Thursday, July 30, 2015

పొడుపు కథలు - 4


ముక్కు మీద కెక్కు, 
ముందర చెవులని నొక్కు, 
తక్కు నొక్కుల సోకు, 
జారితే పుటుక్కు.. ఏమిటదీ..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Tuesday, July 28, 2015

గోదావరి పుష్కర యాత్ర - 3

http://achampetraj.blogspot.in/2015/07/2.html తరవాయి భాగం..
...అలా బండిని చూస్తున్నప్పుడే - మమ్మల్ని దాటి ఒక మోటార్ సైకిల్ వెళ్ళి కొద్ది దూరములో ఆగింది. దానిపైన క్రొత్తగా పెళ్ళైన యువజంట. నేను అప్పుడు క్రిందన కూర్చొని, సమస్య ఏమై ఉంటుందా అని చూస్తున్నాను. ముందు కొద్దిదూరములో వారు ఆగారు. అక్కడ నుండి మమ్మల్ని చూస్తున్నారు. అది మా అమ్మాయి "వారు అక్కడ నుండి మనల్నే చూస్తున్నారు డాడీ!.." అన్నది. నేను వారిని చూశాను అన్నట్లు, గాలిలో చేతిని ఊపాను. ( ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి, ఏదీ వదులుకోవద్దు ) వారు గమనించారు.. దగ్గరికి వచ్చారు. ఏమైంది అని అడిగితే - " ఏదో ప్రాబ్లెం.. ఇంజన్ విప్పాలేమో..!! ఇంజన్ ఓకే. స్టార్ట్ అవుతున్నది.. వెనక చక్రం కూడా ఓకే. ఫ్రీగా మూవ్మెంట్ ఉంది.. బేరింగ్స్ కూడా వొకే. బహుశా ఇంజన్ నుండి వెనక చక్రానికి మధ్యన ఉన్న బెల్ట్ / చైన్ లింక్ తెగిందేమో.. అలా అయ్యేముందు లకలకమంటూ శబ్దం వచ్చింది.. " అంటూ ఆ శబ్దాన్ని మిమిక్రీ చేశాను. ( ఇలా ఎందుకూ అంటే - అవతలివారు మెకానిజం లో అవగాహన ఉంటే - అలా సమస్య మొదట్లో ఆ శబ్దం ఎక్కడ, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అలా సమస్యని తేలికగా తెలుసుకొని, సమస్య ఏమిటో తేలికగా నిర్ధారించుకోగలుగుతారు. ఎదుటివారు మెకానిక్స్ అయితే ఇది వారిముందు చేస్తే చాలా తేలికగా మన సమస్య అర్థమవుతుంది ) నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. నాకు తెలిసీ - బెల్ట్ / చైన్ తెగింది అనుకున్నాను ) నేను చేసిన మిమిక్రీ కి ఏమీ స్పందన చూపెట్టలేదు. కారణం తనకి మెకానిజం తెలీనట్లుంది.

వారూ పుష్కరాలకి వేల్లోస్తున్నారు. వారి డిటైల్స్ చెప్పారు. మావీ చెప్పాను. నిజమా కాదా అన్నట్లు కొన్ని ప్రాంతీయ విషయాలు అడిగారు.. వాటికి క్లారిటీ ఇచ్చాను. అప్పుడు వారికి మాపై నమ్మకం కలిగింది. ( అంత రాత్రిన అయినా, ఎప్పుడైనా అలా సహాయానికి వెళ్లేముందు కనీస వివరాలు తెలుసుకోవడం / పరీక్షించడం ఉత్తమం. ఎంతవరకూ నమ్మోచ్చో, కాదో తెలుస్తుంది ) " అమ్మో! అంత దూరమా.. ఈ స్కూటీ మీదనా! ఇది అంత పెద్ద దూరాలకి సరిపోదు. అందుకే ఇలా అయినట్లుంది.." అన్నారు. ( వారి హీరో స్ప్లెండర్ ఇంజిన్ 97.2 cc వారి బండికీ, మా బండికి తేడా కేవలం 10 cc మాత్రమే తేడా! ఆ మాత్రం దానికే లాంగ్ డ్రైవ్ కి పనికిరాదా? ఆలోచనల్లో ఏదో తేడా. అయినా వారు అదే హైవే మీద రైడింగ్ లో కనిపించారు. మేము వారిని మూడుసార్లు ఓవర్ టేక్ చేసి వెళ్ళాం. నాకు గుర్తుంది. వారి డిటైల్స్ కొన్ని తప్పు చెప్పారు. అవన్నీ ప్రస్తావించలేదు. ఇక్కడ వారి సహాయం నాకు ముఖ్యం. వాదనలు అనవసరం ) " అవునేమో!.. వారం క్రిందటే పార్ట్స్ మార్పించాను.. అంతా బాగుంది అనుకున్నాకే బయలుదేరాం.. ఇలా అయ్యింది.." అన్నాను.

ఒకవైపు మాట్లాడుతున్నానే గానీ, మరోవైపు ఏమిటీ కింకర్తవ్యం? అని ఆలోచనలు చేస్తున్నాను. అంతరాత్రి సర్వీస్ సెంటర్స్ ఉండవు.. మరుసటిరోజు ఆదివారం. ఇక సోమవారం మధ్యాహ్నం వరకూ ఆగాల్సిందే. అయినా నా పద్ధతులు / దారులు నాకున్నాయి. అన్నింటికన్నా మించి అమ్మాయి భద్రత గురించి ఆలోచన చెయ్యాలి. అలా చేయాలీ అంటే ముగ్గురం ఒకే దగ్గర ఉండాలి. త్వరగా సెక్యూర్డ్ ప్లేసుకి వెళ్ళాలి. తక్కువ ఖర్చులో ఎక్కువ భద్రతని చూసుకోవాలి. బండి పోతే పోనీ. నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఈరోజు క్రొత్త కాదు.. కానీ ఇలా అందివచ్చిన సహాయాలను తప్పక వాడుకోవాలి. అవి పూచిక పుల్లకు కూడా పనికిరాకున్నా సరే..

నా ఆలోచనలు బ్రేక్ చేస్తూ - " మరి బండిని దగ్గరలోని టవున్ లో పెడతారా? అక్కడ ఈ కంపనీ సర్వీస్ సెంటర్ ఉంది. అదిప్పుడు మూసేసి ఉంటుంది. లేదా తెలిసిన వారి దగ్గర పెడతారా? లేదా ట్రాలీ ఆటోలో తీసుకెల్లుతారా?? ట్రాలీ ఆటో అంటే మాకు తెలిసిన వారున్నారు.. పిలవమంటారా??.. మీకైతే ఏమీ కాదు.. అమ్మాయ్ విషయంలో ఆలోచించక తప్పదు.. " అన్నారు.

మొదటిది వీలు కాదు.. అక్కడ అయినా సోమవారం వరకూ ఆగాల్సిందే.. రెండో సూచన - అక్కడ ఎవరూ లేరు. ఇక మిగిలింది మూడోది.. అవును ట్రాలీ ఆటో బెస్ట్. ఆ పనే చెయ్యాలి. అదయితేనే అన్ని కష్టాలు తీరుతాయి అనుకున్నాను. " సరే.. మీకు ఏదైనా ట్రాలీ తెలిసుంటే పిలవండి.. " అన్నాను.

వారి ఫోన్ లో బ్యాటరీ చార్జ్ లేదని నా ఫోన్ అడిగారు. ఇచ్చాను. నా దాంట్లోంచి కాల్ చేసి మాట్లాడారు. ( వారి ఫోన్ బాగానే ఉంది. వారు కాల్ చేస్తున్నప్పుడు చూశాను కూడా. కానీ ఏదైనా తేడా జరిగితే వారు నా మొబైల్ నుండి చేసిన కాల్ వల్ల నా నంబర్ ఆ ఆటో వారి వద్ద ఉంటుంది. లేదా వారు చేసిన కాలర్ మొబైల్ లో ఉంటుంది. ఆ నంబర్ వల్ల వారు నన్ను తిరిగి దొరకపట్టుకుంటారు. చూడటానికి చిన్నదిగా అనిపించినా, చాలా తెలివైన చర్య అది. ఇలా చిక్కుల్లో పడుతుంటేనే కొన్ని విషయాలు ఇలా తెలుస్తూ ఉంటాయి ) అక్కడ దగ్గరలోని మరో చిన్న గ్రామం నుండి ఆటో పిలిపించారు... ఆటో వచ్చింది. ట్రాలీ ఆటో కాదు.. అది లేదట. APE డిజిల్ ఆటో అది. రేటు మాట్లాడమన్నారు. ఆటో అతను రెండు వేలు చెప్పాడు.. అది చాలా ఎక్కువ. దగ్గరలో కనిపిస్తున్నదాబాల వద్ద బండి పెట్టేసి, ఎలాగైనా ఏదో వాహనం మీద ఇంటికి వెళ్ళేసి, ఉదయాన మళ్ళీ వచ్చి బండి తీసుకెళ్ళాలి అని నాఆలోచన.. అలా అయితే రెండు వందల రూపాయల ఖర్చుతో బండితో ఇంటికి వెళ్ళగలను... ఇతన్నే మాట్లాడమన్నా.. చివరికి Rs.1300 కి మాట్లాడాడు. అదీ ఎక్కువే.. అంతకన్నా తక్కువ కాదన్నాడు.. నిజానికి 800 సరిపోతుంది. ఏం చేస్తాం.. చీకటి + తప్పని పరిస్థితి + అమ్మాయి ఉండటంతో తప్పలేదు. ఆ ఎక్కువ - వారికి బోనస్ గిఫ్ట్ అనుకోవాలి అనుకున్నాను. ఇక్కడ సెక్యూరిటీ ముఖ్యం. తప్పదు. ముగ్గురం కలసి ఆటోలోకి స్కూటీని ఎక్కించాం. సాయం చేసినందులకు కృతజ్ఞతలు చెప్పాను.. " దేవుడే మిమ్మలని మాకోసం పంపాడులా ఉంది.. మీరు లేకుంటే ఈరోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మీ మేలు మరవలేము " అన్నాను. ఒకసారి హగ్ చేసుకున్నాను. ఇక ఆటో ఎక్కేసి, వచ్చేసాం.

