Sunday, June 30, 2013

Good Morning - 382


ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు.
గెలుపు వస్తే విజయం నీది.. !
ఓడిపోతే ఓ పాఠం నేర్చుకుంటాము. 

Saturday, June 29, 2013

Good Morning - 381


నీ జీవితములోకి ఎవరూ రారు.. 
నీ జీవితము నుండి ఎవరూ పోరు.. 

Friday, June 28, 2013

Good Morning - 380


ప్రేమ కన్నా జీవితం గొప్పది. 

Thursday, June 27, 2013

Good Morning - 379


వేడిని గురించి ఫిర్యాదు చెయ్యకు, నేడే ఒక మొక్కని నాటి, పెంచు..

Wednesday, June 26, 2013

Good Morning - 378


ఏదైనా క్షమాపణలు అయినా మూడు భాగాలుగా ఉంటుంది. 
1. నన్ను క్షమించండి. 
2. అది నా పొరబాటే. 
3. ఏమి చేస్తే - ఈ తప్పుని సరిచెయ్యగలను ? 
కానీ, చాలామంది ఈ మూడవ భాగాన్ని మరచిపోతుంటారు.. 

Monday, June 24, 2013

Good Morning - 377


నిస్సహాయ స్థితిలో నిన్ను నిజముగా ఆదుకునేది - ధృడమైన నిర్ణయమే. 

Sunday, June 23, 2013

Good Morning - 376


పువ్వు పుట్టింది తుమ్మెద కోసం, 
ఆకాశం పుట్టింది వెన్నెల కోసం, 
ఈ భూమి పుట్టింది ఆ సంద్రం కోసం, 
నేను పుట్టింది నీ స్నేహం కోసం. 

Saturday, June 22, 2013

Good Morning - 375


సమస్యలకు భయపడి, నిరాశా, నిస్పృహలకు లోనైతే - ఏమీ సాధించలేవు. 

Friday, June 21, 2013

Good Morning - 374


మనం సరిగ్గా ఎదగలేక పోతున్నామంటే అది మన తప్పు తప్ప, ఎదుటి వ్యక్తి మనపై ఏదో కుట్ర చేస్తున్నారని ద్వేషం పెంచుకోవడం అర్థరహితం. 

Thursday, June 20, 2013

Good Morning - 373


నువ్వు గమనించటం లేదు..
మన జీవితం ఎంత చిన్నదో.. !! 
మన మధ్య పెరుగుతున దూరమెంత పెద్దదో !!


Wednesday, June 19, 2013

Good Morning - 372


మన దృక్పథమే మన విజయం. 

Tuesday, June 18, 2013

Good Morning - 371


ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి - 
ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం. 

అవును. మనం ఏర్పరుచున్న ఆత్మీయ అనుబంధాలు అంటే స్నేహమే గానీ, కుటుం బంధాలే గానీ, బంధువులతో గానీ, ఆఖరికి పరిచయస్థులతో ఏర్పడే ఏర్పడుతున్న బంధాలలో ( రిలేషన్ షిప్స్ - relationships )గానీ.. అవి యే తరహా బంధాలే గానీ, అవన్నీ బ్రేకప్ ఎప్పుడు అవుతాయీ అంటే - మనం ఎదుటివారి పట్ల చూపే నిర్లక్ష్యం, ఉదాసీనత ( పట్టించుకోకపోవటం ) ముఖ్యకారణాలు. ఇంకా కొన్ని కారణాలూ కూడా ఉంటాయి. 

ఎప్పుడైనా ఎదుటివారిని వారిని వారిలాగా చూడటం మానేస్తామో అప్పుడే ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తుంటాయి. వారిని వారిలాగా గుర్తించండి. ఎదుటివారికి కనీస మర్యాద అంటూ ఇవ్వండి. వారి అభిప్రాయాల్ని గౌరవించడం చెయ్యండి. వారితో కలిసినప్పుడు వారి మీదే దృష్టిని పెట్టండి. వారు చెప్పే విషయాల్నిఆసక్తిగా వినండి. మధ్య మధ్య ఊ కొట్టండి. ఎదుటివారి స్థాయి, అంతస్థు, హోదా వారికి ఇచ్చే తీరులోనే ఇచ్చేలా మీరు మెలగండి. అప్పుడే మీ మీద ఒక మంచి సదభిప్రాయం వస్తుంది. వారూ మీకు ఒక గుర్తింపునీ, గౌరవాన్నీ.. ఇస్తారు. 

