Friday, November 27, 2015

Quiz


ఈ సమస్యని పరిష్కరించండి. 
1 = 5 
2 = 10 
3 = 30 
4 = ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 120 

Tuesday, November 17, 2015

Quiz


ఈ కార్ పార్కింగ్ చేసిన - పార్కింగ్ లాట్ నంబర్ ఎంతో చెప్పుకోండి. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Friday, November 13, 2015

సత్యనారాయణ స్వామి వ్రత పీట

ఈరోజు పాత ఫోటోలు తిరగేస్తూ ఉంటే సత్యనారాయణ స్వామి వ్రత పీట ఫోటో కనిపించింది. ఆ ఫోటో కమామీషు ఏమిటో మీకు తెలియచెయ్యాలని అనిపించింది. 

ఒకసారి నా మిత్రుని షాప్ కి వెళ్ళాను. అతనితో మాట్లాడుతూ లోపల కూర్చోబోతుండగా ఒక మూలగా ఒక పీట కనిపించింది. ఈ పీటని సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి వాడుతారు. చాలా బాగా ఉంది ఆ పీట. దగ్గరగా వెళ్ళి చూశాను. టేకు లా గీతలుగా ఉన్నా, అది మామూలు కర్రతో చేసినది అని గమనించాను. ఇందులో మెచ్చుకోదగ్గ విశేషం ఏమిటంటే - వర్క్ - పనితనం. అంతా మెషీన్ మీద చేసినది. పక్కా లెక్కలతో, కొలతలతో చేసినది కావటం మూలాన చాలా బాగా వచ్చేసింది. 

ముందుగా పాత రద్దీ Wood cutting blade సహాయాన కర్రని చెక్కలుగా కోసుకొని, ఆ తరవాత వాటిని కావలసిన సైజుల్లో, ఆకారాల్లో కోసుకొని, వాటిని బాగా నునుపు కోసం లెవల్ మెషీన్ వాడి, అన్నివైపులా నునుపుగా చేస్తారు.. ఈరెండూ ఒకే మెషీన్ ప్లాట్ పాం లో ఉంటాయి. ఆ తరవాత వాటిని మేకుల సహాయన బిగించి, ఆ తరవాత చివరి ఫినిషింగ్ గా యాంగిల్ గ్రైండర్ తో - పేపర్ స్మూత్ చేశారు. ఇదంతా ఒక్కరితో అయ్యేలా ఉన్నా, కమర్షియల్ గా చేసేటప్పుడు మాత్రం ఒక బృందముగా పనివారు ఆ పీటలని తయారు చేస్తారు. అందువల్ల చాలా తక్కువ ఖర్చుతో, వేగముగా, ఆ పీటలు తయారు అవుతాయి. ఇక్కడ వీరి ఆలోచన అంతా తక్కువ ఖర్చులో ఆ పీటలని తయారు చెయ్యడం. 

కాకపోతే - వాటిలోనే - Export Quality అన్నట్లు కొద్దిగా జిగురు వాడి, వాటి సహాయన జాయింట్స్ అతికి, వాటికి Headless nails కొడితే చాలా బాగా ధృడంగా ఉంటాయి. మన్నికా బాగుంటుంది. అలాగే మూడు వైపులా డిజైన్ టేకు బీడింగ్ వాడితే మరింతగా అందం వచ్చేది. ఖర్చు మరో దాదాపు వంద పెరిగేది. కానీ మరో వంద ఎక్కువ చెప్పుకున్నా - ఆ మొత్తమూ వచ్చేది కూడా. 

ఈ ఆలోచన రాగానే - నా మిత్రున్ని అడిగాను. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎంతకు అమ్మారు అనీ.. 

" ఇందాకే ఒక గంట క్రితం ఒక ఆటోలో పది, పదిహేను పీటలు పట్టుకొచ్చి అమ్ముతుంటే - నా షాప్ వచ్చి అడిగారు.. ఎంత ధర అంటే మొదట ఎనిమిది వందలు చెప్పాడు.. టేకు కర్రతో చేసినదనీ. నాకెందుకో అంతగా ఉండదు అనిపించి, మూడొందలకు బేరం పెట్టా.. నసిగి, చివరికి నేను చెప్పిన రేటుకు నాకు అమ్మేశాడు.. ఈరోజుల్లో 300 రూపాయలకి ఏమొస్తుందన్నా? ఒక ఆదివారం ఖర్చు మానుకుంటే వచ్చే ఏళ్ళ తరబడి ఉండే వస్తువు అది.." అన్నాడు. తను అన్న మాటా నిజమే కదా.. తయారీ పనివాడి కూలీ కూడా కాదు. 


ఓహ్! మిస్ చేసుకున్నా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తారని ఏమైనా చెప్పారా అని అడిగాను. తెలీదు అన్నాడు. ఎందుకైనా మంచిది అని పై ఫోటో మొబైల్ తో తీసుకున్నాను. 

మరో నెలరోజులకి ఆ పీటల వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈసారి నేనూ అదే రేటుకి బేరం చేశాను. మొదట వేయి చెప్పిన వాళ్ళు - అదే 300 రూ. రేటుకి ఇచ్చేశారు. మొదటిసారిగా ఒక సత్యనారాయణ స్వామి వ్రత పీటకి స్వంతదారున్ని అయ్యాను. 

ఇంటికి తెచ్చాక జాయింట్ల వద్ద రివర్స్ దెబ్బ కొట్టి, లూజ్ చేసి, జిగురు పూసి, మళ్ళీ యధావిధిగా జాయింట్ పెట్టాను. అలాగే కొన్నింటి చోట్ల మరిన్ని మేకుల్ని కొట్టాను. రెండు రోజులు ఆరబెట్టాను. ఫలితముగా చాలా ధృడంగా మారింది. ఆ తరవాత టచ్ వుడ్ పాలిష్ వేసి, మరింత అందముగా మార్చాను. ఇక టేకు డిజైన్ బీడింగ్స్ తెచ్చి అమర్చడమే మిగిలింది. ఆ పని మెల్లిగా చేద్దామని ఆ పనిని వాయిదా వేసి - అందాక ఒకసారి పూజ చేసుకున్నాను. త్వరలోనే ఆ మిగిలిన పనీ పూర్తిచేసి, ఆ వివరాలూ మీకు అందిస్తాను. 

అలా అతి తక్కువ ఖర్చులో మంచి పీటని పొందాను. 

Saturday, November 7, 2015

Good Morning - 595


నిజమైన ప్రేమ అంటే.. 
ఒకరికోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియట్ లది కాదు.. 
ఒకరికోసం ఒకరు బ్రతికిన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీనూ.. 

Wednesday, November 4, 2015

పొడుపు కథలు - 16


ముచ్చటగా ముగ్గురు దొరలు. 
ముగ్గురికీ ఒకటే తలపాగా.. 
ఏమిటదీ..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు :


Related Posts with Thumbnails