నిజానికి ఆ ఆటో వారు రాకపోతే - ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఒక డాబా కనిపిస్తున్నది. దాని తాలూకు లైట్స్ అక్కడికి కనిపిస్తున్నాయి. అక్కడ బండి పెట్టేసి, ఏదైనా వాహనంలో ఇంటికి వచ్చేసి, మరుసటి రోజున మెకానిక్ తీసుకొని బాగుచేయించి, తీసుకోచ్చుకోవాలన్నది నా ఆలోచన. వారు రాకుంటే అలాగే చేసేవాడిని. చాలామంది రహదారుల మీద ఎక్కువగా ఇలాగే చేస్తుంటారు.

ఇంటికి వచ్చాక ఆ ప్యాసింజర్ ఆటో నుండి ఆ స్కూటీ రాలేదు. రోడ్డు జంపింగ్ లతో ఆటోలో ఇరుక్కుంది. సాయం కోసం ఒక బైకర్ ని పిలిస్తే వచ్చి, సాయం చేస్తే - ఈజీగా ఆ బండిని నేల మీదకి దించాం. ఈ బైకర్ ముస్లిం అయి ఉండీ, రంజాన్ సందర్భముగా క్రొత్త బట్టలు వేసుకున్నా - ఏమాత్రం ఫీల్ అవక, పిలవగానే వచ్చి క్షణాల్లో వచ్చి సాయం చేశాడు... థాంక్స్ చెప్పాను.

తెల్లారి వేరే పని ఉండి, ఆ పని అంతా చూసుకొన్నాను. మరుసటి రోజున - ఉదయాన అ బండిని పడుకోబెట్టి, క్రింద ఛాంబర్ చూశా.. ఆయిల్ + మడ్డితో ఉండి, సరిగా కనిపించకపోతే - వాటిని శుభ్రం చేసి, చూశా.. అంతా ఓకే.. చాంబర్ కి ఏమీ కాలేదు. మరి ఆయిల్ ఎక్కడిది అని చూస్తే - ఇంజిన్ కవర్ కి ఉండే ప్యాకింగ్ పేపర్ అక్కడక్కడా బ్రేక్ అయ్యింది. అలా అందులోంచి ఆయిల్ చిన్న లీక్. దానికే ఛాంబర్ పగిలింది అనుకున్నా. హమ్మయ్య.. అంతా ఓకే.. నేను అనుకున్నట్లే - లోపల బెల్ట్ / చైన్ పోయినట్లుంది.

వారం క్రిందట సామానులు వేయించానూ అని అన్నాను కదా.. అప్పుడు క్లచ్ అసెంబ్లీ, ప్లగ్, ఎక్సిలరేటర్ కేబుల్, 6 రోలర్ బేరింగ్స్ వేయించాను.. ఆ కంపనీ వారి షో రూం వారి వద్దకి తీసుకవెల్లాలీ అంటే అదో శ్రమ. కారణం చాలాదూరం నెట్టుకపోవాలి. అందుకని వారికే వద్దకే వెళ్ళి, ప్రాబ్లం చెప్పి, చెయ్యమన్నాను. వారు ఖాళీగా ఉన్నా రావటానికి ఇష్టపడలేదు.... చివరికి వచ్చారు. ఇంజన్ కవర్ విప్పి చూస్తే - టీత్ బెల్ట్ ముక్కలు ముక్కలు అయ్యింది. ప్రాబ్లెం ఎక్కడా అని అడిగితే - ఆ 6 రోలర్ బేరింగ్స్ వేశాక, దాని మీదుగా బెల్ట్ పుల్లీని ఒక నట్ సహాయాన బిగిస్తారు. అది లూజ్ అవటంతో అలా బేరింగ్స్ కదిలి, ఆ పుల్లీ ఆ బెల్ట్ ని రన్నింగ్ లో కోసేసింది. ఆ నట్ ని బాగా టైట్ గా బిగించక పోయేసరికి ఇలా తిప్పలు పడ్డాను. ఆ నట్ బాగా టైట్ చెయ్యటానికి మరో నిమిషం పడుతుంది అంతే.. ( నా చేతిలో లేని / నాప్రమేయం లేని ) ఒక చిన్న తప్పు నన్ను, నా కుటుంబాన్నీ అంతగా ఇబ్బంది పెట్టింది. ఆ నట్ కి కాటర్ పిన్ పెట్టవచ్చేలా ఉండే నట్ అక్కడ పెడితే, ఇలాంటి ప్రాబ్లెం ఎవరికీ మళ్ళీ రాదు కూడా.. టైర్ చక్రం బిగింపు కోసం వీల్ ఏక్సిల్ Wheel axil వద్ద అలా పెడతారు. అదే పద్ధతి అక్కడా పెడితే నాలాంటి ఆవస్థలు ఎవరూ పడరు. కాటర్ పిన్ అన్నది చిన్న స్టీల్ తీగ ముక్కనే కానీ, నట్ ఒకవేళ వదులు అవ్వాలని చూసినా ఆ నట్ ని ఏమాత్రం వదులుకానివ్వదు. మొత్తానికి 1300 + 514 బెల్ట్ ఖరీదు = 1814 రూపాయలు + మనశ్శాంతి కరవు. కొన్ని నట్ సాంకేతిక అంశాలు వైఫల్యాలు, మానవ తప్పిదాలు ఇలా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఏమైనా అందామంటే - ఇన్ని కిలోమీటర్లు తిరిగినపుడు ఏమీ కాలేదు కదా.. వేసి వారం అయ్యింది కదా.. అప్పుడు కానిది ఇప్పుడెలా అయ్యింది అంటే ఏమీ బదులివ్వలేం.. ఊరుకోవడమే ఉత్తమం. ఏమైనా గానీ కొన్ని అనుభవాలు చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి విషయాలు తెలీని వారికీ, నాలాగా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళాలనుకొనేవాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాల్సివలసిందిగా నా మనవి. కాటర్ పిన్, నట్ అంటే తెలీని వారు ఈ క్రింది ఫోటో చూడండి. ( ఈ ఫోటో స్కూటీది కాదు వేరే దానిది. దాన్ని నేను గూగుల్ ఇమేజెస్ నుండి సేకరించాను.. ఫోటో వారికి కృతజ్ఞతలు. మధ్యన ఆరు పలకలుతో ఉన్నది నట్, దాని చీలిక గుండా సన్నని ఇనుపతీగని కూడా చూడండి. ఈ విషయం మీకు అర్థం చెయ్యాటానికి వాడుకుంటున్నాను..) ఆలా చేస్తే - నట్స్ ఎన్నడూ వదులు కావు. ఒకవేళ వదులైనా - ఆ కాటర్ పిన్ వదులు కానివ్వదు. చూడటానికి చిన్నదిగా ఉన్నా సాంకేతికముగా గొప్పది. చాలా ఉపయోగపడుతుంది. ఇలా వాహనాల టైర్ కి ఉండే ఫోర్క్ ఎక్సిల్ కి నట్ మధ్య భాగాన, ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ బోల్ట్ లకీ ఆ కాటర్ పిన్ ఉంటుంది. ఇకనైనా ఆ కంపనీ వారు ఇలా మిగిలిన బళ్ళకీ ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుంది. ఒక ఉత్పత్తి అన్నివిధాలా నచ్చాలీ అంటే - ఇలాంటి చిన్న చిన్న లోపాలని కూడా తొలగించాలి. అయినా ఇదేమైనా పెద్ద ఖర్చు కాదు. ఎక్సిల్ కి ఒక రంధ్రం, ఒక కాటర్ పిన్ అంతే.. మహా అంటే ఖర్చు ఐదు రూపాయలు కన్నా మించదు - TVS Scooty కంపనీ వారికి.


పాడయిన చోట ఆ జంట రాకపోతే - మేము ఎన్ని కష్టాలు ఎదురుకోవాల్సి ఉంటుందో.. అది నేషనల్ హైవే కాబట్టి అలా వెంటనే వచ్చాం. అదే స్టేట్ హైవే  అయితే - వోరినాయనో... అనుకోవాల్సిందే.. ఇంకోసారి లాంగ్ డ్రైవ్ అన్న ఊసే ఎత్తే పరిస్థితి రాని అనుభవాలు అయ్యేవేమో. మా మీద ఆ పుష్కరుడి + బాసర అమ్మవారి దయ వల్లే అనుకుంటా అలా క్షేమముగా ఉన్నామని అనుకున్నాను.

