Friday, March 27, 2015

Laxmi Narasimha Temple, Nampelli Gutta, Vemulawada.

తెలంగాణా లోని వేములవాడకి దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట మీద మరొక ఆకర్షణీయ సందర్శనా స్థలం ఉంది. ఇది పైన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ ఆలయానికి వెళ్ళే దారిలో వచ్చే మలుపు స్థానములో ఉంది. ఇక్కడ విశాలమైన పార్కింగ్ స్థలము ఉంది. కాసింత దూరంలో ఉండగానే కనిపించే ఈ అందమైన నిర్మాణం సందర్శకులను ఆకట్టుకుంటుంది. రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కట్టడం కాసింత క్రొత్తగా, అందముగా ఉండి, సరిక్రొత్త అనుభవాన్ని ఇస్తుంది. కాకపోతే నిర్మాణం లోపలికి వచ్చే పర్యాటకుల ఆటవిక చర్యల వల్ల, సిమెంట్, ప్లాస్టర్ చేసిన విగ్రహాలు అన్నీ ద్వంసం అయ్యాయి. అలా కాకుండా ఉండేలా సెక్యూరిటీ పెట్టినా ఆ పాము ఆకార వంకర్లలో అది సాధ్యం అయ్యేలా లేదు.. మంచి నిర్మాణం ఇలా ఆకతాయి చేష్టల వల్ల పాడయిపోతున్నది.. 

ఇప్పుడు ఆ ఆలయం చూద్దాం.. వేముల వాడ నుండి కరీంనగర్ కి వెళ్ళే దారిలో - వేములవాడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరములో ఉన్న గుట్ట మీద ఈ నిర్మాణం ఉంది. రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కాగానే ఎక్కువగా ఇక్కడికి వెళుతుంటారు. దూరాన నుండి ఇలా కనిపిస్తుంది.. 




ఇలా మీకు అక్కడికి రాగానే కనిపిస్తుంది.. ఇక్కడే వాహనాలని పార్కింగ్ చేసుకోవాలి. లోపలకి వెళ్ళటానికి క్రింద ఫోటోలో ఉన్న గుబురు చెట్టు వద్ద ప్రవేశ ద్వారం ఉంటుంది. దాని గుండా లోపలి వెళ్ళాలి. 


బయట ఇలా నరసింహ స్వామీ వారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహం ఉంటుంది. 


సర్ప కుబుసము కూడా చక్కగా నిర్మించారు, దానికి తగ్గట్లు రంగులు కూడా వేశారు. 


ఇదే ప్రవేశ ద్వారం.. దీనిలోపలి గుండా వెళ్ళాలి. 

లోపలి వెళ్ళగానే ద్వారం వద్ద ఆకతాయిల చేతుల్లో పాడయిన విగ్రహం కనిపిస్తుంది. 


















చివరిగా లక్ష్మీ నరసింహ స్వామీ రూపు. 





No comments:

Related Posts with Thumbnails