Thursday, December 17, 2015

Featured Post వివరాలు

ఈమధ్యనే బ్లాగుల్లో బ్లాగర్ వారు సరిక్రొత్తగా Featured Post ( ఫీచర్డ్ పోస్ట్ ) అనే ఆప్షన్ ని ఇచ్చారు. ఇది కేవలం బ్లాగ్ స్పాట్ వారి బ్లాగుల్లో మాత్రమే వాడటానికి వీలవుతుంది. ఇది బ్లాగులు నిర్వహిస్తున్నవారికి చక్కని ఉపకరణం అనుకోవాలి. అది ఎలా అంటే - 
  1. బ్లాగుల్లోని పాత పోస్ట్స్ ని తమ బ్లాగుని చూసేవారికి తెలియజేసేందుకు 
  2. పాత పోస్ట్స్ ని పరిచయం చెయ్యటానికి 
  3. ఈ పోస్ట్ చాలా బాగుంటుంది 
  4. ఈ టపా చదివితే మీకు మరిన్ని విషయాలు  తెలుస్తాయి 
  5. వచ్చే పండగ గురించి నేను వ్రాసిన పోస్ట్ చదివితే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి 
  6. ఈ పాత టపా ఈ బ్లాగుకే హైలెట్ పోస్ట్.. 
  7. ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఏనాడో చెప్పిన వివరాలు ఈ పోస్ట్ లో ఉన్నాయి.. 
  8. నేను వెళ్ళిన క్రొత్త ప్రదేశపు పర్యటన తాలూకు అనుభూతులు ఈ పోస్ట్ లో చదవచ్చు.. 

.. .. ఇలా ఎన్నెన్నో రకాలుగా - మీ గత టపాల తాలూకు మాధుర్యాలని - క్రొత్తగా మీ బ్లాగ్ వీక్షకులకు రుచి చూపించవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే - గత కాలపు అనుభూతుల ఫోటో ఆల్బమ్ ముందు పెట్టి, అవి ఫలానా టూర్ వెళ్ళినప్పటి ఫొటోస్ అనో, ఫలానా ఘటన మీద నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలు... ఇలా మీ పాత పోస్ట్స్ ని మీ బ్లాగ్ వీక్షకులకి మళ్ళీ / తాజాగా రుచి చూపించవచ్చు. ఇలా చెయ్యటం వలన బాగున్నాయని ఆనుకున మీ గత పోస్ట్స్ ని చదువరులకి - చక్కగా, నూతనంగా పరిచయం చెయ్యొచ్చు. 

దీనివల్ల మనకేమి లాభం అనుకుంటున్నారా ? అయ్యో.. చాలానే ఉన్నాయండీ.. ఎలా అంటే అలా పరిమితకాలం వరకూ ఒక్కో పోస్ట్ ని ఎన్నుకొని, అలా చూపిస్తే - అక్కడ వచ్చిన నీలిరంగులో ఉన్న లింక్ ద్వారా ఆ పోస్ట్ ని నేరుగా చూస్తారు. బాగుంది అనుకుంటే మరిన్ని పోస్ట్స్ కి వెళతారు. లేదా మరో లింక్ కోసం / ఫీచర్డ్ పోస్ట్ కోసం ఎదురుచూస్తారు. అంటే ఒక పోస్ట్ కోసం వచ్చిన వారిని - ఈ ఆప్షన్ వల్ల మరో పోస్ట్ చదివిస్తాం అన్నమాట. దీనివల్ల మన బ్లాగ్ వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. గూగుల్ ఆడ్ సెన్స్ గనక మన బ్లాగ్ కు ఉంటే ప్రకటనలూ పెరుగుతాయి. దానివల్ల ఆదాయమూ పెరుగుతుంది. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పదా మరి..


ఫొటోస్ పెద్దగా కనిపించేందుకు ఫోటో మీద డబుల్ క్లిక్ చెయ్యండి. 

మీ బ్లాగ్ హోం పేజీ తెరిచి చూస్తే - ఇలా లేత నీలిరంగులో ఉన్న ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్ చివరిలో ఎర్రని బాణం గుర్తు వద్ద ఉన్న Learn more ని నొక్కితే మీరు - మీ బ్లాగ్ పేజీ లే అవుట్ Lay out కి వెళతారు. లే అవుట్ అంటే - మీ బ్లాగ్ లోని ఆప్షన్స్ వాడితే మీ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపే ఒక ప్లాన్ మాదిరిగా అనుకోవాలి. ఒకవేళ మీకు అలా నీలిరంగు డబ్బా లోని నోటిఫికేషన్ పొరబాటున తీసేసినా, రాకున్నా బాధపడాల్సిన అవసరం లేదు.. బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చేసి, బ్లాగ్ లే అవుట్ కి వెళ్ళండి. 


ఎర్రని బాణం గుర్తు వద్ద ఉన్న learn more ని నొక్కితే ఈ క్రింది విధముగా మీ బ్లాగ్ లే అవుట్ పేజీ తెరచుకుంటుంది. 


మౌస్ చక్రాన్ని తిప్పితే - అదే పేజీకి క్రిందనకి చేరుతాం. అక్కడ కుడి ప్రక్కన ఉన్న Side bar లోని మొదటగా నీలిరంగులో ఉండే Add a Gadget ని నొక్కండి. ( క్రింది ఫోటోలో ఎరుపు రంగు దీర్ఘ వృత్తంలో చూపించినది ) 


అప్పుడు మీకు Add a Gadget టూల్స్ గల ఒక పేజీ తెరచుకుంటుంది. Basics లోని రెండవ టూల్ యే ఈ Featured post. మీరు మీ బ్లాగులోని మీకు నచ్చిన ఏదైనా పోస్ట్ ని హైలైట్ చెయ్యాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ని చూపెట్టుటకు ఈ గాడ్జెట్ ని మీ బ్లాగ్ కి జత చెయ్యాలి. అంటే ఆ గాడ్జెట్ కి కుడివైపున ఉన్న + గుర్తుని నొక్కాలి. క్రింద ఫోటోలో ఎర్రని బాణం గుర్తు వద్ద చూపెట్టబడింది. 