అయినా ఇదీ ఒకరకముగా మాకు మేలే చేసింది అనుకుంటున్నాను. జరిగినవన్నీ మన మంచికే అనుకోవాలి. ఎలా అంటే -

  • పిల్లలకి ఈలోకం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళాను అని చెప్పాగా. అది చూపించాను. పుష్కరాలు అంటే ఏమిటో ఎలా ఉంటుందో, వివరముగా తెలుసుకున్నారు - కారణం - బండి. బండి మీద అన్ని స్నానాల ఘాట్స్ వెంబడి ప్రయాణించాం కాబట్టి. 
  • తామెన్నడూ చూడని క్రొత్త ప్రదేశాల గుండా వెళ్ళాం. అలా ఈ పేర్లతో కూడిన ఊళ్ళు ఆ దారిలో కనిపిస్తాయి.. అవి అలా ఉంటాయీ అని తెలిసాయి. ఆ దారిలో వారు అంత దూరం ఏనాడూ వెళ్ళలేదు. ( నాకూ అంతే ). 
  • మా అమ్మాయికి లాంగ్ డ్రైవ్ లో తానే డ్రైవింగ్ చెయ్యాలన్న కోరికా నెరవేరింది. 
  • లాంగ్ డ్రైవ్స్ అంటే ఏమిటో తెలియచేశాను. వారికి ఇది రెండోది. 
  • అలా వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఏమేమి ఎలా చూసుకోవాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, లేకుంటే ఎంతగా నష్టపోతామో, ఎలా ఎంక్వైరీ చేస్తూ వెళ్ళాలో - నాకు తెలిసింది చెబుతూ వెళ్లాను. 
  • చిన్న చిన్నవస్తువులే కావొచ్చు కానీ అవి భలేగా చికాకు పెడతాయి / సంతోష పరుస్తాయి అన్న విషయాన్నీ గమనించేలా చేశాను. 
  • గొప్పగా కార్లలో, పెద్ద బండ్ల మీదే వెళ్లడం కాదు.. చిన్న చిన్న బండ్ల మీద కూడా సౌకర్యముగా వెల్లోచ్చును. 
  • చిన్న బళ్ళు అని చులకన చేస్తాం కానీ అవి పెద్ద బండ్లకి ఏమీ తీసిపోవు. కాస్త వేగంగా వెళ్ళక పోవచ్చును. కానీ భద్రముగా, అనువుగా, తేలికగా వెళ్ళి రావొచ్చును. 
  • రహదారి మీద ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి రావొచ్చును. 
  • పెద్ద బళ్ళ మీద 80-100 kmph తో వెళతాం, చిన్న బళ్ళ మీద 50-60 kmph తో వెళతాం. సగటు 30-40 కిలోమీటర్ల వేగం తక్కువ. అంతే. 
  • సరైన ప్లానింగ్ ఉంటే హాయిగా, సౌఖ్యముగా చిన్న బండ్ల మీద కూడా వెళ్ళి రావొచ్చును. Travel as you like అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాను. Make your own roads అంటే ఏమిటో కూడా తెలిసేలా చెయ్యవచ్చు. 
  • ఒకవేళ బండి పాడయినా వదిలేసి రావొచ్చును. అవి పోతే - పెద్ద బండ్లతో పోలిస్తే కొద్దిగా ఖర్చు తక్కువ. పెద్దగా ఇబ్బందీ కాదు. 
  • పాడయినా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు. తేలికగా వేరే బళ్ళకు కట్టి లాక్కెళ్ళవచ్చు. 
  • సౌకర్యాలు ఎక్కువగా ఉన్న చిన్న బళ్ళ మీద వెళితే - ప్రయాణం హాయిగా ఉంటుంది. హాయిగా జర్నీని ఆస్వాదించొచ్చు. 
  • నాకెప్పుడు ఇలా ప్రయాణాల్లో అడ్డంకులు రాలేదు. బృంద ప్రయాణాల్లో అనుభవం సంపాదించాను. కానీ ఈసారి జరిగినదే మొదటిసారి అడ్డంకి.. ఆ అనుభవాలు నన్ను ఈ పరిస్థితిని తట్టుకొనేలా చేశాయి. 
  • సింపుల్ మెకానిజం ఉన్న బళ్ళ మీద వెళితే - పాడయినా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. 
  • అతి తక్కువ ఖర్చులో వెళ్ళి - రాగలం అని తెలియచేశాను. ఈ బండి పాడు కాకుండా ఉన్నట్లయితే - కేవలం 5 లీటర్ల పెట్రోల్ తో వెళ్ళి వచ్చేవాళ్ళం. అప్పటికీ ఇంకా పెట్రోల్ మిగిలే ఉంది. దానితో మిగిలిన ఆ ముప్ఫై కిలోమీటర్లు తేలికగా వెళ్ళగలం. అంటే 310 kms = ( 5 లీటర్లు @ 72 ) Rs. 360 / ముగ్గురం = చాలా తక్కువ ఖర్చు. బండి మీదే మొత్తం ప్రయాణం పూర్తి కాలేదు కాబట్టి మైలేజ్ మరియు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అన్నది చెప్పలేను. 
  • దారిలో రోడ్డు ప్రక్కన షాపుల్లో, హైవే ల మీద చిన్న కొట్లు పెట్టుకొని అమ్ముకొనే వారి వద్ద చిరుతిళ్ళు కొని, తింటూ వెళితే ఆ కిక్కే వేరప్పా... 
  • చిన్న బళ్ళు మీద లాంగ్ డ్రైవ్ అంటే నవ్వుకుంటారు కానీ వాటి మీద కూడా ప్రయాణం అద్భుతముగా ఉంటుంది. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ - సైకిల్ మీద ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 
  • మన డ్రైవింగ్ కి అనుకూలమైన వాటి మీద వెళ్ళితే మరీ మంచిది. 
  • రేపు వారి భవిష్యత్తులో - వారి వారి స్నేహితులతో అలా డ్రైవ్ కి వెళ్ళితే - ఎలా ఉండాలో, ఎలా పరిస్థితులని తట్టుకోవాలో తెలిపే ఇదొక పాఠం అన్నమాట. ఇలాంటి పాఠాలు చిన్నతనంలోనే నేర్చుకుంటే మరీ మంచిది
  • ముఖ్యముగా అప్పుడు బండి పాడవటం కూడా ఒక రకముగా సాయం చేసింది. అలా పాడయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా అప్పుడు మసలుకోవాలో దగ్గర నుండి చూసి, అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు. 
  • మళ్ళీ మళ్ళీ అలా లాంగ్ డ్రైవ్స్ కి అలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం పొందటానికి వెళ్ళేలా - ఈ టూర్ ఉత్సాహాన్ని ఇచ్చింది. 
  • బాసర నుండి కుంటాల జలపాతం 100 kms. కి వెళ్ళాలనుకున్నాం. కానీ సమయం లేక వెళ్ళలేదు. మరొకసారి మళ్ళీ ఇలాగే వెళ్ళొస్తాము. 
మొత్తానికి మా పుష్కరాల ప్రయాణం అలా జరిగింది. చాలా చాలా జ్ఞాపకాలని మూట గట్టుకున్నాం. కొంత టెక్నికల్ గా వ్రాయాల్సి వచ్చింది.. + నా బీజీ జీవితం వల్ల పోస్ట్స్ నెమ్మది అయ్యాయి. అందులకు మన్నించండి. ఇదంతా కాస్త వివరముగా వ్రాయటానికి గల కారణం - ఈ ట్రావెలాగ్ చదివి, ఆ స్పూర్తితో మీరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, మరింత సౌఖ్యముగా వారి వారి ప్రయాణాలు చేస్తారని. అదే నిజమైతే ఇదంతా కష్టపడి చెప్పిన లక్ష్యం నెరవేరినట్లే..ఈ బ్లాగ్ లక్ష్యమూ, బ్లాగ్ కవర్ ఫోటోలో చెప్పిందీ అదే కదా..



- శుభం - 


Saturday, July 25, 2015

గోదావరి పుష్కర యాత్ర - 2

http://achampetraj.blogspot.in/2015/07/1.html తరవాయి..

..అలా మా పుష్కర స్నానాలని ముగించుకొని, తిరుగు ప్రయాణం మొదలెట్టాం. అక్కడ చుట్టూ రౌండ్ వేశాం. ఎలా ఉంది? జనం ఎంత వచ్చారు? ఏమైనా విశేషాలు ఉన్నాయా? అనీ.. వాల్మీకి గుహ కనిపించింది. వెళదామని అనుకున్నాము.. కానీ అక్కడా రద్దీ. వెళితే తిరుగు ప్రయాణం ఇంకా ఆలస్యమవుతుంది. మళ్ళీ ఎపుడైనా చూడొచ్చు అని అనుకొని వచ్చేశాం. మేము వచ్చే దారి ఏదో తెలుసుకొని, ఇక 4:30 p.m కి తిరుగు ప్రయాణం మొదలెట్టాం. అప్పటికి అక్కడ ఏమైనా తిందామా అని అనుకుంటే - తినే సమయం దాటిపోవడం & సమయాభావం వల్ల ఆగిపోయాం..

గోదావరి వంతెన మధ్యకు రాగానే, ఓ ప్రక్కగా బండిని అపాను. జేబుల నుండి చిల్లర డబ్బులు తీశాను. నాకొకటి, పిల్లలకు చెరొక్కక్కటీ ఇచ్చాను. భక్తిగా మ్రొక్కుకొని, నదిలోకి వేశాను. నన్ను చూసి, నా పిల్లలూ అలాగే గోదావరి నదిలోకి చిల్లర డబ్బులు వేశారు. ఇలా ఎందుకు వేశారు? ఎందుకు వెయ్యాలి అలా?? అని అడిగారు. " నా చిన్నతనంలో - మిత్రులతో ఇదే బాసరకి రైల్లో వచ్చినప్పుడు - రైల్ బ్రిడ్జి మీదకి రాగానే - చాలా నెమ్మదిగా వెళ్ళేది. అప్పుడు రైలు బోగీల తలపుల వద్ద నిలబడితే - మనం ఆ నదిమీద అలా గాలిలో నిలబడి ఉన్నామా అన్నట్లు అగుపించి, ఒళ్ళు జలదరించేది. ఆ అనుభూతిలో మేముండగా మా వెనకాల నుండి ఎంతోమంది తోటి ప్రయాణీకులు చిల్లర డబ్బులని మ్రొక్కి, ఆ నదిలోకి విసిరేసేడివారు. అలాచేస్తే కోరుకున్నవి నెరవేరుతాయని ఒక నమ్మకం. అదే నాకు తొలి అనుభవం. వింతగా, క్రొత్తగా అనిపించింది అప్పుడు. అప్పట్లో మాకు అదో ఆచారం, ఒక నమ్మిక. ఆ అనుభవాన్ని మీరు కోల్పోకూడదు, మీకూ ఉండాలని అలా మీతో చేయించాను.. ఇక ఆ చిల్లర డబ్బుల కోసమని కొందరు రైలు వచ్చే సమయానికి పడవలలో ఆ వంతెన క్రిందకి వచ్చేసి, స్పీకర్స్ వెనకాల ఉండే అయస్కాంతాలు జమచేసి, వాటన్నింటికీ ఒక త్రాడు కట్టి, ఆ నదిలో వేసిన చిల్లర డబ్బులని తీసుకొనే వారు. ఇప్పుడు అలా కనిపించడం లేదు.. అదొక మరపురాని జ్ఞాపకం.." అని చెప్పాను. మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం.