ఒకరకముగా ఇది ఎలా ఉంటుందీ అంటే ఇచ్చిపుచ్చుకోవటంలా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలీ అంటే (నిజమైన ) ఆత్మీయ బంధాలు అన్నీ అద్దంలా ఉంటాయి. వాటిల్లో మనం ఏమి చూపిస్తే, అవి వాటినే ప్రతిఫలిస్తాయి. ఒకసారి తేడా చూపిస్తే, ఏమీ అనరు. కానీ మెల్లమెల్లగా దూరం చేస్తారు. అప్పుడు మీకు మీ ఆత్మీయులు అనుకున్నవారు దూరం అవుతారు. దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. 

ఆ నష్టం ఎలా అంటే - అంతవరకూ ఆ ఆత్మీయ బంధం ఏర్పడటానికి మీరు వెచ్చించిన సమయం, శ్రమ, డబ్బు... ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మళ్ళీ క్రొత్తగా వేరేవారితో ఆత్మీయ బంధం అంటూ ఏర్పరుకోవాలని అనుకుంటే - మళ్ళీ ఇంత శ్రమ, డబ్బు, సమయం.. వెచ్చించాల్సిందే ! అంత కష్టం మళ్ళీ చెయ్యటానికి మీరు ఇష్టపడతారా ? అందుకే ఈ విషయాన్ని ఆత్మీయ బంధాలు ఉన్నవారందరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. 




Monday, June 17, 2013

Good Morning - 370


పువ్వు పుట్టింది తుమ్మెద కోసం, 
ఆకాశం పుట్టింది వెన్నెల కోసం, 
ఈ భూమి పుట్టింది ఆ సంద్రం కోసం, 
నేను పుట్టింది నీ కోసం.. 

Sunday, June 16, 2013

పితృ దినోత్సవ శుభాకాంక్షలు.

నా మిత్రులకీ, 
తోటి బ్లాగర్స్ కీ, 
నా శ్రేయోభిలాషులకీ, 
నా అభిమానులకూ,  
వారి మిత్రులకూ, 
వారి కుటుంబ సభ్యులకూ - 
పితృ దినోత్సవ శుభాకాంక్షలు. 
Happy Father's day. 










అందరికీ నాన్న దినోత్సవ శుభాకాంక్షలు. 

Saturday, June 15, 2013

తొలకరి వర్షం.

వారం క్రిందట నా స్నేహితుని ఇంటికి వెళ్లాను. అక్కడ తనతో కాస్త మాట్లాడి బయటకి వచ్చేశాను. అప్పటికే ఆకాశం మేఘావృతం అయ్యింది. అప్పటిదాకా ఎంతో భీకరమైన ఎండలతో ఉన్న వాతావరణం ఉక్కపోతగా ఉంది. వాతారణ కేంద్రం సూచన మేరకు వర్షాలు పడటానికి ఇంకో వారం రోజుల సమయం ఉంది.

నా స్నేహితుడు " గొడుగు తీస్కెళ్ళరా వర్షం వచ్చేలా ఉంది! లేదా కాసేపు ఉండు.." అన్నాడు.

" కానీ ఇంటికేగా వెళ్ళేది. తొందరగానే వెళ్ళిపోతాను.." అన్నాను.

" ఉండు.. ఎందుకైనా మంచిది గొడుగు తెస్తాను.. " అని లోపలి వెళ్లాడు. అలా వెళ్ళాడో లేదో, చిన్నగా వర్షం మొదలయ్యింది. ఆకాశం వంక చూశాను. నల్లగా ఉంది. ఒకవైపు అంతా నల్లని మసి పట్టినట్లుగా మబ్బులు. ఇప్పట్లో వర్షం తగ్గదు. అక్కడే కాసేపు ఉండిపోవాల్సి వస్తుంది.. అనుకున్నాను.

