
3. ప్రక్కనే మరిన్ని చిన్న చిన్న వస్తువులు అమ్మితే మరింత లాభదాయకం.
4. వయస్సు అయిపోయిందని అనుకుంటే మరిన్ని సమస్యలు. 74 సంవత్సరాలు అని ఖాళీగా ఉండక ఏదోకటి పెట్టుకొని ఉండటం భలేగా నచ్చింది నాకు.
5. ఆ వయస్సులో మరొకరి మీద ఆధారపడకుండా, తన కోసం తను సంపాదించుకోవడం - చాలా గొప్పగా అనిపించింది.
6. నామమాత్ర పెట్టుబడితో ( బ్యాలన్స్ కంపనీ డీలర్ వారే ఇస్తారు.. ఆ డాటా, మొబైల్ రీచార్జ్ అమ్మి, సాయంత్రం న ఆ కంపనీ డీలర్ వారికి డబ్బులు కట్టాలి ) ఆ మాత్రం ఆదాయం చాలా గొప్పదే కదా..


Monday, April 4, 2016

Quiz

ఇందులో 2 అనే అంకె ఎన్నిసార్లు ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం.. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Related Posts with Thumbnails