ఇలా మేముండగా - అదే వంతెన మీద అవతలి వైపున  ప్రక్కనే అప్పుడే ఒక కారు టైర్ పంక్చర్ అయ్యింది. స్టెప్నీ టైర్ తీసి, మార్చబోతున్నారు. నడి వంతెన మీద అలా అయ్యేసరికి - వేరే దారిలేక - అలాగే ఆ దారిలో ఒకేవైపు క్యూ కట్టాయి. మేము ప్రయాణం చేస్తూ ఆ క్యూని గమనించాం. ఆ క్యూ ఇప్పట్లో కదలదు.. అని నాకర్థం అయ్యింది. ఆ క్యూ ఆపాటికే ఐదారు కిలోమీటర్లకు పైగానే ఉంది. కాసేపట్లో అయితే - మరీ ఎక్కువ అవుతుంది ఆనుకున్నాం.

పదిహేను కిలోమీటర్ల దూరం వచ్చాక, ఒక మామిడితోట కనిపించింది. అందులో కాస్త రెస్ట్ తీసుకోవాలనిపించింది. పనిలో పనిగా - తీసుకొన్న ప్రసాదాల్లో ఒక లడ్డూ, రెండు పులిహోరలూ తినేశాం. ఆ తర్వాత మా అమ్మాయి డ్రైవింగ్ చేసింది. ఇలా ఇద్దరు డ్రైవర్స్ ఉంటే - లాంగ్ డ్రైవ్ బోర్ కొట్టదు. అసలు స్కూటీని అలా లాంగ్ డ్రైవ్ కి ఎన్నుకోవడం గల కారణాల్లో ఇదీ ఒకటి. మధ్యలో ఆగుదామని అనుకున్నాం కానీ అన్ని హోటల్స్ బీజీయే. కారణం : విపరీత జనం. రెండురోజులు వరుసగా సెలవుదినాలుగా రావటంతో - పుష్కరాలకు వచ్చిన రద్దీ జనం.. ఇక ఎక్కడా ఆగకుండా ప్రయాణం మొదలెట్టాం.

టోల్ గేట్ల వద్దా విపరీతమైన వాహనాల క్యూలు. మా ప్రక్కగా సెకనుకొక వాహనం వెళుతున్నట్లు అనిపించింది. నా జీవితంలో ఒక హైవే మీద అంత ట్రాఫిక్ రద్దీ చూడటం అదే ప్రప్రథమం. మద్యలో సన్నగా వర్షం తుంపర్లు. అలాగే తడుస్తూ వెళ్ళాం. అదీ కాసేపే. అవన్నీ చూస్తుంటే - బస్, రైలు, కారు కాకుండా టూ వీలర్ మీద వెళ్ళి రావడం చాలా నయమైంది. టోల్ గేట్స్, రోడ్డు మీదా, పుష్కరాల వద్దా హాయిగా, చిన్నచిన్న సందుల్లో కూడా హాయిగా వెళ్ళాం. అన్నింటికన్నా మించి ఎక్కడా ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కపోలేదు. ఎక్కడైనా అలా ఉన్నట్లు అనిపించినా ప్రక్కగా వేరే దారి చూసుకొని, అందులోంచి బయటపడ్డాం. టూర్ లకి వెళ్ళివచ్చిన వారి అనుభవాలు విన్నాక చాలావాటికి బైక్ మీద వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. అందుకే లాంగ్ డ్రైవ్స్ కి బైక్స్ మంచి సాధనాలు అని చెప్పటం. ఎక్కువగా వాటి మీదే వెళ్లడం ఇష్టం. ఆరోజు మోటార్ బైక్ మీద వెళ్లాను కాబట్టి హాయిగా, సంతోషముగా, నేను అనుకున్నట్లుగా, ఎవరి వల్లో ట్రాఫిక్ ఇరుక్కపోక హాయిగా వెల్లోచ్చాను. అందులకు చాలా చాలా సంతోషముగా ఉంది.

ఇంకో యాబై కిలోమీటర్లు వెళితే ఇంటికి వెళతాను అన్నప్పుడు - ఒక పెద్ద పట్టణం కనిపిస్తే - అక్కడికి వెళ్ళాం. మావాడికి చెప్పులు కొన్నాం. అదొక 300 రూపాయల ఖర్చు. వెంట - ఒక రూపాయికి వచ్చే ఒక చిన్న సుతిలీ త్రాడుముక్క తీసుకెళ్ళి, చెప్పుల్ని ఒక దగ్గరగా కట్టకపోయేసరికి - పోయిన చెప్పుల తాలూకు అయిన అదనపు వ్యయం అది.

ఎలాగూ ఆగాం.. పనిలో పనిగా భోజనం చేద్దామని అక్కడ ఉన్న మంచి హోటల్ కి వెళ్ళాం. అక్కడ ఆరోజు స్పెషల్ - నాటుకోడి చికన్ బిర్యానీ. రేటు 110. ఆరోజు రంజాన్ కావటంతో ఉదయాన్నుండీ అదే నడిచిందంట. సో, ఇప్పుడు లేదు అని జవాబు.. ఏంచేస్తాం.. వేరేవి ఆర్డర్ చేశాం. ప్రొద్దున నుండీ ఏమీ తినని మేము ఆ కమ్మని, వేడివేడి ఆహారాన్ని ఆవురావురుమంటూ ఫుల్ గా లాగించాం. అప్పటికే రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఇంకో యాభై కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ నుండి బయలుదేరాం.

నేషనల్ హైవే లో కలిసేటప్పుడు - అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అది చూసుకోలేదు. క్రిందన ఫట్ మని చప్పుడు.. నా ప్రక్కన నుండి వచ్చిన ఇంకో బైక్ అతను - ఏదో పగిలింది.. సైలన్సర్ కి తాకినట్లు ఉంది చూసుకోమన్నాడు. ఆ శబ్ధమేదో నాకు తెలుసు.. సెంట్రల్ స్టాండ్ కి ఉన్న పట్టీ అలా స్పీడ్ బ్రేకర్ కి తాకింది.. ( ఇలా ఎన్నోసార్లు జరిగింది. అది మామూలే.. చాలా ఏళ్లుగా ఆ శభ్దాన్ని వింటున్నాను ) అలాగే నడిపాను. అలా ఇరవై కిలోమీటర్లు వచ్చేశాను.. ఇంకో ముఫై కిలోమీటర్లు అయితే ఇంటికి వచ్చేస్తాను అనుకోనేలోగా ఒక్కసారిగా బండిలో ఏదో చప్పుడు.. ముందుకు వెళ్లడం లేదు.. ఒక్కసారి నివ్వెరపోయాను. అదీ కాసేపే. ఇలాంటి క్లిష్ట పరిస్థితులని ఎన్నో చూశాను కాబట్టి బండిని ఆపి, సెంట్రల్ స్టాండ్ వేసి బండి స్టార్ట్ చేసి, చూశా.

ఇంజన్ ఓకే.. పని చేస్తున్నది. లైటు ఓకే. వెనక టైర్ వద్ద ఏదో చప్పుడు. ఇంజన్ ఆపి టైర్ ఊపి త్రిప్పి చూశా.. అదీ కాస్త ప్లే ఉంది. త్రిప్పితే తిరుగుతున్నది కూడా. అది మామూలు ప్లే నే. అంటే వెనక టైర్ సెక్షన్ అంతా ఓకే.. బేరింగ్స్ కూడా ఓకే అన్నమాట. మరెక్కడ సమస్య? చుట్టూ కటిక చీకటి. ఆ హైవే మీద సెకన్ కొక వాహనం వెళుతున్నది. ఎవరూ ఆగటం లేదు.. ఆ వెలుతురులోనే మా బండిని పరీక్షిస్తున్నాను.

మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి, చూశా.. ఇప్పుడు ఆ చప్పుడు లేదు. ఇంజన్ ని రైజ్ చేసినా వెనక టైర్ లో మూవ్మెంట్ లేదు. అంటే ఇంజిన్ లో ఏదో సమస్య. ఆయిలా? అనుకున్నాను.. ఇంజిన్ క్రింది బాడీ చాంబర్ వద్ద చేయి పెట్టి, తడిమి చూశాను. ఆయిల్ ఛాంబర్ వద్ద ఆయిల్ తడి. అంటే ఛాంబర్ పగిలి ఆయిల్ కారిపోయి, అలా ఆగిపోయిందా? బండిని వంచి చూద్దామన్నా వీలు కాలేదు.. క్రిందన ఏమీ కనపడటం లేదు. ఇక బండి దుకాణం పెట్టేసేంది.. అప్పుడు రాత్రి 9:20 అయ్యింది. ఇంత రాత్రిన పిల్లలతో ఆ రోడ్డు మీద ఎలా ఉండాలి, సురక్షితముగా ఉండాలంటే ఎలా? బండిని ఎలా తీసుకవెళ్ళాలి??? అన్న ఆలోచనలు.. పిల్లలేమో నావంకే చూస్తున్నారు.. నేను ఉన్నానన్న ధీమాతో, నేను తీసుకోబోపోయే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అబ్బాయి, నేనూ ఉంటే ఏమీ అయ్యేది కాదు.. మాతో అమ్మాయి ఉండటంతో - నిర్ణయం త్వరగా తీసుకోవాల్సి వచ్చింది. అలా రోడ్డు వారగా, చీకట్లో ఉండటం ఏమాత్రం మంచిది కాదు కూడా. ఎంత త్వరగా సేఫ్ జోన్ లోకి వెళితే అంత మంచిది. 