అప్పుడే చప్పున ఒక చిన్న ఆలోచన. అర్థం అయ్యేసరికి పెదాల మీద చిన్నగా చిరునవ్వు. వావ్! మంచి ఐడియా అనుకున్నాను. వెంటనే " ర్రేయ్!.. గొడుగేమీ వద్దురా! అంతలోగా వెళ్ళిపోతాను.." అన్నాను. అతడి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకి వచ్చేశాను.

అప్పటికే వర్షం పెద్ద పెద్ద వర్షం చుక్కలుగా మొదలయ్యింది. నా బైక్ తీశాను. బలంగా కిక్ కొట్టేశా. ఒకే ఒక కిక్ కి స్టార్ట్ అయ్యింది. వర్షం పెద్ద చినుకుల నుండి సన్నని చినుకులుగా మారింది. అప్పటికన్నా ఇంకా బాగా కురవసాగింది. రోడ్డు మీదున్న జనం అంతా ప్రక్కనే ఉన్న షాపుల, ఇళ్ళ అరుగుల మీదకి చేరుకున్నారు. సో! రోడ్డు మీద నేనొక్కడినే. అందరూ నన్నే చూస్తున్నారు. వెనక నుండి స్నేహితుని కేక - కాసేపు ఆగరా ! అనీ.

ఒకమాదిరి వేగముతో, జాగ్రత్తగా నడుపుతూ, స్కిడ్ కాకుండా చూసుకుంటూ బండి నడిపాను. ( మాములుగా అయితే కొద్దిపాటి వర్షానికి నేల, బండి టైర్ సగం మాత్రమే తడిచి, రోడ్డు మీదున్న ఇసుక సరిగ్గా వెళ్ళిపోదు.. కాబట్టి స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ )

మామూలుగా ఎప్పటిదారిలో ఇంటికి వెళ్ళకుండా - చుట్టూరా వెళ్ళే దారిని ఎంచుకున్నాను. అలా రోడ్దేమ్మట హాయిగా ఆ వర్షం లో నానుతూ, మట్టి వాసన పీలుస్తూ వెళ్ళుతున్నాను. రోడ్డు మీద ఎవరూ లేరు. అందరూ ప్రక్కనున్న అరుగుల మీద నిలబడి నన్నే చూస్తున్నారు.

అలా వర్షాన్ని ఆస్వాదిస్తూ, అలా దూరపు రహదారి గుండా సాగిన నా ప్రయాణం - ఇంటికి చేరుకోనేసరికి నేను వర్షములో తడిసి ముద్దయ్యాను.

మా ప్రక్క పోర్షన్ పెద్దావిడ " ఏం! బాబూ.. తొలకరి వర్షములో నానావా? అదృష్టవంతునివి.." అన్నారు.

అవును! అదృష్టవంతుడినే !.. ఈ సంవత్సరంలో కురిసిన తొలి వర్షములో కావాలని, నానిన అదృష్టవంతుడినే. తొలకరి వర్షంలో నానాలని ఉండి కూడా, ఏదో తెలీని బిడియం వల్ల చిన్న చిన్న ఆనందాలకి దూరం అయ్యే అభాగ్యులు ఎందరో!..

Friday, June 14, 2013

Good Morning - 369


మన ఆలోచనలు, మాటలు, చేతల మధ్య ఖచ్చితముగా పొంతన ఉంటే ఫలితం అత్యంత సులువుగా వస్తుంది. 

Thursday, June 13, 2013

Good Morning - 368


మనిషి ఒక్కసారి తీసుక్న్న నిర్ణయాలను ఎంత శ్రమ అయినా ధైర్యముతో ఎదుర్కొని సాధించగలిగే సత్తా ఉండాలి. అప్పుడే తన జీవితములో ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతాడు. 

Wednesday, June 12, 2013

Soul mate friend - 3

(ప్రాణ) స్నేహితుడు ఎలా ఉండాలీ అంటే :  

మీతో జరిగిన పరిచయాన్ని, స్నేహముగా మార్చుటకి తన వంతు ప్రయత్నం కూడా ఉండాలి. 




