Wednesday, December 5, 2012

నీ గుండె గూటిలో నా గుండె హాయిగా లాకెట్

" ఈగ " సినిమా చూశాక, అందులో మైక్రో ఆర్టిస్ట్ అయిన హీరోయిన్ తయారుచేసిన లాకెట్ అందరికే కాదు నాకూ బాగా నచ్చేసింది. " నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా?.." అని బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ ఉండే ఆ లాకెట్ ని ఆ సినిమాలో హీరోయిన్ మెడ గొలుసుకి వేసుకుంటుంది. .  

నిజానికి ఈ లాకెట్ డిజైన్ ని నేను అంతర్జాలములో చూశాను. ఒక విదేశీ కళాకారుడు పెన్సిల్ లోని లెడ్ / గ్రాఫైట్ ములుకు ని అలా చెక్కాడు. అది ఎంత పర్ఫెక్షన్ గా చెక్కాడూ అంటే - ఆ పెన్సిల్ మధ్య భాగాన వచ్చిన హృదయాకారం, దానికి చేసిన లింక్ కూడా పెన్సిల్ గ్రాఫైట్ తోనే చేశాడు. ఆ లింక్ కూడా మామూలుగా కాదు. గాలిలో ఆ హృదయాకారం అటూ, ఇటూ ఊగేలా చేశాడు. నిజానికి అదో అద్భుతమైన కళాఖండం. ఆ కళాకారుడిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. చాలా మృదువుగా ఉండే ఆ గ్రాఫైట్ ని అలా చెక్కడం - చాలా ఓర్పుగా చెయ్యాల్సిందే. ఏమాత్రం కాసింత అజాగ్రత్తగా ఉంటే చాలు. పనికిరాకుండా పోతుంది. అదే ఈ క్రింది ఫోటో. ఇది ఆ కళాకారుడు చెక్కినది. 


సినిమాలో హీరోయిన్ వేసుకున్న లాకెట్ ని మా అమ్మాయి ఇష్టపడింది. పదే పదే ఆ లాకెట్ గురించి మాట్లాడుతూ ఉంటే - అలాంటిది ఒకటి చేసివ్వాలని అనుకున్నాను. తను దగ్గరలో లేనప్పుడు - ఆ లాకెట్ గురించి ఆలోచన చేశాను. చాలా సింపుల్ గా ఉంది అనుకున్నాను. కానీ చెయ్యటం మొదలెట్టాక, అందులోని కష్టం ఏమిటో తెలియసాగింది. మొత్తానికి చాలా శ్రమ పడి, చేశాను. మొదట్లో ఎలా చెయ్యాలో తెలీక చాలా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ చేశాక ఆ ఇబ్బంది పోవటానికి ఒక కిటుకు కూడా తెలుసుకున్నాను. 

గొలుసుల లింక్ కూడా పెడదాం అనుకున్నాను. కానీ నా దగ్గర తగిన పరికరాలు లేకపోవటంతో అలా చెయ్యక, నేరుగా ఉండేలా చేశాను. మొత్తానికి ఈ లాకెట్ చేసి రెడీ చేశాను. తనకి చూపించాను. ఆశ్చర్యముతో "వావ్.. డాడీ.. ఇది నాకేనా?.." అంది. " నాకకు.. గానీ నీకే నాన్నా!" జోక్ చేస్తూ అన్నాను. ఆరోజు తన మెడలో వేసుకొని, స్కూల్ కి వెళ్ళింది. అందరూ అబ్బా!.. అంటూ ఆశ్చర్యం చూపించారు. దానితో తను టాక్ అఫ్ ది స్కూల్ అయ్యింది. చాలా గర్వముగా ఫీలయింది కూడా. ఒకసారి మీరూ చూడండి. (నిజానికి ఈ పోస్ట్ రెండు నెలల క్రిందనే పోస్ట్ చెయ్యాలి - కానీ సమయం లేక నెమ్మదిగా పోస్ట్ చేశాను. జీవితాన కాస్తంత బీజీ అవుతున్నాను) 






6 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అద్భుతం రాజ్ గారు. మీ ఆసక్తి,పనితనం అన్నీ కలగలిపి.. వెల కట్టలేని బహుమతిని అమ్మాయికి ఇచ్చారు. తను చాలా లక్కీ గర్ల్ .

మీ 200 వ శుభోదయం పోస్ట్ కోసం చూస్తే.. అంతకన్నా ఆసక్తి కరమైన విషయం.

అభినందన మందారమాల.

ధాత్రి said...

బాగుందండి..:)

Priya said...

Wow!! chaalaa baagaa chesaarandee :) Mee ammaayi yentho lucky.. intha preminche naanna dorikinanduku!

Raj said...

@ వనజవనమాలిని గారూ.. మీ అభినందనలకు ధన్యవాదములు. అవును.. తను లక్కీ గర్ల్ యే. తన క్లాస్ మేట్స్ అందరూ అదే మాట.

200 పోస్ట్ వేద్దామనే అనుకున్నా.. చాలా పోస్ట్స్ వ్రాసే తీరుబాటు లేక సమయం దొరకడం లేదు. నిన్న దొరికితే వ్రాశాను.

Raj said...

ధాత్రి గారూ.. ధన్యవాదములు.

Raj said...

ప్రియ గారూ!.. ధన్యవాదములు. నా కుటుంబసభ్యుల సహకారం వల్లనే నేను ఎదిగాను. నిజం.! అది ఏమిటో వీలుచేసుకొని ఒక పోస్ట్ వేస్తాను.

Related Posts with Thumbnails