అలా ఆ + గుర్తుని నొక్కగానే మీకు ఈ క్రింది ఫోటోలో మాదిరిగా వివిధ ఆప్షన్స్ గల ఒక పేజీ మీకు కనిపిస్తుంది. ( క్రింది ఫోటోలో చూడండి ) 

ఇందులో 1 వద్ద - Gadget Title వద్ద Featured Post అని డిఫాల్ట్ గా ఉంటుంది. దీన్ని మీరు - మళ్ళీ చూడండి / ఈ పోస్ట్ చదివి పెట్టండి / See this అనో.. మీకు నచ్చిన టైటిల్ పెట్టి మార్చుకోవచ్చు.. లేదా అలాగే ఫీచర్డ్ పోస్ట్ అని ఉంచేసుకోవచ్చును. 

2 వద్ద నున్న Post snippet వద్ద - Show post title వద్ద టిక్ మార్క్ చెయ్యాలి. ఇది డిఫాల్ట్ గా టిక్ చేసి ఉంటుంది. ఇలా చేస్తే మన బ్లాగ్ లో కనిపించే ఫీచర్డ్ పోస్ట్ లో ఆ పోస్ట్ టైటిల్ నీలిరంగులో కనిపించి, ఆ టైటిల్ లింక్ గా ఉపయోగపడుతుంది. 

3 వద్ద - Show Image వద్ద కూడా టిక్ మార్క్ చెయ్యాలి. ఈ మార్క్ కూడా డిఫాల్ట్ గా ఉంటుంది. ఆ పోస్ట్ లోని మొదటి ఫోటో ఇక్కడ కనిపించి, ఆ పోస్ట్ ని తెరిచేలా ఆకర్షిస్తుంది. ఆ ఫోటో లింక్ గా ( అంటే ఫోటో మీద క్లిక్ చేస్తే ) తెరచుకోదు. 

4 వద్ద  - All labels లో ఉన్న చిన్న నల్లని త్రికోణాన్ని నొక్కాలి. మన బ్లాగులో Labels లేబుల్స్ ని ఏర్పాటు చేసుకొని, పోస్ట్ చేసిన పోస్ట్స్ అన్నీ ఆయా వర్గీకరణల క్రిందకు ఆపాటికి చేర్చి ఉండాలి. అలా చేర్చిన పోస్ట్స్, వాటి వర్గీకరణలూ, బ్రాకెట్ లలో వాటిలోని పోస్ట్స్ సంఖ్య మీకు ఇక్కడ కనిపిస్తాయి. 

5 వద్ద - సర్చ్ బార్ ఉంటుంది. ఈ Search Bar లో మీ పాత టపా పేరు టైపు చేసి, కూడా వెదకవచ్చు. 


అదే పేజీలో క్రిందకు వస్తే -  6 వద్ద రెండు బాణం < > గుర్తులు వస్తాయి. వాటిని వాడుతూ ( ముందూ, వెనకాలకు ) వచ్చిన పోస్ట్ లలోనుండి మీరు Featured Post ని ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ( క్రింది ఫోటోలో చూడండి )

7 వద్ద ఆ ఫీచర్డ్ పోస్ట్ యొక్క ప్రివ్యూ Preview కనిపిస్తుంది.


ప్రివ్యూ మొత్తం ఇలా 8 లా ఉంటుంది. ( క్రింది ఫోటోలో చూడవచ్చును )

9 వద్ద Save అనే బటన్ నొక్కితే ఆ ప్రివ్యూ - మీ బ్లాగ్ లో ఒక సైడులో - మీరు ఎంచుకున్న భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫీచర్డ్ పోస్ట్ ని మీ బ్లాగ్ లే అవుట్ లో విజయవంతముగా చేర్చారు అన్నమాట.


ఇప్పుడు బ్లాగ్ లే అవుట్ పేజీలో 10 వద్ద చూపినట్లుగా ఫీచర్డ్ పోస్ట్ గాడ్జెట్ జత అవుతుంది. ( క్రింది ఫోటోలో చూడండి )

11 వద్ద చూపిన చుక్కల పట్టీని కర్సర్ తో నొక్కి, మూవ్ టూల్ సహాయాన పైకీ క్రిందగా Drog డ్రాగ్ చెయ్యవచ్చును.

12 వద్దనున్న Save Arrangements ని నొక్కి, మీ బ్లాగ్ లేబుల్స్ ప్రాధాన్యతలను సేవ్ చేసుకోవాలి.


13 ఇప్పుడు ఆ ఫీచర్డ్ పోస్ట్ మీ బ్లాగులో ఇలా కనిపిస్తుంది. మీ బ్లాగ్ కి వచ్చిన వీక్షకులు అక్కడ ఉన్న ఆ పోస్ట్ తొలి వాక్యాలు చదివి ఆసక్తి కలిగితే - ఆ పోస్ట్ లింక్ ద్వారా ఆ పోస్ట్ ని చూస్తారు. ఇలా మీరు వేసిన పోస్ట్స్ మరిన్ని వీక్షణలు చేసుకొని, మీ బ్లాగ్ వ్యూయర్ షిప్ పెరిగేలా చేస్తుంది. 



2 comments:

rajachandra said...

thank you sir

Raj said...

సుస్వాగతం రాజాచంద్ర గారూ..

Related Posts with Thumbnails