స్నేహములో నమ్మకం అతి ప్రధానమైనది. ఎప్పుడైతే మిమ్మల్ని మోసగాడు, చంచల మనస్కుడు, చెడు నడవడిక ఉన్నవాడు, పనీపాట లేనివాడు.. అని అవతలివారు ఎప్పుడైతే అనుమానించటం మొదలు పెడతారో అప్పుడు ఆ స్నేహానికి కాసింత దూరముగా జరగటం అన్నివిధాలా శ్రేయస్కరం. ఇక్కడ మీలో అవతలివాళ్ళు పేర్కొన్న ఆ లక్షణాలు అస్సలుకే ఉండకూడదు. అలా లేని నాడు, అయినా మీపై అలా చెడు ప్రచారం వచ్చి ఉంటే - ఇక ఆ స్నేహానికి నీళ్ళు వదులుకోవాల్సిందే.. 

మీ ఇద్దరి మనస్సులూ కలిసాయి. ఇద్దరి అభిరుచులూ, వేవ్ లెంత్ లూ కలిసాక ఆత్మీయనేస్తంగా  మారిపోవచ్చును. మీ స్నేహితునికి, మీకూ సవాలక్ష ఉంటాయి. ఆ సమయములో - ఈ ప్రపంచములో అన్ని స్నేహాల్లో జరిగినట్లే, మీ చుట్టూ ఉన్న సమాజం మీ స్నేహానికి పరీక్ష పెడుతుంది. అదేమిటంటే - ఇతరులు మీలో ఒకరిమీద ఒకరికి అపోహలు కలిగిస్తారు. అవి నమ్మదగినట్లుగా, నిజమే, మన చాటుగా ఇలా, ఇంతగా జరిగిందా? అనుకొనేలా ఉంటాయి అవి. ఒక్కోసారి అవి యదార్థమే అన్నట్లు అగుపిస్తాయి కూడా.! అలాంటి సమయాల్లోనే మీ స్నేహం ఎంత సరియైనది అని తేలిపోతుంది. చాలా స్నేహాల్లో ఇక్కడే దెబ్బతింటాయి. 

లా మీ ఇరువురి మధ్య తగువులు కలిగించేవారు ఎవరో ముక్కు మొహం తెలీనివారై ఉండరు. మీ ఇరువురితో చనువుగా ఉంటూ, అప్పటివరకూ మీ ఇద్దరి అభిమానాన్నీ సంపాదించుకున్న వారే ఎక్కువగా ఉంటారు. అంతగా దగ్గరివారే అలా చెప్పాక - మొదట్లో మనసు నమ్మదు. ఏదో ఒక బలహీన క్షణాన, మనసు ఊయలలూగుతుంది. వీళ్ళు చెప్పేది నిజమేమో.. నా కళ్ళు, మనసు నన్ను మోసం చేసాయేమో అన్న అనుమానం మొదలవుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఉక్కు లాంటి దృడమైన మీ స్నేహబంధం - వేడయినప్పుడే ఇనుము వంగుతుంది - అన్న చందాన ఆ చెప్పేవారి మాటలు వినడాన్న, చెప్పింది నమ్మడానికీ, సిద్దముగా ఉంటారు. ఇక మీ స్నేహబంధానికి బీటలు మొదలయినట్లే. 

మధ్యలోని వాళ్ళు చెప్పిన మాటలని - అదేంటోగానీ గుడ్డిగా నమ్మేస్తారు. అప్పటివరకూ ప్రాణంగా భావించిన స్నేహితుడిని విశ్వసించరు. మాట్లాడుకున్న మాటలూ, చేసుకున్న బాసలూ, పంచుకున్న అనుభూతులూ.. ఒకటేమిటీ? అన్నీ హుష్! అప్పటిదాకా కోకిల కూజితాల్లా వినిపించిన స్నేహితుని పిలుపు - గార్ధభ ( గాడిద ) స్వరాలుగా వినిపిస్తాయి. ఎన్నడూ రాని విసుగు ఇక ప్రతి నిమిషమూ వస్తూనే ఉంటుంది. ఇక అంతగా వచ్చిందంటే ఇక స్నేహం మనలేదు..