నేషనల్ హైవే కాబట్టి కొంత ఆలస్యమైనా ఫరవాలేదు కానీ - స్టేట్ హైవే మీద మాత్రం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే స్టేట్ హైవే (జిల్లాల మధ్య రోడ్లు) మీద రాత్రిళ్ళలో వాహనాల రాకపోకలు చాలా చాలా తక్కువ. నేషనల్ హైవే మీద అయితే - చాలా ఎక్కువ. ధీమాగా ఉండొచ్చు ఆవిషయంలో. అదే కాదు దానితో పోలిస్తే ఎన్నో విషయాల్లో నేషనల్ హైవే నే నయం.. ( అది నా అనుభవం ). అక్కడ అయితే చాలా నిబ్బరంగా ఉండొచ్చును. అందుకే టూర్ కి వెళ్ళేటప్పుడు స్టేట్ హైవే లో వెళ్ళి, రాత్రిన ఇలా ఈ దారిలో రావటం..

ఇలా బండిని చూస్తుండగానే అప్పుడే....


( ఇంకా ఉంది.. మిగతాది ఇక్కడ చదవండి - http://achampetraj.blogspot.in/2015/07/3_28.html )


Thursday, July 23, 2015

గోదావరి పుష్కర యాత్ర - 1

గోదావరి పుష్కరాలకు నేను వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి, ఎలా వెళ్ళితే బాగుంటుందీ అని ఆలోచించా.. వెళ్లొచ్చిన వారి సలహాలని పరిగణలోకి తీసుకున్నాను.. పార్కింగ్ ఒకచోట, స్నానాల ఘాట్ ఇంకోచోట, దైవ దర్శనం మరోచోట.. ఈ మూడింటి మధ్య కనీసం రెండు, మూడు కిలోమీటర్ల దూరం.. హ్మ్.. ఇలా ఉన్నాక పిల్లలతో ఎలా వెళ్ళగలను? వారిని అంత దూరం నడిపించి, కష్టపెట్టదలచుకోలేదు. అన్ని ఆలోచనలూ చేశాక - మోటార్ బైక్ మీద వెళ్ళటమే మంచిదనిపించింది. మాకు వీలయ్యే సమయం - శని, ఆదివారాలు మాత్రమే. ఆరోజులు ఎలానూ రద్దీయే. అందునా శనివారం రంజాన్ వస్తున్నది. సెలవు రోజు.. నేల ఈనినట్లుగా జనాలు తండోప తండాలుగా వస్తూనే ఉంటారు. ఈసారి ఇలా రెండురోజులూ సెలవు దినాలు కాబట్టి ఆరోజులు ప్రయాణానికి, స్నానాలకీ కష్టముగా ఉండే రోజులని ఊహించాను. కానీ ఆరోజుల్లోనే వెళ్ళాక తప్పింది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ మీద వెళ్ళటమే మంచిదనిపించింది. Travel as you like మాదిరిగా ప్రయాణం చెయ్యవచ్చు అనీ. మా అమ్మాయి అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్న కోరికా తీరినట్లు అవుతుందని. తన కోరిక తీర్చడానికి ఇలా ప్రోగ్రాం పెట్టుకున్నా.. అలాగే వారికి బయట ప్రపంచం అంటే ఏమిటో పరిచయం చెయ్యాలనిపించింది. వేరే ఊళ్లు, పట్టణాలు ఎలా ఉంటాయో విండో సీయింగ్ Window seeing లా చూపించడం అన్నమాట. తండ్రి అన్నాక ఆ భాద్యత తప్పుతుందా? ( నిజానికి నా అంచనా నిజమయ్యింది.. బైక్ మీద వెళ్ళటమే మంచిదయ్యింది. విపరీతమైన రద్దీ.. )

ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు పిల్లలూ, నేనూ కలసి వెళ్ళాలని అనుకున్నాను. ఈ పర్యటనలో ఎదురయ్యే విషయాలని ఇద్దరికీ చెప్పాను.. పుష్కరాలు అంటే ఏమిటో, పోయినసారి వెళ్ళినప్పుడు నా అనుభవాలు, అక్కడ ఎలా మసలుకోవాలో, ఎలా అక్కడ ఉండాలో, తప్పిపోయినప్పుడు ఎలా ఆ సమస్యని అధిగమించాలో అన్ని జాగ్రత్తలూ చెప్పాను. ముగ్గురికీ మూడు ఫోన్స్ ఏర్పాటు చేశా..

బయలుదేరే ముందు రోజున నా బైక్ సాయంత్రం పాడయ్యింది. బాగు చేయిద్దామనునుకున్నా సమయం లేదు. వేరేవారిది అడగాలని మనసొప్పలేదు. ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు. వాళ్ళని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. టూర్ వాయిదా వేద్దామని అనుకుంటున్నపుడు - స్కూటీ ఉన్నది కదా. దానిమీద వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచన... మాఅమ్మాయి నేనే లాంగ్ డ్రైవ్ చేస్తానూ అని కోరిక. ఈ స్కూటీ అంత లాంగ్ డ్రైవ్ కి పనికి వస్తుందా? అనే ఆలోచన. ప్రస్తుతానికి ఆ బండి తప్ప మరేమీ ప్రత్నామాయాలు లేవు. పోనీ.. తర్వాత వెళదాం అంటే వీలుకాదు.. సో, తప్పనిసరిగా దాన్ని వాడక తప్పింది కాదు. సరే దానిమీదే వెళ్లాలని నిర్ణయించాం. వారం రోజుల క్రిందటే కొన్ని బాగాలేని పార్ట్స్, ఆయిల్ మార్పించాను. ( ఇలా అన్నీ విడిగా, వివరంగా వ్రాయటం ఎందుకూ అంటే - నా జ్ఞాపకాలను గ్రంధస్థం చేసుకోవటానికి - ట్రావెలాగ్ లా అన్నమాట. మీకందరికీ ఉపయోగపడేలా ఉండాలనీ  )

ఆరోజు అంతా నిద్రపట్టలేదు.. టూర్ కి అలా స్కూటీ మీద వెళితే ఎలాంటి అనుభవాలు ఎదురవ్వవచ్చో అనీ.. దాని ఇంజన్ కెపాసిటీ తక్కువ. ఏదో లోకల్ గా వెళ్ళటానికి సరిపోతుంది.. ( అని నా భ్రమ అని తరవాత తెలిసింది ) అలాంటిది లాంగ్ డ్రైవ్ అంటే మామూలు విషయం కాదనుకుంటా. చూద్దాం. సక్సెస్ అయితే ఇక అంతకన్నా కావాల్సింది ఏముందీ.. ఎలా వెల్లోస్తామూ అన్న ఆలోచనలతో - ఒక అరగంట తప్ప తెల్లారి వరకూ నిద్రపట్టక అలాగే మేల్కోండిపోయాను. ఉదయాన్నే ఆరింటికే ప్రయాణానికి సిద్ధమయ్యాము. అన్నీ ఒకసారి చెక్ లిస్టు తో సరిచూసుకొని బయలుదేరాం. కాళ్ళ వద్ద ఉండే లెగ్ స్పేస్ లో - స్నానాలు చేశాక వేసుకొనే బట్టలున్న బ్యాక్ ప్యాక్ ని ఉంచాం.

వెళ్ళిన దారిలోనే రావటం ఎందుకూ అనీ - క్రొత్తదారిలో వెళ్లాలని అనుకున్నాను. అలా ప్రయాణం రూట్ మార్చాను. ఇప్పుడు వెళ్ళేది స్టేట్ హైవే. అది ఎలాగూ గతుకులు గతుకులుగా ఉంటుంది. ఏదైనా జరిగినా పగలు పూట ఎక్కువ ఉంటుందని, అంతలోగా ఆ సమస్యని దాటొచ్చుఅనుకున్నాను. వచ్చేదారి ( Return ) నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక ఈరోడ్డు విషయమై యే ఇబ్బందీ ఉండదు. నిజానికి లాంగ్ టూర్ అంటేనే - ఎపుడు ఏది జరుగుతుందో తెలీదు.. అన్నింటినీ ఎదురుక్కొనే సత్తా మీదే ఆ టూర్ విజయం ఆధారపడుతుంది. ( ఈ విషయం చివరిలో వస్తుంది ) ఇలా విజయం సాధిస్తుంటేనే - మరెన్నో విజయాలని సాధించాలన్న ప్రేరణ కలుగుతుంది.

నిద్రలేని కారణాన మా అమ్మాయికే డ్రైవింగ్ ఇచ్చాను. పెట్రోల్ బంక్ లో టాంక్ ఫుల్ చేయించాను. అంటే 5 లీటర్ల టాంక్ ని మూతివరకూ నింపించాను. మరో లీటర్ ఖాళీ నీళ్ళ బాటిల్ లో స్పేర్ గా పెట్టుకున్నాను. ఆరింటికి బయలుదేరామా.. కాసేపట్లోనే నా నాలుక వేడి వేడి టీ అడగటం మొదలయ్యింది. ప్రొద్దున్నే మొహం కడగగానే వచ్చే వేడి తేనీరు బాగా అలవాటయ్యింది. మధ్యలో త్రాగుదామని అనుకున్నా ఆ సమయానికి ఎక్కడా ఒక్క హోటల్ కూడా తెరవలేదు.. కొన్నిఉన్నా అంత బాగోలేక ఆగలేదు. నేను ఒక్కడిని త్రాగాలనుకున్నా - పిల్లలకి టిఫినీ అయినా తినిపించాలి కదా అని చూశా.. ఊహు.. ఆ దారిలో హోటల్స్ సరిగా లేవు.. క్రొత్తగా వెళుతున్న దారి కదా.. ఎక్కడ ఏముంటాయో తెలీదు. మొదటి 41 కిలోమీటర్లు మా అమ్మాయి బండి నడిపింది. ఆ తర్వాత నేను నడిపాను.. GPS పనిచెయ్యక పోతే, దారిలో వారినీ, వీరినీ అడుగుతూ అలా సాగిపోయాను. ఎన్నడూ ఆ దారిలో అంత దూర ప్రయాణం చెయ్యలేదు. మామూలువ్యక్తులూ, పోలీస్ సిబ్బందీ, తోటి వాహనాల వారినీ, మధ్యలో కనిపించిన RSS వాలంటీర్ల వారినీ... ఇలా వెళ్ళే దారిని అడుగుతూ, అలా ఏకబిగిన మొత్తం 165 కిలోమీటర్ల దూరాన్ని నాలుగున్నర గంటల్లో వెళ్ళాం.. అంత దూరం ఎక్కడా ఆగకుండా వెళ్లడం - అంత చిన్న (88 cc) సామర్థ్యపు బండి మా ఉత్సాహానికి మద్దతు పలికి అంత దూరాన్ని ఏకబిగిన సహకరించటం.. నిజముగా హాస్చర్యం వేసింది. చెబితే నమ్మరుగానీ, మోటార్ బైక్ కన్నా ఇదే చాలా సౌఖ్యముగా అనిపించింది. నిజానికి అంతదూరం ఏకబిగిన వెళ్ళకూడదు కానీ, మంచి హోటల్స్ కనపడక పోయేసరికి అలాగే కొనసాగాల్సివచ్చింది.

