Tuesday, November 19, 2013

Good Morning - 502


మనిషిని తక్కువగా అంచనా వేసినా - ఒక్కోసారి మన్నింపు ఉంటుందేమో కానీ, మనసుని తక్కువ అంచనా వేసి, చులకన చేస్తే ఆ కసి రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. 

ఎదుటి మనుష్యులను ఒక్కోసారి తక్కువ అంచనా వేస్తాం. అప్పుడు వారిని చులకనగా చూడటం, సమయం దొరికినప్పుడల్లా హేళన చెయ్యటం, వీరి మీద ఏవేవో చెప్పుకొని ఫన్ చేసుకోవడాలు చేస్తుంటాం. అలా ఆ మనుష్యులను తక్కువ అంచనా వేసినప్పుడు - నిజం తెలుసుకున్నప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. మళ్ళీ వారికి మొహం చూపించలేకపోతాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. మా దగ్గర ప్రైవేట్ కంపనీలో నెలకి ఆరువేల రూపాయలకి పనిచేసే ఒకతను - నా ముందే ఒక కులవృత్తి పని చేసుకుంటున్న అతనిని చూసి, వెక్కిరింపుగా చాలా అలకగా / తేలికగా మాటలు మాట్లాడాడు. నేను అతని గురించి, అతని స్థాయి గురించీ చెప్పాను. ఆ వృత్తిలో అతను రోజుకి తక్కువ తక్కువగా వేయి రూపాయల నుండి మొదలు పెడితే, ------- వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి కనీసం యాభై వేలు తక్కువ కావు.. అన్నాను. అలాగే అతని ప్రాపర్టీ మొత్తం రెండు కోట్ల రూపాయల మీద ఉంటుందని చెప్పా. అప్పటిదాకా తేలికభావంతో ఆయన ఒక్కసారిగా భయంగా, గౌరవముగా మాట్లాడాడు. " చూస్తే పిచ్చోడిలా కనిపిస్తాడు.. అందుకే అలా అన్నా..సారీ " అన్నాడు. అప్పుడైతే మన్నించవచ్చును. 

మనసుని తక్కువ అంచనా వేసి, చులకనగా చేసి, చూస్తే - అప్పుడు ఏర్పడే కసి, రావణ కాష్టంలా ఎప్పటికీ రగిలిపోతునే ఉంటుంది. నా మీద నా నేస్తం మితృలు వెక్కిరించిన మాటలూ, చులకనగా అన్న మాటలూ, నా మీద చెప్పుకొని చేసుకున్న ఫన్, నా మీద పెట్టిన నిఘా, సెక్యూరిటీ చూపులు.. ఎప్పుడూ అదే విషయాలు నా నేస్తంతో మాట్లాడి, నాకు దూరం చేశారు. తను దూరం అయినందులకు బాధ లేదు. ఏమీ అనను / బాధ పెట్టను మాట ఇచ్చాను కాబట్టి ఎవరినీ ఏమీ అనలేకపోయాను. కానీ అవి నాకు గుర్తుకువచ్చినప్పుడల్లా - ఏదో తెలీని కసీ, బాధా నాలోనుండి ఇంకా తన్నుకవస్తూనే ఉన్నాయి. 

No comments:

Related Posts with Thumbnails