లాంటి సందర్భాల్లో - అలాంటి అనుమానం మొదలయినప్పుడే - ఆ ఇద్దరు స్నేహితులు మాత్రమే కలిసి మాట్లాడుకుంటే ఎప్పటిలాగే ఆ స్నేహం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ఆ కలుసుకొని మాట్లాడుకోవటం కూడా ఎవరికీ తెలీకుండా ( అక్కడికి వచ్చి, ప్రభావితం చెయ్యకుండా ఉండేలా ) చోటు చూసుకొని, వచ్చిన అపార్థాలకి వివరణలు ఇచ్చి, పుచ్చుకోవడం చాలా మంచి పద్ధతి. ఇక్కడ వచ్చిన అపోహలు, అపార్థాలు ఎలా వచ్చాయో చర్చించాలి గానీ ఎవరు చెప్పారో, ఎప్పుడు, ఎక్కడ చెప్పారో మాట్లాడుకుంటే ఇక అసలు సమాధానాలు రాకపోవచ్చును. ఆ విషయాలు చివరిలో మాట్లాడుకోవడం మంచి పద్ధతి. 

చ్చిన అనుమానాల్ని ఒకేసారి కుమ్మరించినట్లు, ఉక్కిరిబిక్కిరి చేసినట్లు అడగక, ఒక్కో వాక్య ప్రశ్నలా అడగండి. అదీ మీ మొహాన ప్రశాంతముగా ఉంటూ, మాటలు మృదువుగా, నెమ్మదిగా, అనునయిస్తున్నట్లుగా ఉండాలి గానీ, కోపముతో, తిడుతూ, నిందాకర మాటలతో, అసహ్యకరభాష మాట్లాడుతూ - మీ అనుమానాలు తీర్చుకోవాలి అనుకుంటే మొదటగా దెబ్బ తినేది మీరే. ఎందుకంటే - అవతలివారికి మీ గురించి బయటవారికి చెప్పుకోవటానికి ఒక అవకాశం ఇస్తున్నట్లే.. " మామధ్య ఏర్పడ్డ అపోహలకి సమాధానాలు ఇవ్వడానికి నేను మామూలుగానే వెళితే ఇలా చేశాడు.." అనేలా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. ఆతరవాత ఇక మీరు ఈ జన్మలో కలుసుకోకపోవచ్చును. 

మీ మధ్యలోకి ఇంకోకరిని రానివ్వకండి. వస్తే - వెనకటి సామెతలా - ముగ్గురు కలిస్తే ముడివడదు.. అన్న చందాన వారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. మీ వాదనే సరియైనది అని అహం తో తనని కన్వియన్స్ చేస్తారు. నిజానికి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది అపోహలు ఏర్పడ్డ మీ మిత్రునితో. కానీ, అలాచేస్తే - పొరబాట్లని సరిదిద్దుకుందాము అని వచ్చిన మిత్రుడు ఈ పరిణామంతో ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గొడవ కాకుండా వారిని అక్కడ ఉండటానికి మీరిద్దరూ ఒప్పుకుంటే, మధ్యలో కల్పించుకోకుండా ఉండేలా, పోట్లాడుకోకుండా ఉండేలా చూడుమనేలా - ముందే చెప్పండి. 

మధ్యవర్తి అంటే ఇరువురికీ గౌరవం ఉన్నవారై ఉండాలి. తను మైండ్ మెచ్యూర్ అయిన వ్యక్తి అయిఉండాలి. అలాగే ఇంకో ప్రధాన అర్హత ఏమిటంటే - మీరిద్దరూ మాట్లాడుకున్నవి బయట ఎక్కడా చెప్పనివారై ఉండి, తనలోనే ఆ విషయాలని అక్కడే సమాధి చేసేవారై ఉంటే మరీ మంచిది. అలాగే తప్పోప్పులని నిజాయితీగా, నిర్భీతిగా, అలా ఎందుకో విశ్లేషిస్తూ చెప్పగలిగే మధ్యవర్తి దొరికితే - మీ ఇద్దరి అదృష్టమే అనుకోవాలి. అవసరమైతే (ఒంటరిగా ఉన్నప్పుడు ) మిమ్మల్ని తిట్టి, బుద్ధి చెప్పేలా ఉండాలి. అలా వారు గనుక ఉంటే - అప్పుడు మీకు నచ్చకున్నా, తరవాత మాత్రం మీరు మరింత ఆనందముగా ఉంటారు. 