ఇక్కడ స్కూటీ లోని కొన్ని సౌకర్యాలు చాలా బాగా నచ్చాయి. మొబైల్ చార్జింగ్, లగేజ్ కంపార్ట్మెంట్, అందులో ఒక డబ్బాలో ఎక్స్ ట్రా పెట్రోల్, లగేజీ హుక్స్, పెట్రోల్ ఇండికేటర్, గ్లవ్ కంపార్ట్మెంట్, లాంగ్ సీట్.. ఇలా చాలానే నచ్చాయి. కొన్ని ( టైర్ సైజు, స్పీడ్ లిమిట్, రఫ్ & స్పీడ్ డ్రైవింగ్ కి సరిపోక పోవడం..) అననుకూలతలు ఉన్నా ఇదే బెస్ట్ అని నాఅభిప్రాయం.

TVS scooty ( Google image) ఇది మా బండి కాదు.. 

చివరకి బాసరకి Basara చేరాం. బాసర మొదట్లో ఏమైనా హోటల్స్ ఉన్నాయో చూశా.. లేవు. ఒక షాప్ లో బిస్కట్ ప్యాకెట్స్  కొన్నాను. అవే టిఫినీగా కానిచ్చాము. పనిలోపనిగా అక్కడ సౌకర్యాల్నీ, రద్దీ గురించి అడిగాను. కొనుగోలు చేశానని కాబోలు అన్ని వివరాలు చెప్పాడు ఆ షాప్ వాడు. లాంగ్ టూర్ లో ఇలాగే చెయ్యాలి. చేస్తే - చాలా వివరాలు తెలుస్తాయి. రద్దీలేని షాపులో చిన్ని షాపింగ్ చేస్తే చాలు.. అక్కడి విషయాలు చాలానే తెలుస్తాయి. ఇది ఉభయతారకం. వారికి కొనుగోలు అవుతుంది. మనకి వివరాలు తెలుస్తాయి. వారు చేసిన సహాయానికి ఇలా కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట. ఇంటివద్దనుండి తెచ్చుకున్న నీళ్ళని త్రాగేసి, మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం. కొద్దిదూరంలో ఉన్న బాసరకి చేరుకున్నాం.

అప్పటికే నేల ఈనినట్లుందా? అన్నట్లు జనం. చాలామంది సాయంత్రం బయలుదేరి, రాత్రి ఆ పుష్కర ఘాట్ల వద్ద పడుకొని, మరుసటి రోజు ఉదయాన్నే స్నానాలు కానిచ్చేస్తున్నారు.. ఈ ఐడియా బాగుంది కానీ ఒక్కోసారి మనకి కుదరవు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడేవారు అయితే ఈ పద్ధతి బెస్ట్. కానీ భద్రత విషయంలో కాసింత కష్టమే. అక్కడ ఉన్న ప్రధాన ఘాట్ కి చేరుకున్నాం. బైక్ మీద వెళ్ళటమే మంచిదయ్యింది. స్నానాల ఘాట్ కి దూరముగా కార్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. పుష్కరాలు సరిగా జరగాలంటే ఆ ఏర్పాటు తప్పదు. మేము గనుక అలాగే వచ్చి ఉంటే - నడక తప్పేది కాదు. అందుకే ముందే వెళ్లొచ్చిన వారి సూచనలు తీసుకోవడం మంచిది. 


పై ఫోటోనే - బాసర ప్రధాన ఘాట్ తోరణం / ప్రవేశ ద్వారం. లోపలి వెళ్ళి చూశాం,  నదీ పూజలూ, పిండ ప్రదానాలు, భక్తుల స్నానాలతో చాలా రద్దీగా ఉంది. ప్రధాన ఘాట్ కాబట్టి చాలామంది అక్కడే స్నానాలు చెయ్యటంతో నదీ జలాలు చాలా బురదగా మారాయి. ఈసారి వర్షాలు కాసింత ఆలస్యం అవటంతో ( తొలకరి తప్ప ఇంకా వర్షాలు పడలేదు ) నదీ ప్రవాహం అస్సలు లేదు.. చెరువు నీళ్ళలా తోచింది. ప్రధాన ఘాట్ లో బాగుంటుందని అవతలి గట్టు నుండి ఈ గట్టుకి వచ్చాం.. ఇక్కడ కన్నా అక్కడే నీళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయి.. కానీ, బోటింగ్ వాళ్ళు, రక్షణ సిబ్బంది లేని కారణాన రిస్క్ తీసుకోక - ఇక్కడే పుష్కర స్నానం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. క్రొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అత్యుత్సాహంతో ఏదైనా చేస్తే - ఏదైనా జరిగే కాపాడే నాథుడు ఎవడూ ఉండడు. ఎవడి బీజీ వారిది. 


పై ఫోటోలో కుడి మూలన కనిపిస్తున్న ఇన్టేక్ వెల్ పంప్ intake well pump house యూనిట్ వద్ద అటువైపున ఉన్నది ప్రధాన ఘాట్. దానికి ఇటువైపున మేము స్నానాలు చేసాం. ఇక్కడ గట్టు వరకూ నీళ్ళు ఉన్నాయి. స్నానాలు అయ్యాక బట్టలు మార్చుకోవటానికి రేకులతో చాటులని ( ఫోటోలో ఉన్న నీలం రంగు నిర్మాణాలు ) నిర్మించారు. బురద నీటితో స్నానం అయ్యాక కడుక్కోవటానికి షవర్ స్నానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రోడ్డు ప్రక్కన పార్క్ చేసిన మా బండిని ఇక్కడినుండే అప్పుడపుడు చూసుకోవచ్చు. ఇక్కడ జనం రద్దీ తక్కువగా ఉంది. ( వీడియో చూడండి ) తడిసిన బట్టలు ఆరబెట్టుకోవటానికి వీలుగా ఉంది కూడా. అన్నింటికన్నా మించి - నదిలో మోటార్ బోటు మీద, తెప్పల మీద సహాయక సిబ్బంది ఉన్నారు. ఏమైనా జరిగితే కాపాడటానికి ఉంటారు. ఒకవేళ వారి నుండి మిస్ అయినా ఇంకో రెండు మూడు ఘాట్స్ వద్ద ఉన్న భక్త జనం, సిబ్బంది వల్ల క్షేమం గానే ఉంటాం. అందరూ - " జాగ్రత్త జాగ్రత్త.." అని చెబుతారు కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పరు. అందుకే ఇలా వివరంగా చెప్పాను.. చెబుతున్నాను. పిల్లలకీ ఇదే చెప్పాను. అందుకే అన్నివిధాల అనువైన ఆ స్థలంలో స్నాన కార్యక్రమాన్ని మొదలెట్టాం. అక్కడి స్నానాల ఘాట్ ని ఈ వీడియోలో చూడండి. 



గట్టువద్ద సామాను వద్ద ఒకరు ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. ముందుగా నేనూ, మా బాబు.. ఆ తరవాత అమ్మాయి, నేనూ గోదావరి నదిలో నీళ్ళు లేని కారణాన నది మధ్యలోకి వచ్చి అక్కడ స్నానాలు చేశాం. అంత మధ్యలోకి వచ్చి స్నానం చెయ్యటం ఇదే ప్రథమం. అయినా సరే చుట్టూరా భద్రతా సిబ్బంది, తోటి యాత్రికులు ఉన్నది చూసుకొన్నాను. వర్షాలు లేని కారణాన - ఉన్న కాసిన్ని నీళ్ళని గట్టువద్దకి రావాలని - ప్రోక్లైనర్ తో మట్టి తీసేసరికి అక్కడక్కడా గోతులు ఉండిపోయాయి. ఆ తీసిన మట్టీ ఆ నదిలోనే ఉన్నట్లుంది.. పైగా నదీగర్భం మట్టి అంతా నల్ల రేగడి మట్టి. ఇక చూసుకోవాలి భక్తుల అవస్థలు. కాళ్ళు లోపలికి కూరుకపోతున్నాయి. అలా అవటం మూలాన ఆ మట్టి పిసికినట్లు అయ్యి, ఆ నీళ్లన్నీ బురదగా మారాయి. నీళ్ళు బురదగా ఉండటానికి గల కారణం అదీ. 

నీటిలో మునిగి, క్రిందన ఉన్న మట్టిని తీసుకున్నాను. మడ్ బాత్ Mud bath లా వంటికి ఆ బురద రుద్దుకొని, ఆ తరవాత నీటిలో మునకలేశాను. మా అబ్బాయికీ అలాగే ఆ బంకమట్టి బురదతో వళ్ళు రుద్దాను. ఇదంతా ఒకరు తన మొబైల్ తో ఫొటోస్ తీశారు. నేను చూసినప్పుడు వారివి తీసుకుంటూ, నేను నా పనిలో ఉన్నపుడు -మా ఫొటోస్ తీశాడు. స్నానాలు అయ్యాక, నా మెయిల్ ఐడీ అడిగారు. ...చెప్పాను. ఇంత ఈజీ మెయిల్ ఐడీనా? అన్నారు. అవునన్నాను. ఆ ఫొటోస్ పంపిస్తాను అన్నారు. (నాకు నమ్మకం లేదు ఫొటోస్ మెయిల్ చేస్తారని ) సరే ని, ఆ మెయిల్ ఐడీ మరచిపోతే ఫేస్ బుక్ అకౌంట్ కి మెస్సేజ్ చెయ్యమనీ, లేదా మా బాబు ఫేస్ బుక్ అకౌంట్ కి మెస్సేజ్ లో పోస్ట్ చెయ్యమని చెప్పాను. సరే అన్నారు. ఫోన్ లో మెమో / నోట్ ప్యాడ్ / SMSలో ఫీడ్ చేస్కోమని చెప్పాను. నాకు గుర్తు ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటివరకూ వారు నాకు నా ఫొటోస్ పంపలేదు. 

ఆ తరవాత గట్టు మీద ఉన్న షవర్ బాత్ వద్ద మళ్ళీ ఒకసారి స్నానం చేసాం.. వంటికి మిగిలిపోయిన బురదనీ లా కడుక్కున్నాము. ఈ షవర్ బాత్ కి వచ్చే నీళ్ళు ఆ గోదావరి నీళ్ళే. మోటార్లు పెట్టి, ఆ నీటిని ఇలా షవర్ జల్లుగా మార్చి పెట్టారు. రెండు షవర్స్ మాత్రం తీసేసి, నీరు ధారగా పడేలా చేశారు. దానికి 4 బాటిల్స్ పట్టి ఇంటికి గోదావరి నీటిని పట్టుకొచ్చాం. అంతలోగా మా బట్టలని ఆ గట్టు మీద ఆరబెట్టేసి, వాటిని ఒక ప్రత్యేకమైన బ్యాగులోకి సర్దేశాం. 

పుష్కరాలకి ఈసారి బాగా సెక్యూరిటీ పెంచారు. మీటర్ కి ఒక సిబ్బంది అన్నట్లుగా ఉంది. గట్లూ, ఏర్పాట్లూ, భక్తులకు మరింత సౌకర్యాలను కలగచేయటంలో ఈసారి బాగా శ్రద్ధ వహించారు. వచ్చిన భక్తజనం కూడా క్రమ పద్ధతిలో రావటం నాకు బాగా నచ్చేసింది. గుడిలో దర్శనం కోసమని తోపులాటలు లేకుండా దర్శనం చేసుకోవడం బాగుంది. పార్కింగ్ స్థలం నుండి ఆలయాల వరకూ ఒక ఉచిత ప్రయాణ బస్ పెట్టడం చాలా బాగుంది. కాకపోతే ఆ బస్ గురించి అంతగా ప్రచారం చెయ్యలేక పోవడం ఒక లోపం. అలా చేస్తే భక్తులకు ఇంకా సౌకర్యముగా ఉండేది. లైటింగ్, రహదారుల నిర్మాణం ఇంకా పూర్తవలేదు. మొత్తానికి పోయిన పుష్కరాల కన్నా ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. 

స్నానాలు అయ్యాక - గుడికి బయలుదేరాం. బయట చెప్పుల స్టాండ్లో చెప్పుల్ని పెట్టి టోకెన్ తీసుకున్నాం.. అలాగే మొబైల్, కెమరాల పార్కింగ్ కోసం మరో స్టాండ్. ఇది క్రొత్తగా చూశాను. నిజానికి ఇందులో పెట్టడం అవసరం లేదనిపించింది. ఏమో.. ముందు చెకింగ్ అయితే మళ్ళీ వెనక్కి రావటం ఇష్టం లేక ఇందులో పెట్టాను. వాటి సర్వీస్ చార్జ్ మొత్తం ముప్పై రూపాయలు. 

గుడిలో స్వచ్చంద సేవకులూ, పోలీసు వారి సహాయాన దర్శన క్యూ త్వరగా సాగింది. చాలామంది ఉన్నా, ఇట్టే దర్శనం అయ్యింది అనిపించింది. దర్శనం అయ్యాక - ప్రసాదాలు తీసుకొని బయటకి వచ్చాం.. అప్పటికి సాయంత్రం నాలుగు పావు అయ్యింది. చెప్పుల కౌంటర్ కి వెళితే అన్నీ ఉన్నాయి కానీ ఒక చెప్పు లేదు.. ఎంత వెదికినా దొరకలేదు. ఇలా గుళ్ళకి వెళితే - ఒక త్రాడు ముక్క తీసుక వెళ్లడం మంచిది. అన్ని చెప్పుల్ని ఒకే దగ్గర ఉంచేలా ఆ త్రాడు వాటిగుండా దూర్చి మన బ్యాగ్ కి ముడి వెయ్యటం మంచిది. ఇక నుండీ ఈ పద్ధతి పాటించడం మంచిది. ఒక చెప్పు దొరకటం మూలాన, రిటర్న్ ప్రయాణానికి సమయం ఎక్కువ లేదు, ఇంటికి చేరేసరికి చీకటి పడేలా ఉందని ఇంకో కాలిది అక్కడే వదిలేసి వచ్చాం - దొరికిన వారు వాడుకుంటారు అనీ. స్టోర్ లో పెట్టిన మా మొబైల్, కెమరా తీసుకొని ఇక అక్కడ నుండి బయలుదేరాం. 


( ఇంకా ఉంది.  http://achampetraj.blogspot.in/2015/07/2.html లో చూడండి ) 

Sunday, July 19, 2015

Godavari Pushkaralu

Godavari Pushkaralu -2015 in BASARA, Telangana.. on 18-Jul-2015











Thursday, July 16, 2015

Quiz



ఈ క్రింది ప్రశ్నకి సమాధానం చెప్పండి చూద్దాం.. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Monday, July 13, 2015

Godavari Pushkaralu


పవిత్ర గోదావరి నదీ మహా పుష్కరాలకు స్వాగతం, సుస్వాగతం. 


పుష్కరిణిలో స్నానం చేసే ముందు.. 

శ్లో: ''జన్మ ప్రభృతి యత్‌పాపం స్త్రీయా వా పురుషేణ వా 
పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి'' 
అనే సంకల్ప మంత్రాన్ని చదివి నదిలో మునిగితే - 
సర్వపాపాలు పోతాయని పురణాలు చెబుతున్నాయి. 


Sunday, July 12, 2015

Quiz


పైన ఉన్న ప్రశ్న ఒక సైటు వారు అడిగారు. ఈ ప్రశ్ననే కొద్దిగా మార్చి క్రితం పోస్ట్ గా వేశాను. ఈ ప్రశ్న ఒరిజినల్. అందులో ఉన్నట్లుగా చూసి, సమాధానం చెప్పాలే అంటే ఇలా ఈ క్రింద దిగువ మాదిరిగా వస్తుంది. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సమాధానం లో తేడా అంతా ఆ అరటిపళ్ళ వద్దే వస్తుంది. ఎలా అంటే పైన ఉన్న అరటిపళ్ళు మూడు ఉన్నాయి. దాని క్రిందన ప్రశ్న అడిగే వద్ద ఒకటే అరటిపండు ఉంది. అంటే అరటిపళ్ళ విలువ ఆరు 6 అయితే ఇక్కడ ఒక అరటిపండు విలువ 2 ( 6 / 3 = 2 ) అవుతుంది. అప్పుడు ఆ మొత్తం విలువ 21 అవుతుంది. 


Friday, July 10, 2015

Good Morning - 585


భగవంతుడు సృజించిన ఈ జీవితంలో మన పాత్ర ఏమిటో ముందు గుర్తెరగాలి. ఇతర పాత్రలన్నీ కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. ఎంతవరకూ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందో, అంతవరకు పోషించి, హుందాగా, మర్యాదగా అందులోంచి వైదొలగడంలోనే గొప్పదనం దాగి ఉంది. 

మనం జీవిస్తున్న జీవితం ఆ భగవంతుని కృపనే.. ఆయన ఇచ్చిన ఈ చిన్ని మానవ జన్మలోని మన పాత్ర ఏమిటో ముందుగా బాగా తెలుసుకోగలగాలి. జీవితమే నాటకరంగం అయినప్పుడు - మనం అందులో ఎలాంటి పాత్ర వెయ్యబోతున్నాం, ఎలా నటించబోతున్నాం, ఎప్పుడు వచ్చి, ఎప్పుడు ఆ నాటకము నుండి వైదొలగుతున్నాం అన్నది బాగా గ్రహించగలగాలి. అప్పుడే మన పాత్ర ఏమిటో, మన పరిధి ఏమిటో చక్కగా తెలుస్తుంది. మన పాత్రే కాదు.. ఇతరత్రా పాత్రలూ, వేషాలూ అన్నీ కొన్ని కొన్ని పరిధులల్లో ఉంటాయి. అంటే వాటికి కొన్ని హద్దులు అంటూ ఉంటాయి. ఏ పాత్ర ఎక్కడ మొదలెట్టి, ఎక్కడ ముగిసిపోవాలో అన్నమాట. ఇదంతా ఆ సృష్టికర్త అయిన ఆ భగవంతుని అదుపాజ్ఞలలో జరుగుతుంది అన్నది ఒక విశ్వాసం. 