ధ్యవర్తి ఉన్నాడు, అంతా తనే చూసుకుంటాడు అని వదిలేయ్యకండి. మీరూ ఆక్టివ్ పాత్ర పోషించండి. ఎందుకంటే ఇక్కడ సమస్య మీది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఏదైనా అంతా మీరే అనుభవించాల్సి ఉంటుంది. మధ్యలోని వారు వారి పాత్రని సరిగ్గా పోషించకుంటే - మీకే దెబ్బ. అందుకే మీరే అన్నీ చూసుకోవడం మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సంఘటన తరవాత విశ్లేషిస్తే - మీరు అక్కడ సరియైన పద్ధతులల్లోనే, అన్నివిధాలా ప్రయత్నించారు అనేలా ఉండాలి. స్నేహంని బాగుచేసుకోవటానికి అన్నిరకాలుగా ప్రయత్నించారు అన్న అభిప్రాయముతో - మిగిలిన జీవితములో ప్రశాంతముగా ఉండగలరు. లేకుంటే తీరని వ్యధనే. ఇలా అభిప్రాయం ఏర్పడాలి అంటే మీరు చాలా ఎదగాల్సి ఉంటుంది. 

( మరికొంత తరవాతి టపాలో.. )

Tuesday, June 11, 2013

Good Morning - 367


బంధాలు బంధనాలు అయితే జీవితం ఒక ఖైదు లాగానే ఉంటుంది. జన్మ అంతా శిక్ష తప్పదు. 

Monday, June 10, 2013

ఖుష్ మహల్ (సితాబ్ ఖాన్ మహల్), వరంగల్ కోట.

వరంగల్ ని పరిపాలించిన కాకతీయుల సామ్రాజ్యం యొక్క తాలూకు ఆనవాళ్ళు - వరంగల్  కోట Warangal Fort లో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కోట నగరానికి దగ్గరలోనే ఉంటుంది. ఈజీగా చేరుకోవచ్చును. ఈ కోట బయట ప్రాకారము మట్టితో చేయబడి, ఎత్తుగా ఉంటుంది. ఆ తరవాత కొద్ది అడుగుల దూరములో రాతితో కట్టబడిన ప్రాకారము ఉంటుంది. ఈ రెండింటినీ కొద్దిగా తొలగించి, అందులోంచి రహదారి వేశారు. అలా ఈ వరంగల్ కోటలోకి రావచ్చును. 

ఈ క్రిందున్న పటం శిల్పాల సముదాయం వద్ద కనిపిస్తుంది. నిజానికి ఇది బయట అక్కడక్కడ పెట్టాలి. ఈ గైడ్ మ్యాప్ ని మీ దగ్గర ఉంటే - అన్నీ చూడవచ్చును. చాలానే నడవాల్సి ఉంటుంది. అందుకే కొద్దిగా దృఢమైన వారు ఈ కోట అంతా తిరగటానికి ప్రయాణించాలి. మొత్తం తిరగటానికి ఒక పూట పడుతుంది. శిల్పాల నగిషీ పనితములో మీకు గనుక ఆసక్తి గనుక ఉంటే - చాలా సమయమే పడుతుంది. ఇక్కడ ఉన్నదంతా శిల్పాల శిథిలాలు, రాక్ గార్డెన్  పార్క్, చెరువు, చెరువు ప్రక్కనే ఉన్న ఏకశిలా పర్వతం. 

దగ్గరలో ఏమీ తినడానికి కనిపించలేదు. ముందే ఆ పని కానిచ్చేసి, ఇక్కడికి రావాలి. ఏదైనా సరే - పెద్దగా అంచనా వేసుకొని దర్శిస్తే - నిరాశాపొందటం ఖాయం. మామూలుగా యే అంచనా లేకుండా వస్తే - సంతోషముగా ఉండి, ఒకటి మంచి స్థలాన్ని దర్శించం అన్నట్లు ఉంటుంది. ఇది అన్ని యాత్రాస్థలాలకూ, జీవితాన చాలా విషయాలకి అన్వయం అవుతుంది. 

నిజానికి ఈ పార్క్ ని అభివృద్ధి చెయ్యొచ్చు. కానీ ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. పచ్చని పచ్చిక గార్డెన్, ఉద్యానవనం వాటర్ ఫాల్స్, హైమాస్ట్ లైట్స్ పెడితే ( ఇవన్నీ ఉన్నాయి కానీ నిర్వహణ లేక లేనట్లే కనిపిస్తాయి ) టూరిస్ట్స్ మరింతగా పెరిగి, రోజువారీ రెట్టింపు ఆదాయం వస్తుంది. నగరానికి మరింత లాభముగా ఉంటుంది. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చెయ్యరో.. 