కొన్ని విషయాల వరకూ వస్తే - అది బంధమే కావొచ్చు, మన తాలూకు ఒక బాధ్యతనే కావొచ్చును.. అది తండ్రియో, భర్తయో, అన్నయ్యగానో , స్నేహితునిగానో.. లేదా మరేదైన రూపములో  ఉండొచ్చు. దాన్ని ఎంతవరకు పోషించాల్సి ఉంటుందో అంతవరకే దాన్ని పోషించి ఆ పాత్రని ముగించేసేయ్యాలి. అలా ముగించటం అన్నది హుందాగా, దర్పముగా, మన బాధ్యతలేమిటో నిర్వర్తించి, అన్నీ చేశాక ఆ పాత్రల నుండి బయటకి రావడం అన్నమాట. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో అప్పుడే మన పాత్రకి సరైన న్యాయం చేకూర్చినట్లు. 

మొదట ఈ విషయాన్ని నేను తెలుసుకోలేక పోయాను. దూరమైన నా స్నేహితుని వల్ల ఈ విషయాన్ని చక్కగా తెలుసుకున్నాను. నా పాత్ర ఏమిటో, నా బాధ్యత ఏమిటో, ఎలాంటి బాధ్యతలు ఇప్పుడు నిర్వహించాలో, ముందు ముందు ఎలాంటివి ఎత్తుకోవాల్సి ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉండాల్సి వస్తుందో.. ఇత్యాది విషయాల్ని తెలుసుకున్నాను.. నా వంతు పాత్ర వేస్తున్నాను. తనకు ఇచ్చిన మాట ప్రకారం - చాలావరకు నా పాత్రని సరిగ్గానే చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఇంకా చాలానే చెయ్యాల్సింది ఉన్నా - నా పాత్రని సరిగా నిర్వహించేలా తగిన శక్తిని ఇమ్మని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. 



Thursday, July 9, 2015

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



Monday, July 6, 2015

పొడుపు కథలు - 3


తండ్రి గర గర, 
తల్లి పీచు పీచు, 
బిడ్డలు రత్న మాణిక్యాలు.. ఏమిటదీ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer :


Friday, July 3, 2015

నేను చేసిన Jewellery mini Work table

ఈమధ్య నేను చేసిన నా క్రియేటివిటీ ని చూపదలచుకున్నాను. నా మిత్రుడు అడగగా - మిగిలి ఉన్న చెక్కలతో ఒక చిన్న టేబుల్ ని చెయ్యాలనుకున్నాను. 6mm ప్లైవుడ్ ముక్కలు ఉన్నాయి, కానీ పెద్దవీ, కాసింత లావువీ లేవు. వాటిని బయటే కొన్నాను. వాటితో చిన్న టేబుల్ చెయ్యాలని అనుకున్నాను. 

మొదటగా - స్కెచ్ వేసి, కొలతలతో వ్రాసుకున్నాను. ఆ తరవాత ఇంకా కొన్ని మార్పులూ, చేర్పులూ చేశాను. ఆ తరవాత పని మొదలెట్టాను.

ఇదంతా నా క్రియేటివిటినీ, నిర్మాణ కౌశలాన్నీ, క్రొత్త పనులు చేస్తుంటే - జీవితం క్రొత్తగా, తెలీని ఆసక్తీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందనే ఆలోచనతో ఇలా క్రొత్త క్రొత్త పనులు మొదలెట్టాను. ఆన్లైన్ లో ఉండటం తగ్గించాను.. అలా మిగిలిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాను. వీలున్నప్పుడల్లా మెల్లిగా, మళ్ళీ మళ్ళీ చేస్తూ, ఇంకా బాగా రావాలని ప్రయత్నిస్తూ, చేసుకుంటూ వెళ్లాను. నిజానికి ఇలా కార్పెంటరీ పని చెయ్యటం నాకు క్రొత్త. అందులో ఏమీ అనుభవం లేదు. కనీస పనిముట్లూ కూడా లేవు. నా కులవృత్తీ కూడా కాదు. అసలు ఆ రంగంలో మా వంశస్థులే లేరు - అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ రంగం నాకు ఎంత క్రోత్తనైనదో.. అయినా ఇక్కడ ఆసక్తి ప్రధానం. చెయ్యాలన్న ఆసక్తీ.. నా పనితనం మీద నాకున్న నమ్మకం. చేస్తే ఒక టేబుల్ అవుతుంది. లేకుంటే చిన్న టూల్ బాక్స్ లా చేసెయ్యాలని అనుకున్నాను. అలా స్కెచ్ మొదలెట్టాను. ఇలా వేశాను. ఇదే నేను మొదట అనుకున్నది. రఫ్ గా అలా అంచనాలు చేశాను. అలాగే కొలతలు కూడా లెక్కపెట్టాను. ఏది ఎంత ఉంటే బాగుంటుందో అనీ..

Work table sketch

ఆతరవాత దాన్ని మరింత అభివృద్ధి చేసి, ముందు కన్నా బాగా ఉండేట్లు, కొన్ని అంత సౌకర్యవంతముగా లేని అటాచ్మెంట్లూ తీసేసి, తేలికగా ఉండి, ఈజీగా వాడుకోవడానికీ, అవసరమైతే వేరే పనికీ వాడుకోనేలా ఉండాలని అన్నట్లు ఆలోచించి, దానికి తగిన విధముగా మళ్ళీ స్కెచెస్ వేశాను. మరికొన్ని అదనపు సౌకర్యాలు ఆలోచించాను. కానీ అవి నేను చెయ్యగలిగే స్థితిలో ఉన్నా, చేసే వడ్రంగి పరికరాలు గానీ, అనుభవం గానీ నాలో లేకపోయింది.    అందుకే చేసినదానికే మళ్ళీ క్రొత్త సౌకర్యాలు చేసుకొనేలా వాటిని అట్టే పెట్టి ఉంచాను. ఊహల్లో ఉన్న ఆలోచనల్ని ఇతరుల ద్వారా చేయించుకోవచ్చు కానీ మొత్తం నేనే చేశాను అనే సంతృప్తి కోసం ఆగిపోయాను. అలా సాగిన నా ఆలోచనల పరంపర - ఇలా ఫైనల్ స్కెచ్ తో ఆగిపోయింది. అప్పుడు అనుకున్న ఆ టేబుల్ స్కెచ్ ని ఇలా నీటుగా ఒక పేపర్ మీద వేసుకున్నాను. అయిననూ ఆ స్కెచ్ ప్రకారం టేబుల్ చేస్తున్నప్పుడు మరిన్ని మార్పులు చేశాను.  
( Jewellery ) Work table Final sketch

అలా చిన్న టేబుల్ చెయ్యాలనుకున్నాను. చెయ్యటం మొదలెట్టాను. వీలు చేసుకొని నా సమయం అంతా ఆ టేబుల్ నిర్మాణం లోనే గడిపాను. అలా ఒక్కొక్కటీ చేస్తూ పోయాను. చివరికి ఇలా తయారు అయ్యింది. ఈ క్రింది వీడియో చూడండి. అందులో కొన్ని పొరబాటులు ఉన్నాయి. అవి తగిన పరికరాలు ( యాంగిల్ గ్రైండర్, స్పిరిట్ లేవలర్, 90 డిగ్రీల L పట్టీ, చెక్కలని కోసే మిషన్. బీడింగ్ చేసుకొనే మిషీన్, డ్రిల్.... ఇవన్నీ త్వరలోనే కొనాలనుకుంటున్నాను ) లేక, అనుభవం లేక వచ్చే తప్పులు. అవి చేశాక తెలిశాయి. అయినా నా తృప్తి కోసమని చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి.

నా దగ్గర ఉన్న 6mm ప్లైవుడ్ ముక్కలని మేకులతో, చెక్క జిగురు Fevicol తో జత చేశాను. అంత సన్నని చెక్కలని మేకులతో జత చెయ్యడం చాలా కష్టమే. అయిననూ అలాగే చేశాను. కొన్ని మేకులు ప్రక్కకి వెళ్ళిపోయేవి. వాటిని మధ్యలోనే కత్తిరించేసి, అలాగే దిగగోట్టేశాను. లెవలర్, యాంగిల్ లాంటి చిన్న పని ముట్లు లేకున్నా ( చూడటానికి చిన్నవైనా అవి ఉంటే సరియైన ఆకారములో సరిగ్గా వస్తాయి ) అలాగే చేశాను. ల్యామినేట్ షీట్ ని కట్టర్ తో కత్తిరించి, పేపర్ టేపు సహాయాన ( cost : Rs. 20 ) అతికాను. బయట ప్రక్కలు మాత్రం నోవాపాన్ బోర్డ్ ప్లైవుడ్ ని వాడాను. ఆ బోర్డ్ కి అందముగా పెయింట్ వేసి ఉంటుంది కాబట్టి - దానికి ల్యామినేట్ షీట్ అతకాల్సిన అవసరం ఉండదు కూడా. డ్రాలు తేలికగా కదలడానికి చానల్ పట్టీలు ( Sliding channels ) వాడాలని అనుకున్నాను. కానీ డబ్బులు బాగా అవుతాయనీ ( cost : per inch = Rs. 25 ) ఆగాను. పైన మాత్రం ప్లైవుడ్ కి బదులుగా సిమెంట్ బోర్డ్ వాడాను. అలాని ఎందుకూ అంటే - ఆ బోర్డ్ వేడినీ, ఇటు నీటినీ, చిన్న చిన్న దెబ్బలనీ, ఆసిడ్ నీ తట్టుకోవడమే కాకుండా - చాలా ధృడంగా ఉంటుంది.

ఎక్కడెక్కడ ఏమేమి వాడాను, వాటి వివరణలూ, వాటి కొలతలూ అన్నీ ఈ వీడియోలో - మీరు చూస్తున్నప్పుడే అప్పుడే కనిపించేలా పెట్టాను. అన్నట్లు ఈ వీడియోని నేనే తయారు చేశాను.. ప్రక్కన ఉన్న ఫ్యాన్ శబ్దం అంతగా రికార్డింగ్ అవుతుందని తెలీదు. ఆ శబ్దాన్ని ఎడిట్ చేసి, తీసేసే శక్తీ ఇంకా అబ్బలేదు. అదీ నేర్చుకోవాలి.


Related Posts with Thumbnails