ఇప్పుడు మనం వరంగల్ కోటకి వచ్చేద్దాం. ఇక్కడ శిల్పాల శిధిలాలు - అవీ అద్భుత కళాఖండాల తాలూకు భాగాలు లభ్యం అయితే ఇక్కడ పార్క్ గా ఏర్పరిచారు.  ఇప్పుడు ఆ కోటలోని భాగం అయిన సితాబ్ ఖాన్ మహల్ Sitab khan mahal దగ్గరికి వెళదాం. ఇది సితాబ్ ఖాన్ కట్టించాడు కాబట్టి అలా పేరు వచ్చింది అంట. ఈ మహల్ నే ఖుష్ మహల్  Khush mahal గా కూడా పేర్కొంటారు. ఇక్కడ రాజులు తమ పరివారముతో  సరదాగా స్నానాలకి వచ్చేడివారట. నిర్మాణము కూడా అలాగే ఉంది.  ఈక్రింది మ్యాప్ లో బాణం గుర్తు చూపిన దగ్గర ఈ ఖుష్ మహల్ ఉంటుంది. 

ఫొటోస్ అన్నీ చూడటానికి వీలుగా కంప్రెస్ చేసి, సైజ్ తగ్గించాను. మొదటి ఫోటో మీద క్లిక్ చేసి, బాణం గుర్తు కీలని వాడి పెద్దగా చూడండి. 


ఈ ఖుష్ మహల్ ఈ కోటకి పడమటి భాగాన ఉంటుంది. అంటే పశ్చిమ ద్వార మార్గములో ఉంటుంది. ఈ మహల్ ముందువరకూ వాహనములో వెళ్ళొచ్చును. ఈ మహల్ ప్రక్కనే పెద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పరిచారు. పార్కింగ్ ఫీజు ఏమీ లేదు. 


ఇదే ఖుష్ మహల్. చాలా పెద్దగా ఉంటుంది. కాకతీయుల శైలి కాకుండా, మహ్మదీయుల వాస్తు శైలిలో నిర్మాణం కనిపిస్తుంది. ప్రక్కగా పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. అవి నిలువుగా, కాసింత కష్టముగా ఎక్కాల్సిన విధముగా ఉంటాయి. ఎదురుగా పెద్ద రాతి ద్వారం కనిపిస్తుంది. లోపల మరో ద్వారం ఉంటుంది. 


ఈ మహల్ గురించి, మరిన్ని వివరాలు ఇందులో తెలుగులో, ఆంగ్లములో ఉన్నాయి. 


మొదటి ద్వారం ముందట ఇలా విరిగిన డ్రాగన్ సింహాల శిలారూపులు ఉంటాయి. 


పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టిన ద్వారం ఉంటుంది. అంత పెద్ద బండరాళ్ళతో ఎలా కట్టారా? వాటిని అంత ఎత్తుకి ఎలా మోశారా అని అనిపిస్తుంది. అంతగా ఖచ్చితమైన రూపం ఎలా వచ్చిందో, అలా రావటానికి ఎంతగా శ్రమించారో అని అనిపిస్తుంది. 


ప్రధాన ద్వారానికి అటూ ఇటూ  విరిగిన కళాఖండాల్ని అందముగా అమర్చారు. 


లోపలికి వెళ్ళటానికి ప్రధాన ద్వారం. లోపలికి ప్రవేశం ఉచితం. కోట పార్కు వద్ద టికెట్ ( రూ. 5 ) తీసుకుంటే, అదే టికెట్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. 


ఈ మహల్ లో లోపల ఇలా ఉంటుంది. మధ్యలో ఒక ఫూల్ మాదిరిగా లోతుగా ఉంటుంది. అందులో జలకాలు ఆడి, ఉల్లాసముగా ఉండటానికి ప్రయత్నించేవారట. మధ్యలో ఉన్న పూల్ చుట్టూ ఇలా ఇనుప పైపుల బారికేడ్ కట్టారు. ద్వారాల ప్రక్కన ఉన్న గోడలని ఆనుకొని, అక్కడ చుట్టూరా లభ్యమైన ఖండిత శిల్పాలని అమర్చారు. వాటిలో బాగున్నవి కొన్ని క్రింద ఉన్నాయి. చూడండి. లోపల అంతకన్నా చూడటానికి ఇంకేమీ లేదు. 


లోపల ఏమీలేదు అనుకోవటానికి వద్దన్నట్లుగా, అక్కడక్కడ దొరికిన దండయాత్రల్లో నాశనమయిన అపురూప శిల్ప కళాఖండాల్ని ఇక్కడ అందముగా అలంకరించారు. వాటిల్లో శిల్ప జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాంటి ఒంటరిగా మిగిలిపోయిన శిల్పాల భాగాలని ఇలా ఎత్తైన పీఠం మీద అమర్చారు. 



గణేశుని ప్రతిమ. 


కలశం 




అవి చూశాక ఇలా ఈ మెట్ల మీదుగా ఈ మహల్ పైకి చేరుకుందాం. అలా పైకి వెళ్లటం కాస్త కష్టమే. ఎందుకూ అంటే కాసింత నిట్టనిలువుగా ఆ మెట్లు ఉండి, ఎత్తుగా ఉంటాయి. 


ఆ మహల్ కి ప్రక్కగా ఉన్న మెట్ల మీదుగా ఆ మహల్ పైకి వెళితే పైన ఇలా ఉంటుంది. 





పైనుండి చూస్తే ఇలా చుట్టుప్రక్కల ప్రాంతాలు కనిపిస్తాయి. ఆ తారు రోడ్డు ఈ ఖుష్ మహల్ కీ, పశ్చిమ ద్వారానికి వెళ్ళే దారి. ఈ ప్రక్కన ఉన్నది పార్కింగ్ స్థలము. దూరముగా తెల్లగా, గోడలా కనిపిస్తున్నది - ఖండిత అపురూప శిల్ప కళాసంపద ఉన్న స్థలం. ఆ స్థలం గురించి మరో టపాలో చెప్పుకుందాం. 


ఖుష్ మహల్ ముందు రోడ్డు స్థలం ఇలా ఉంటుంది. 



ఇది ఖుష్ మహల్ కి ఎదురుగా ఉన్న స్థలం. ఇలా ఓపెన్ గా ఉంటుంది. ఇందులో తిన్నని దారికెదురుగా పచ్చని లోతైన స్థలం కనిపిస్తున్నదా? దాన్నే శృంగార బావి అంటారు. ఎండాకాలములో దీన్ని దర్శించుకున్నాం కాబట్టి నీళ్ళు లేవేమో. 


ఈ బావి చుట్టూరా నడవడానికి దారి ఉంటుంది. నేను బైక్ మీద వెళ్లాను కాబట్టి హాయిగా ఒక చుట్టూ వేశాను. అలా ఖుష్ మహల్ సందర్శన ముగిసింది. 

Sunday, June 9, 2013

Good Morning - 366


బంధువుల్లోని స్వార్థం, 
స్నేహితుల్లోని అసూయ, 
ఏదోనాడు మీకు ప్రమాదకరం కావచ్చును. 

అవును.. బంధువుల్లోని స్వార్ధం, మన జీవితం పట్ల స్నేహితులు చూపే అసూయ ఎప్పుడో ఒకసారి మనల్ని నిలువునా ముంచేస్తాయి. ఫలితముగా జీవితాన దెబ్బ తింటాం. ఆ ముంచటం అనేది ఉప్పెనలా, సునామీలా కనిపించదు. చాప క్రింద నీరులా .. పచ్చిగా అయ్యేవరకూ తెలీదు. తెలుసుకున్నాక వారిని ఏమీ అనలేని స్థితిలో ఉంటాం. ఇక అప్పటి నుండీ పైకి మామూలుగా ఉన్నా, లోలోన నిర్లిప్తత మొదలవుతుంది. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయినా ఇలా అందరు ఉండరు. యే కొద్దిమంది మాత్రమే అలా. కానీ కొద్దిమంది ప్రభావమే చాలా ఉంటుందని మరవకూడదు. 

Related Posts with Thumbnails